Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Bigg Boss Telugu 5 week 12th Nominations సన్నీని టార్గెట్ చేసిన శ్రీరామచంద్ర.. ఎవరెవరూ నామినేట్ అయ్యారంటే!
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో 12వ వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం నుంచి ఎవరు వెళ్లిపోతారనే విషయం ఇప్పుడు బిగ్‌బాస్ అభిమానుల్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్‌గా మారింది. బిగ్‌బాస్ ఇంటిలో 78వ రోజున నిర్వహించిన నామినేషన్ ప్రక్రియలో ఎప్పటి మాదిరిగానే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 12వ వారంలో ఎవరు నామినేట్ అయ్యారనే వివరాల్లోకి వెళితే..

11వ వారం అనీ మాస్టర్ ఎలిమినేటెడ్
బిగ్‌బాస్ తెలుగు 5 షోలో 11వ వారం ఊహించినట్టే ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఇంటి నుంచి అనీ మాస్టర్ 11వ కంటెస్టెంట్‌గా బయటకు వెళ్లిపోయారు. నాగిని డ్యాన్సర్‌గా ముద్దు పేరు సంపాదించుకొన్న అనీ మాస్టర్ఎలిమినేట్ కావడంతో కంటతడి పెట్టింది. యాంకర్ రవి, సిరి హన్మంతు ఎమోషనల్ అయ్యారు. అనీ మాస్టర్ లైప్ జర్నీ అలా ముగియడంతో 12వ వారానికి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది.

12 వారం నామినేషన్ ప్రక్రియలో
ఇక బిగ్‌బాస్ తెలుగు 5లో 12వ వారంలో నామినేషన్ ప్రక్రియ సందర్బంగా ఇంటి సభ్యుల మధ్య భారీగా వాగ్వాదం చోటుచేసుకొన్నట్టు సమాచారం. ఇంటి సభ్యులు ఒకరినొకరు విమర్శలు చేసుకొంటూ నామినేషన్ ప్రక్రియను హీటెక్కించినట్టు సమాచారం. అందుకు ఈ రోజు ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సాక్షంగా నిలిచింది.

నామినేషన్స్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ రచ్చ
తాజా ప్రోమోలో ఆర్జే కాజల్, శ్రీరామచంద్ర మధ్య వాగ్వాదంగా కాస్త ఎక్కువగానే కనిపించింది. నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న శ్రీరామచంద్ర.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం జరిగిన టాస్క్‌ను పాయింట్ అవుట్ చేయడం ప్రోమోలో ప్రధాన అంశంగా కనిపించింది. అందరూ ఒకరిని సేవ్ చేయడానికి టాస్క్ ఆడారు. కానీ నీవు ఇద్దరిని డిస్ట్రాయ్ చేయాలని గేమ్ ఆడావు అని కాజల్‌ను శ్రీరామచంద్ర కడిగిపడేశాడు.
ఆర్జే కాజల్ వర్సెస్ శ్రీరామచంద్ర
అయితే శ్రీరామచంద్ర వాదనకు కాజల్ గట్టిగానే సమాధానం ఇచ్చింది. గేమ్ ఆడేటప్పుడు నా ఫ్రెండ్‌ను సేవ్ చేయాలన్నది నా ఇంటెన్షన్. నాకు ఓ క్లారిటీ ఉంది కాబట్టే.. నా ఫ్రెండ్‌ను సేవ్ చేసి అతడికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇవ్వాలనుకొన్నాను అని కాజల్ చెప్పింది. అయితే నీ ఫ్రెండ్ వీక్ కంటెస్టెంటా? అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతావని భయపడ్డావా? అంటూ శ్రీరామచంద్ర ప్రశ్నించాడు. అయితే నా ఫ్రెండ్ వీక్ కాదు.. గెలువాలని కోరుకొంటాడు అని కాజల్ సమాధానం ఇచ్చింది.

వీజే సన్నీ జోక్యంపై శ్రీరామచంద్ర ఫైర్
శ్రీరామచంద్రతో తన వాదననను ఆర్జే కాజల్ వినిపిస్తూ.. ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారనే విషయంపై ఎవరికి అంచనాలు ఉండవు. అనీ మాస్టర్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుందని అనుకొన్నావా? అంటే అది నీ అంచనా. ఒకవేళ అనీ మాస్టర్‌కు ఎవిక్షన్ పాస్ లభించి ఉంటే.. ఆమెకు ఉపయోగపడి ఉండేది అని శ్రీరామచంద్ర తన వాదనను వినిపించాడు. ఎవిక్షన్ పాస్ గురించి నామినేషన్ ప్రక్రియ సందర్భంగా శ్రీరామచంద్ర, ఆర్జే కాజల్ మధ్య తన గురించి చర్చ జరగడంతో వీజే సన్నీ జోక్యం చేసుకొన్నారు. అయితే నీకు ఈ చర్చలో సంబంధం లేదు. నీ వద్దకు వచ్చినప్పుడు నీవు మాట్లాడు అంటూ శ్రీరామచంద్ర కౌంటర్ ఇచ్చాడు.

12వ వారం నామినేట్ అయింది వీరే..
ఇలా ప్రక్రియ అరుపులు, విమర్శలు, వాదనల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. 12వ వారం నామినేషన్ ప్రక్రియలో కెప్టెన్ మానస్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు. ఇంటిలో 8 మంది కంటెస్టెంట్లు ఉండగా.. అందులో ఏడుగురు నామినేషన్‌లో ఉన్నారు. నామినేట్ అయిన వారిలో సిరి హన్మంతు, షణ్ముఖ్ జస్వంత్, ఆర్జే కాజల్; వీజే సన్నీ, శ్రీరామచంద్ర, యాంకర్ రవి, ప్రియాంక సింగ్ ఉన్నారు. అయితే టాప్ కంటెస్టెంట్లందరూ నామినేషన్ ప్రక్రియలో ఉండటంతో ఈ వారం ఎవరు నామినేట్ అవుతారనే విషయం మరోసారి చర్చనీయాంశమైంది.