For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: తొండాటతో అడ్డంగా బుక్కైపోయిన సన్నీ.. టాప్ కంటెస్టెంట్ ఇలా చేశాడంటే నమ్మలేరు

  |

  గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో ప్రసారం అవుతోన్నా.. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులను తీసుకొస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. హౌస్‌లో ఉండే కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. గ్రూపు తగాదాలు.. ప్రేమ కహానీలు.. అప్పుడప్పుడూ రొమాన్స్.. ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నింటినీ చూపిస్తూ భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటోంది. తద్వారా జాతీయ బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకున్న కార్యక్రమంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక, ఐదో సీజన్ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది. ఇప్పుడు ఇది చివరి దశకు చేరుకోవడంతో మరింత మజాను పంచుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో టాప్ కంటెస్టెంట్ సన్నీ తొండాట ఆడి అడ్డంగా బుక్కైపోయాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ఒక వారం అలా.. ఒక వారం ఇలా

  ఒక వారం అలా.. ఒక వారం ఇలా


  గతంలో నాలుగు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఐదో దానిపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఇందులో నిర్వహకులు ఆరంభం నుంచే ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా మొదట్లోనే 19 మందిని పంపిన నిర్వహకులు షోపై ఆసక్తిని పెంచారు. ఆ తర్వాత క్రమంగా షోలో గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా ఎంటర్‌టైన్ చేశారు. ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో షోపై ఇంకా ఆసక్తిని పెంచేలా ప్లాన్ చేశారు. ఇక, ఇది ఒక వారం మంచి స్పందనను.. మరో వారం సోసోగా సాగుతూ నడుస్తోంది.

  బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!

  చివరి దశలో అన్నీ ఆసక్తికరంగా

  చివరి దశలో అన్నీ ఆసక్తికరంగా


  ఎన్నో అంచనాలతో ప్రసారం అవుతోన్న ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఫినాలే ఎపిసోడ్ కూడా జరగనుంది. దీంతో షో నిర్వహకులు షోను మరింత రంజుగా సాగేలా ప్లాన్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కఠినమైన టాస్కులు ఇచ్చి హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నారు. వీళ్లలో ఈ వారం ఒకరు.. వచ్చే వారం మరొకరు బయటకు వెళ్లిపోనున్నారు. దీంతో టాప్ 5లో ఎవరు ఉంటారోనన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. మొత్తానికి ఈ మూడు వారాలు మరింత ఆసక్తికరంగా నడిపించేందుకు బిగ్ బాస్ టీమ్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది.

  టికెట్ టు ఫినాలే టాస్కు కొత్తగా

  టికెట్ టు ఫినాలే టాస్కు కొత్తగా

  గ్రాండ్ ఫినాలే వీక్‌కు రెండు వారాల ముందే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు 'టికెట్ టు ఫినాలే' అనే టాస్కును ఇస్తూ ఉంటారు. ఇది గెలుచుకున్న ఒక సభ్యుడు నేరుగా ఫైనల్‌లోకి అడుగు పెడతాడు. ఇక, ఐదో సీజన్‌కు సంబంధించి ఈ టాస్క్ మంగళవారం ఎపిసోడ్‌లో ప్రారంభం అయింది. ఈ టాస్కు మూడు రకాలుగా జరగబోతుంది. వాటిలో ఏది ఆడాలో అన్న నిర్ణయాన్ని కంటెస్టెంట్లు అందరూ కలిసి తీసుకోవాల్సి ఉంటుంది. ఏకాభిప్రాయంతో వాళ్లు ఒక విభాగం గురించి చెబితే.. దానికి సంబంధించిన జెండాను ఎగరవేయాలి. దీంతో బిగ్ బాస్ ఆ టాస్క్ ఇస్తాడు.

  ప్యాంట్ లేకుండా షాకిచ్చిన అనన్య నాగళ్ల: సినిమాల్లో నిండుగా.. ఇక్కడ మాత్రం అరాచకంగా!

