For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: సన్నీని విసిరి పారేసిన శ్రీరామ్.. ఈసారి న్యూ కెప్టెన్ అతడే!

  |

  బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో రోజు రోజుకు గొడవలతో మరింత ఆసక్తికరంగా మారుతోంది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లకు కంటెస్టెంట్స్ చాలావరకు సహనాన్ని కోల్పోతున్నారు. గత రెండు వారాలుగా చూసుకుంటే సన్నీ పలు టాస్క్ లలో హైలెట్ అవుతున్నాడు. ఎక్కువగా ఇతరులతో గొడవలకు దిగుతున్నారు. అతను ఎంత గొడవ పడుతున్నా కూడా మాట్లాడే విధానం చాలా కరెక్ట్ గా ఉందని ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం సోషల్ మీడియాలో మద్దతు పలుకుతున్నారు.

  గతంలో ఎప్పుడూ లేనివిధంగా సన్నీ తన కంటే బలమైన కంటెస్టెంట్స్ తో కూడా పోటీకి దిగనున్నాడు. ఇక ఈ సారి హౌస్ లో కెప్టెన్ ఎవరు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక చివరగా బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ కెప్టెన్ టాస్క్ లో గెలిచినట్లు తెలుస్తోంది. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమోతో ఆ విషయంలో కొంత క్లారిటీ వచ్చేసింది.

  కెప్టెన్ అయితేనే..

  కెప్టెన్ అయితేనే..

  బిగ్ బాస్ లో ఎన్ని టాస్క్ లు ఉన్నా కూడా కెప్టెన్సీ టాస్క్ అనేది చాలా ముఖ్యమైనది. ఎలిమినేషన్ లో ఉన్నవారికి ఇది మరొక ఆయుధం అని చెప్పవచ్చు. తప్పకుండా కెప్టెన్ అయితేనే హౌస్ లో వారికంటూ ఒక ప్రత్యేకమైన హోదా పెరుగుతుంది. అయితే ఆ క్రమంలో శత్రువులు కూడా గట్టిగానే పెరుగుతారు. అయినప్పటికీ కూడా కంటెస్టెంట్స్ అన్ని దారుల్లో కూడా సమానంగా పోటీపడుతూ ముందుకు సాగుతూ ఉండాలి.

  వెంటాడు.. వేటాడు..

  వెంటాడు.. వేటాడు..

  గత వారంలో మొదటిసారి సన్నీ హౌస్ లో క్యాప్టెన్ గా బ్యాండ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి కూడా అతను ఆ పోటీలో నిలిచాడు. అతనితోపాటు షణ్ముఖ్ జస్వంత్ మానస్ సిరి శ్రీరామచంద్ర అనీ మాస్టర్. వీరిలో ఎవరు ఫైనల్ టాస్క్ ను గెలుస్తారో వాళ్ళు ఇంటికి కెప్టెన్ గా సెలెక్ట్ అవుతారు. ఇక బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం ఫైనల్ గా వెంటాడు వేటాడు అనే టాస్క్ ఎవ్వడం జరిగింది.

  పోటీలో ఐదుగురు

  పోటీలో ఐదుగురు

  ఒక రింగు మధ్యలో ఈ ఐదుగురి కంటెస్టెంట్స్ కూడా తిరుగుతూ ఉండాలి అయితే వారి భుజాన తగిలించుకున్న బ్యాగులో తర్మకోల్ ఉంటుంది. బ్యాగ్ లో నుంచి ఇతరుల తర్మకోల్ ని బయట పడేయాల్సి ఉంటుంది. అలా ఎవరు అయితే చివరగా పోటీపడి మిగులుతారో వారే ఇంటికి కొత్త కెప్టెన్ గా సెలక్ట్ అవుతారు.. ఇక నియమాల గురించి చెప్పడంతో ఒక్కొక్కరు కూడా పోటీలో గట్టిగానే తలపెట్టినట్లు తెలుస్తోంది.

