బిగ్ బాస్ ఐదో సీజన్‌ వివరాలు లీక్: షోపై వచ్చేవన్నీ పుకార్లే.. ప్రోమో.. లోగో.. ప్రసారం అప్పుడే!

తెలుగు బుల్లితెరపై ఎన్నో షోలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే విపరీతమైన ప్రభావాన్ని చూపించి నెంబర్ స్థానంలో నిలుస్తాయి. తద్వారా ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తాయి. అలాంటి షోలలో బిగ్ బాస్ ఒకటి. ఏమాత్రం అంచనాలు లేకుండానే మొదలైన దీనికి తెలుగు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, ఇప్పుడు ఐదో సీజన్‌ను మొదలెట్టబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సీజన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే...

విజయవంతంగా నాలుగు సీజన్లు

విజయవంతంగా నాలుగు సీజన్లు

హిందీలో బిగ్ బాస్ షో ఎప్పుడో ప్రారంభం అయింది. దాని తర్వాత దేశంలోని పలు భాషల్లో ఇది మొదలైంది. ఈ క్రమంలోనే తెలుగులోకి కూడా కొన్నేళ్ల క్రితం పరిచయం అయింది. అప్పుడు ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ షోకు.. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. దీంతో ఇది సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే నాలుగు సీజన్లు పూర్తయ్యాయి.

షోలో భాగమైన ముగ్గురు హీరోలు

షోలో భాగమైన ముగ్గురు హీరోలు

తెలుగులో బిగ్ బాస్ షో ఇంత సక్సెస్ అవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే, ఇది ప్రేక్షకుల వరకూ వెళ్లిందంటే మాత్రం.. దానికి హోస్టులుగా పని చేసిన స్టార్ హీరోలదే ఆ ఘనత అని చెప్పొచ్చు. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని, మూడు నాలుగు సీజన్లను నాగార్జున తమ తమ అద్భుతమైన హోస్టింగ్‌తో నడిపించారు. తద్వారా సక్సెస్‌లో భాగం అయ్యారు.

తెలుగు బిగ్ బాస్ నేషనల్ రికార్డు

తెలుగు బిగ్ బాస్ నేషనల్ రికార్డు

బిగ్ బాస్ షో దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోంది. అయితే, అన్ని చోట్ల కంటే తెలుగులో వచ్చే దానికే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకే ఇక్కడ ప్రతి ఏడాది సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అక్కినేని నాగార్జున హోస్టు చేసిన నాలుగో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 పైచిలుకు రేటింగ్ దక్కింది. దీంతో టీఆర్పీలో నేషనల్ రికార్డును క్రియేట్ అయింది.

ఐదో సీజన్ మొదలవుతుందంటూ

ఐదో సీజన్ మొదలవుతుందంటూ

ప్రతి ఏడాది బిగ్ బాస్ సీజన్ ప్రారంభం అవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే నాలుగు సీజన్లు పూర్తయ్యాయి. దీంతో ఇప్పుడు ఐదో సీజన్‌పై అందరి కళ్లూ పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇది పలానా నెలలో ప్రారంభం అవుతుందంటూ ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అదే సమయంలో కంటెస్టెంట్ల లిస్టు ఇదే అంటూ కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో ఇది ముందే ట్రెండ్ అవుతోంది.

ఐదో సీజన్‌పై అలా అనుమానాలు

ఐదో సీజన్‌పై అలా అనుమానాలు

బిగ్ బాస్ ఐదో సీజన్ జూలైలోనే ప్రారంభం అవుతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం భారీగా పెరిగిపోయింది. దీంతో ఇది ప్రారంభం అవడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ, జూలైలోనో, ఆగస్టులోనో ఇది మొదలవుతుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రేక్షకులు ఏం జరుగుతుందో తెలియక అయోమయం అవుతున్నారు.

బిగ్ బాస్ సీజన్‌పై సెన్సేషనల్ లీక్

బిగ్ బాస్ సీజన్‌పై సెన్సేషనల్ లీక్

బిగ్ బాస్ ఐదో సీజన్ ఈ ఏడాది ఉంటుందా? ఉంటే ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? ఈ సారి ఎవరెవరు కంటెస్టెంట్లుగా వస్తారు? అంటూ తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఎన్నో ఫేక్ న్యూస్‌లో పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రోమో, సింబల్, ప్రారంభ తేదీల గురించి సెన్సేషనల్ విషయాలు తాజాగా బయటకు వచ్చాయి.

అవన్నీ పుకార్లే.. అసలు మేటర్ ఇదే

అవన్నీ పుకార్లే.. అసలు మేటర్ ఇదే

తాజా సమాచారం ప్రకారం.. బయట ప్రచారం జరుగుతున్నట్లు బిగ్ బాస్ జూలైలోనో, ఆగస్టులోనో ప్రారంభం కావడం లేదట. ఇది సెప్టెంబర్ మూడో వారం నుంచి మొదలవుతుందని తెలిసింది. అంతేకాదు, మొదటి వారంలో ఐదో సీజన్‌కు సంబంధించిన లోగోను రిలీజ్ చేయబోతున్నారట. ఆ వెంటనే ఫస్ట్ ప్రోమోను కూడా విడుదల చేస్తారని తెలిసింది. హోస్టుగా నాగార్జునే ఉంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X