For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: క్లోజ్‌ ఫ్రెండ్‌తో గొడవకు దిగిన సన్నీ.. కొడతావా అంటూ కోపంగా మీద మీదకు రావడంతో!

  |

  తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా మంచి రెస్పాన్స్‌ను అందుకుంటూ రికార్డు స్థాయిలో టీఆర్పీని రాబడుతోన్న ఏకైక షో బిగ్ బాస్. సీజన్ సీజన్‌కూ మరింత స్పందనను రాబడుతోన్న ఇది.. ఒకదానికి మించి ఒకటి సూపర్ డూపర్ హిట్ అవుతోంది. ఇక, ఇప్పుడు నడుస్తోన్న ఐదో సీజన్ కూడా అదే రీతిలో ప్రసారం అవుతోంది. ఇప్పుడిది చివరి దశకు చేరుకోవడంతో ఆట మరింత రసవత్తరంగా మారింది. దీంతో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు టాప్ 5లోకి చేరేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే గేమ్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎపిసోడ్‌లో సన్నీ తన క్లోజ్ ఫ్రెండ్‌తో గొడవ పడినట్లు తెలిసింది. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  చివరికి చేరడంతో అందరిలో ఆసక్తి

  చివరికి చేరడంతో అందరిలో ఆసక్తి

  బిగ్ బాస్ ఐదో సీజన్ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. మధ్యలో కొంచెం స్లో అయినప్పటికీ.. మళ్లీ చిన్నగా పుంజుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చివరి అంకానికి చేరడంతో షో ఆసక్తికరంగా సాగుతోంది. అందుకు అనుగుణంగానే షో నిర్వహకులు సరికొత్త టాస్కులు ఇస్తున్నారు. దీంతో ఇది అందరిలో ఆసక్తిని పెంచుతూ సక్సెస్‌ఫుల్‌గా ప్రసారం అవుతోంది.

  బట్టలు లేకుండా ఇలియానా ఫోజులు: అదొక్కటే అడ్డుగా పెట్టి.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

  ఏడుగురు మాత్రమే.. రక్తి కడుతోంది

  ఏడుగురు మాత్రమే.. రక్తి కడుతోంది

  ఎన్నో అంచనాలతో ప్రసారం అవుతోన్న ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఫినాలే ఎపిసోడ్ కూడా జరగనుంది. దీంతో షో నిర్వహకులు షోను మరింత రంజుగా సాగేలా ప్లాన్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కఠినమైన టాస్కులు ఇచ్చి హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు ఏడుగురు కంటెస్టెంట్లు ఉండగా ఫినాలేకు ఐదుగురే ఉంటారు.

  ఫైనల్‌కు పంపేందుకు టాస్క్ ఇచ్చి

  ఫైనల్‌కు పంపేందుకు టాస్క్ ఇచ్చి

  గ్రాండ్ ఫినాలే వీక్‌కు రెండు వారాల ముందే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు 'టికెట్ టు ఫినాలే' అనే టాస్కును ఇస్తూ ఉంటారు. ఇది గెలుచుకున్న ఒక సభ్యుడు నేరుగా ఫైనల్‌లోకి అడుగు పెడతాడు. ఇక, ఐదో సీజన్‌కు సంబంధించి ఈ టాస్క్ మంగళవారం ప్రారంభం అయింది. ఈ టాస్కు మూడు రకాలుగా జరగబోతుంది. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్లకే టికెట్ దక్కుతుంది.

  Bigg Boss Elimination: 13వ వారం షాకింగ్ ఓటింగ్.. మొదటి రోజు అలా ఇప్పుడిలా.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు

   మూడు రౌండ్లు పూర్తి... టాప్‌ మానస్

  మూడు రౌండ్లు పూర్తి... టాప్‌ మానస్

  'టికెట్ టు ఫినాలే' టాస్కుకు సంబంధించి ఇప్పటి వరకూ మూడు రౌండ్లు జరిగాయి. ఇందులో అందరి కంటే ఎక్కువ మార్కులు సాధించిన మానస్ టాప్‌లో కొనసాగుతున్నాడు. అతడి తర్వాత శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, సన్నీలు ఉన్నారు. గురువారం జరిగిన ఎపిసోడ్‌లో తక్కువ మార్కులు ఉన్న ప్రియాంక సింగ్, ఆర్జే కాజల్, షణ్ముఖ్ జస్వంత్‌లు ఎలిమినేట్ అయ్యారు.

   నలుగురికి ఫోకస్ టాస్క్ ఇవ్వడంతో

  నలుగురికి ఫోకస్ టాస్క్ ఇవ్వడంతో

  'టికెట్ టు ఫినాలే' టాస్కులో మిగిలిన నలుగురు కంటెస్టెంట్లకు సరికొత్త ఛాలెంజ్‌లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ నలుగురికి ఫోకస్ టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం.. బిగ్ బాస్ కొన్ని సౌండ్లను ప్లే చేస్తాడు. అక్కడ ప్లే చేసే సౌండ్లు ఆధారంగా వాటిని క్రమం తప్పకుండా తమకిచ్చిన బోర్డులపై రాయాల్సి ఉంటుంది. ఎక్కువ గెస్ చేసిన వాళ్లకు ఎక్కువ మార్కులు వస్తాయి.

  ప్రియమణి బాడీపై బన్నీ షాకింగ్ కామెంట్స్: బుగ్గ పట్టుకుని నాటీగా.. ఎప్పటికైనా అవకాశం వస్తుందంటూ!

  క్లోజ్‌ ఫ్రెండ్‌తో గొడవకు దిగిన సన్నీ

  ఫోకస్ టాస్కులో భాగంగా సన్నీ, శ్రీరామ్, మానస్, సిరి హన్మంత్‌ల మధ్య హోరాహోరీగా పోటీ జరగబోతుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో వీళ్లు ఎంత సీరియస్‌గా ఆడుతున్నారన్న దాన్ని చూపించారు. ఇక, ఈ టాస్కులో అందరూ గేమ్ ఆడుతుండగా.. ఇప్పటికే ఎలిమినేట్ అయిన కాజల్ ఆన్సర్స్ చెప్పడంతో వీజే సన్నీ ఆమెతో గొడవ పడ్డాడు. దీన్ని ప్రోమోలో హైలైట్ చేశారు.

  Shilpa Chowdary Case : Tollywood Hero Loses | Mahesh Babu Sister || Filmibeat Telugu
  ఏంటి కొడతావా అంటూ మీదకెళ్లి

  ఏంటి కొడతావా అంటూ మీదకెళ్లి

  కాజల్ ముందే ఆన్సర్స్ చెబుతుండడంతో సన్నీ ఆమెపై సీరియస్ అయ్యాడు. 'నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో ఫస్ట్. బిగ్ బాస్ ఈమె ఆన్సర్స్ మొత్తం చెబుతుంది. ప్లీజ్ కాజల్ ఫోకస్ పోతుంది' అని బ్రతిమాలాడు. దీనికి ఆమె 'ఏంటి నా ఇష్టం. నేను కూడా గేమ్‌లో ఉన్నా. బరాబర్ ఇలాగే ఆడతా. ఏంటి కొడతావా? రా కొట్టు' అంటూ అతడి మీదకెళ్లినట్లు గొడవ పడింది.

  English summary
  Telugu Top Rreality TV Series Bigg Boss Recently Started 5th Season. In Upcoming Episode.. VJ Sunny Fight with RJ Kajal in Ticket to Finale Task.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X