  ఎత్తిపడేసిన శ్రీరామ్

  అయితే సంచాలకుడిగా జెస్సి ఉండటం తో గొడవ మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. శ్రీరామచంద్ర సన్నీ ఇద్దరు కూడా మరోసారి ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ సీరియస్ అయ్యారు అని అర్థమవుతుంది. శ్రీ రామచంద్ర అయితే ఏకంగా సన్నీని ఎత్తి పట్టేసినట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో సన్నీ ఏమి చేయలేక పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. ఇక సన్నీ ఇండిపెండేట్ ప్లేయర్ అని అనుకున్నాను అంటూ శ్రీరామచంద్ర మరింత రెచ్చగొట్టాడు. బిగ్ బాస్ అయిపోలేదు అంటూ సన్నీ చాలా సీరియస్ అయిపోయాడు. సన్నీ ఇక్కడే ఉంటాడు అని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవల వాతావరణం మరింత వేడెక్కింది.

  బిగ్ బాస్ అయిపోలేదు

  బిగ్ బాస్ అయిపోలేదు

  మరోవైపు మానస్ ను షణ్ముఖ్ జస్వంత్ కిందపడేసి ప్రయత్నం చేశాడు. శ్రీ రామచంద్ర కూడా అతనే టార్గెట్ చేయడం విశేషం. అయితే మానస్ శ్రీ రామచంద్ర బయటపదేశాడు. ఇక ఇద్దరు అవుట్ అంటూ జెస్సి చెప్పడంతో అవుట్ ఎలా ఇస్తాడు ఉంటూ మళ్ళీ వెళ్ళాలి అని మరోవైపు సన్నీ తెగించి చెప్పాడు. తర్వాత శ్రీరామచంద్రుని కూడా వెళ్ళమని జెస్సి చెప్పాడు.

  ఆ తర్వాత సన్నీ మరింత సీరియస్ అవుతూ జెస్సి మీద మీదకు వెళ్ళాడు. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో ప్రియాంక సన్నీని కూల్ చేసే ప్రయత్నం చేసింది.ఇద్దరు పడినప్పుడు వార్నింగ్ ఇచ్చాను అంటూ వార్నింగ్ ఇచ్చినప్పటికీ.. నేను ఫస్ట్ టైం పడ్డాను అంటూ మానస్ కోపంతో ముందుకు వచ్చాడు. ఇక మరో వైపు జెస్సి, సన్నీ పై చాలా కోపానికి లోనయ్యాడు ఇంకా బిగ్ బాస్ సీజన్ 5 అయిపోలేదు అంటూ తెగించి చెప్పాడు.

  Recommended Video

  Romantic Movie Premiere - Celebrities Response | Akash Puri, Ketika Sharma ​| Filmibeat Telug
  కొత్త కెప్టెన్ అతడే..

  కొత్త కెప్టెన్ అతడే..

  అయితే బిగ్ బాస్ లో ఈ వారం ఎవరు కెప్టెన్ అవుతారు అనే విషయంలో అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎప్పటి నుంచో కెప్టెన్ అవ్వాలని చూస్తున్న షన్ను పోటీలో గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంచాలకుడిగా జెస్సి ఉండడంతో మళ్ళీ అతని స్నేహితులకు ఎక్కువగా తను మద్దతు ఇస్తాడని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఇప్పటికే దానిపై అనేక రకాల కామెంట్స్ కూడా వెలువడుతున్నాయి.

  వీరు ముగ్గురూ కలిసి ఆడుతున్నారు అంటూ నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే నాగార్జున కూడా త్రిమూర్తులు అంటూ ఒక పేరు పెట్టారు అయితే ఎవరు ఎన్ని చెప్పినా కూడా కూడా వారి స్నేహాన్ని వదలడంలేదు. ఎలాంటి విషయంలో అయినా సరే కలిసికట్టుగా గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి కొత్త కెప్టెన్ సెలెక్ట్ కాబోతున్న షణ్ముఖ్ జస్వంత్ వేసే అడుగులు ఏ విదంగా ఉంటాయో చూడాలి.

  English summary
  Bigg boss telugu 5 this week final captaincy task and shanmukh jaswanth new captain
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X