For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: నేనేం వెర్రి** కాదంటూ బూతులతో రెచ్చిపోయిన ఉమ.. షన్ను, ప్రియాంకల షాకింగ్ రియాక్షన్!

  |

  బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే మొదటి వారం పూర్తిగా రెండో వారం మొదటి రోజు రెండో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే మునుపెన్నడూ విననటువంటి మాటలు కూడా వినాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కంటెస్టెంట్ ఉమా ఏకంగా బూతులతో రెచ్చిపోయింది. అసలు ఎందుకు అలా రెచ్చి పోయింది అనే వివరాల్లోకి వెళితే

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  రచ్చ రచ్చ

  రచ్చ రచ్చ

  బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం ఎవరూ ఊహించని గొడవలతో ప్రారంభమైంది. మామూలుగా అందరూ కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా సరే ఎలిమినేషన్ ప్రక్రియ దగ్గరకు వచ్చేసరికి ఒకరి మీద ఒకరికి ఎంత కోపం ఉందో అనే విషయాన్ని స్పష్టంగా అర్థం అయ్యేలా చేస్తున్నారు కంటెస్టెంట్ లు. మొదటి వారంలో సరయూ ఎలిమినేషన్ జరిగింది. ఇక రెండో వారంలో నామినేషన్ ప్రక్రియ పెను విధ్వంసానికి దారి తీసింది. నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్ బాస్ రెండు టీంలుగా కంటెస్టెంట్లను విడగొట్టారు. నక్క(వూల్ఫ్), ఈగల్ (గ్రద్ద) అంటూ రెండు టీంలుగా విభజించారు. ఇందులో ఉమా, లహరి, మానస్, జస్సీ, రవి, సన్నీ, శ్వేత వర్మ, నటరాజ్, కాజల్ వోల్ఫ్ (నక్క) టీంలో ఉన్నారు. లోబో, విశ్వ, ఆనీ, శ్రీరామ చంద్ర, ప్రియ, హమీద, సిరి, షణ్ముఖ్, ప్రియాంకలను బిగ్ బాస్ ఈగిల్(గ్రద్ద) టీంలో సెట్ చేశారు. ఇక ఓ టీంలోని సభ్యులను తమ టీమ్ లోని వారిని కాకుండా ఇతర టీంలోని ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాల్సిందిగా రూల్ పెట్టాడు.

  హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా

  అంతా విశ్వ కారణంగానే

  అంతా విశ్వ కారణంగానే

  అయితే ఉమా ఇంతలా రెచ్చిపోయి మాట్లాడడానికి కారణం విశ్వ అనే చెప్పాలి. తమ ఆపోజిట్ టీం లో ఉన్న సభ్యులను నామినేట్ చేయాలి అని చెప్పగానే విశ్వ రంగంలోకి దిగి ఉమా అలాగే కాజల్ ఇద్దరిని నామినేట్ చేశారు. అయితే నామినేట్ చేయడానికి గాను విశ్వ చెప్పిన కారణాలు ఇప్పుడు ఉమకు కోపం తెప్పించాయి, ఎప్పుడూ సైలెంట్ గానే ఉండే కాజల్ కూడా విశ్వ అన్న మాటలకు బరస్ట్ అవ్వాలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉమాను నామినేట్ చేస్తూ నాగార్జున పంపిన ఆలు కర్రీని ఇంట్లో వాళ్ళకి ముఖ్యంగా జెస్సీ కోసం అడిగినా ఇవ్వలేదని చెప్పి ఉమను విశ్వ నామినేట్ చేశారు.