  ఐస్ ఛాలెంజ్... అలా జరిగింది

  ఐస్ ఛాలెంజ్... అలా జరిగింది

  'టికెట్ టు ఫినాలే' టాస్కులో భాగంగా మొదటి రౌండ్‌లో ఐస్ టబ్ ఛాలెంజ్ ఇచ్చారు. ఇందులో కంటెస్టెంట్లు అందరూ ఐస్ టబ్‌లో నిల్చుని ఉండాలి. కాలు బయట పెట్టిన వాళ్ల దగ్గర బాల్స్ కొట్టేయొచ్చు. ఇలా చివర్లో ఎవరి దగ్గర ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్లకు ఎక్కువ మార్కులు వస్తాయి. ఈ టాస్కులో సన్నీ దగ్గర ఎక్కువ బాల్స్ ఉండడంతో అతడికి 7 మార్కులు వచ్చాయి. తక్కువ ప్రియాంక దగ్గర ఉన్నాయి. దీంతో ఆమెకు 1 మార్క్ వచ్చింది. ఇక, ఈ టాస్కులో శ్రీరామ్, సిరి, షన్నూ, ప్రియాంక కాళ్లకు స్పర్శ కోల్పోయారు. శ్రీరామ్ పరిస్థితి దారుణంగా మారింది.

  రెండో రౌండ్ ఫోకస్‌గా ఉండేలా

  రెండో రౌండ్ ఫోకస్‌గా ఉండేలా

  రెండో రౌండ్‌లో భాగంగా హౌస్‌లోని కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఫోకస్‌ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా రెండో లెవల్‌లో బజర్‌ మోగినప్పుడు 29 నిమిషాలు లెక్కించి గంట కొట్టాలి. ఎవరైతే సరిగ్గా, లేదా 29 నిమిషాలకు దగ్గరలో ఉన్నప్పుడు బెల్‌ మోగిస్తారో వారు గెలిచినట్లు. దీంతో వాళ్లకు ఎక్కువ మార్కులు వస్తాయి. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన సెట్టింగ్‌లో మొదట మానస్, ప్రియాంక ఆడారు. ఆ తర్వాత సన్నీ, కాజల్ వంతు వచ్చింది. ఇక, చివర్లో షన్నూ, సిరి గార్డెన్ ఏరియాలో.. గాయాలపాలైన శ్రీరామ్ బెడ్‌పైనే ఉండి ఈ టాస్కును విజయవంతంగా పూర్తి చేశారు.

  Janhvi Kapoor: బటన్స్ విప్పేసి రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ముందుకు వంగి మరీ అందాల జాతర

  తొండాటతో బుక్కైపోయిన సన్నీ

  తొండాటతో బుక్కైపోయిన సన్నీ

  ఫోకస్ గేమ్‌లో భాగంగా కుర్చీలో కూర్చున్న ఇద్దరు కంటెస్టెంట్లను మిగిలిన వాళ్లంతా ఇబ్బంది పెట్టవచ్చు. వాళ్ల ఫోకస్‌ను దెబ్బతీసేందుకు ఎలాంటి పనులైనా చేయవచ్చు. అయితే, ఇది గ్రూప్ గేమ్‌లా సాగడంతో సాఫీగా సాగిపోయింది. ఇక, టాప్ కంటెస్టెంట్‌ అయిన సన్నీ.. టాస్కులో గెలవడం కోసం మానస్‌ సాయం కోరాడు. దీనికి అతడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అంతేకాదు.. నువ్వు అక్కడ కూర్చో.. నేను లెక్కబెట్టి సిగ్నల్ ఇస్తాను అని చెప్పాడు. దీంతో సన్నీ మానస్‌ లెక్కపెడుతున్నాడని తాపీగా కూర్చుండిపోయాడు. ఆ తర్వాత అతడి సిగ్నల్ మేరకు గంట మోగించాడు.

  Recommended Video

  Anubhavinchu Raja : Director Sreenu Gavireddy About Lockdown | Filmibeat Telugu
  టాప్ కంటెస్టెంట్ ఇలాంటి పని

  టాప్ కంటెస్టెంట్ ఇలాంటి పని

  తాజా సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వగా.. వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. అందులో కొందరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్‌ అయ్యారు. వారిలో వీజే సన్నీ ఒకడు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన అతడు.. అద్భుతమైన ఆటతో సత్తా చాటుతున్నాడు. దీంతో అతడిని టైటిల్ ఫేవరెట్ అని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సన్నీ టాస్కులో ఇలా తొండాట ఆడాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా ఒక వర్గం వాళ్లు అతడిని సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ట్రోల్ చేసేస్తున్నారు.

  English summary
  Telugu Top Rreality TV Series Bigg Boss Recently Started 5th Season. In Recent Episode.. VJ Sunny Went to Jail for the Second Time.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X