  వెర్రి ఉండదు

  వెర్రి ఉండదు

  దీంతో అసలు రచ్చ అంతా ఇక్కడే మొదలైందని చెప్పాలి. విశ్వ నామినేషన్ కు కారణం చెప్పిన ఉమా సీరియస్ అయింది. నువ్వు చెప్పిన కారణం చాలా సిల్లీగా ఉంది అని అంటూనే నేను నాగార్జున గారు నాకు కర్రీ పంపిన వెంటనే ఇది మా హౌస్ సభ్యులు అందరూ కలిసి తినవచ్చా అని అడిగాను కానీ ఆయన నువ్వు ఒక్కదానివే తినాలి అని కచ్చితంగా చెప్పారు, నాగార్జున గారు లాంటి ఒక హోస్ట్ చెప్పిన తర్వాత కూడా ఆయన మాట కాదు అని నేను మిగతా వాళ్లకు ఎలా ఇస్తాను? అలా ఇస్తే నా అంత వెర్రి** ఉండదు అని దారుణంగా మాట్లాడేసింది ఉమా. ఆమె మాట్లాడిన మాటలకు హౌస్ సభ్యుల మైండ్లు అన్నీ ఒక్కసారిగా బ్లాక్ అయ్యాయి. ఎవరూ ఊహించనటువంటి ఆ మాటలు కొందరికి నవ్వు తెప్పించగా కొందరికి షాక్ తగిలేలా చేశాయి.

  షన్నూ షాక్

  షన్నూ షాక్

  ఉమా మాట్లాడిన బూతులు దెబ్బకు అందరూ షాక్ అయ్యారు. షన్ను అయితే అరేయ్ ఏంట్రా ఇది అని అర్థం వచ్చేలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాడు. మరోపక్క ప్రియాంక సింగ్ అయితే కింద పడి మరీ నవ్వేసింది. అయితే ఇదంతా ఉమా ఒక కంట కనిపెడుతూనే ఉంది. ఇక విశ్వ నామినేషన్ పూర్తయిన తర్వాత ఉమా వంతు వచ్చిన తర్వాత ఆమె మరోసారి రెచ్చిపోయింది. యానీ మాస్టర్, విశ్వలను నామినేట్ చేసిన ఉమ బిగ్ బాస్ ఇంట్లో ఒకరకంగా పెను విధ్వంసానికి తెగబడింది. రంగంలోకి దిగుతూనే కాజల్ వంక చూసి నా పుట్టలో వేలు పెడితే నేను వదులుతానా, కాజల్ నీ డైలాగే వాడుతున్న ఫుల్ రేటింగ్స్ రాకపోతే నన్ను అడుగు అంటూ తనను నామినేట్ చేసిన విశ్వ అలాగే ఆనీ మాస్టర్ ఇద్దరిని నామినేట్ చేస్తూ పెద్ద చేసింది. విశ్వ కావాలనే తనను టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పుకొచ్చిన ఉమాదేవి దమ్ము, ధైర్యం ఉంటే తనతో ఫేస్ టు ఫేస్ ఆడాలని అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి నామినేషన్స్ చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చింది.

  Vijay Raja Interview With YouTube Star Alankrutha | Gem Movie
  ఎవడిమ్మన్నాడు గౌరవం

  ఎవడిమ్మన్నాడు గౌరవం

  అంతేకాక అనీ మాస్టర్ ఈ విషయంలో అసలు ఏం జరిగింది అనేది చెబుతూ తాను చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ కి దూరంగా పెరిగానని, వాటికి సంబంధించిన విషయాలు పట్టించుకోను కానీ మధ్యాహ్నం మటన్ తిన్న తర్వాత ప్లేట్లు కడిగే సమయంలో హౌస్ మొత్తం వినబడినా ఒక ముగ్గురికి మాత్రం వినపడ లేదట అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆనీ మాస్టర్ కల్పించుకుని ఉమా గారు మీరు ఇండస్ట్రీనే నేను ఇండస్ట్రీనే నీలాగా నేను బూతులు మాట్లాడ లేక కాదు అంటే నీ ఇష్టం వచ్చింది మాట్లాడుకో నేను ఇలాగే ఉంటా నేను నాలాగే ఉంటా అంటూ రెచ్చిపోయారు. మీకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాము అంటే మాకు ఎందుకు ఇస్తున్నారు గౌరవం? నేను రాగానే అక్కడ నుంచి పారి పోవడం, నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? పెద్దదాన్ని పెద్దదాన్ని అంటున్నారు? నాకు ఎంత వయసు మీకు తెలుసా ? అంటూ ఆమె ఊహించని విధంగా ఫైర్ అయ్యింది.

  English summary
  Bigg Boss Telugu 5 Week 2 Nomination list: seven members Nominated for the Second week. Priya, Lobo, Uma, Nataraj Master, Anee Master, RJ Kajal, Priyanka Singh nominated for second-week nominations. Uma Devi using bad words in the house has become a hot topic.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X