For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5 week 4 nominations ఖలేజా పగిలిపోయింది.. ప్రియపై గొంతు చించుకొన్న లొబో

  |

  బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ మొదలైనప్పుడు ప్రేక్షకులు కొంత వరకు నిరాశ చెందారు అని చెప్పాలి. ఈ సారి గతంలో కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి సెలబ్రిటీలను తీసుకు వస్తారని ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ప్రేక్షకులకు బిగ్ బాస్ షాకిచ్చాడు. అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ విషయంలో ఏ మాత్రం తగ్గకూడదని హౌస్ లో ఎన్నో పరిణామాలను క్రియేట్ చేస్తున్నారు. అయితే మధ్యలో కొన్ని సార్లు బిగ్ బాస్ షో చాలా బోరింగ్ గా నడుస్తోంది అనే టాక్ వస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ 3 వారాలను పూర్తిచేసుకుని నాలుగో వారంలో అడుగుపెట్టింది. ఈ సారి నామినేషన్ ప్రక్రియ మరింత వేడిగా కొనసాగే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో కొద్దిసేపటి క్రితం విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

   గోడవలతో హైలెట్

  గోడవలతో హైలెట్

  బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగడం కామన్ అని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా నామినేషన్స్ లో సెలబ్రిటీ లో ఏ మాత్రం ఆలోచించకుండా కొన్నిసార్లు అరుస్తూ ఉంటారు. గడిచిన రోజులను అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రత్యర్ధులను నామినేషన్స్ లో ఉంచుతారు. ఇక గొడవలు జరిగితే కెమెరాలన్ని కూడా వారి పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాయి. గతవారం నామినేషన్స్ ప్రియ లహరి అలాగే రవి హైలెట్గా నిలిచిన విషయం తెలిసిందే.

  వరుసగా ముగ్గురు అమ్మాయిలు

  వరుసగా ముగ్గురు అమ్మాయిలు

  మొదటి వారం సరయు హౌస్ లో నుంచి వెళ్లిపోగా ఆ తర్వాత ఉమాదేవి కూడా నోటి దురుసు కారణంగా హౌస్ లో నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అయితే మూడో వారం లహరి ప్రియ ని తప్పుగా అర్థం చేసుకోవడం వలన చివరికి రవి వేసిన ప్లాన్ కు బలి కావాల్సి వచ్చింది. ఆమె వెళ్ళిపోతుందిని ఎవరు కూడా ఊహించలేదు. కానీ ఫైనల్ గా ఈ వారం కూడా అమ్మాయి హౌస్ లో నుంచి వెళ్లిపోవడంతో తదుపరి వారం ఎవరు వెళ్ళిపోతారు అనేది ఆసక్తిగా మారింది.

  షణ్ముఖ్ వర్సెస్ రవి

  షణ్ముఖ్ వర్సెస్ రవి

  ఇక రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమో లో నామినేషన్ ప్రక్రియ మామూలుగా జరగలేదని అర్థమవుతోంది. షణ్ముఖ్ జస్వంత్ ఈసారి యాంకర్ రవిని నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరికీ అస్సలు పడడం లేదు. టాస్క్ విషయంలో ప్రతిసారి రవి ఇతరులను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అంటూ ఇదివరకే షణ్ముఖ్ తన వాదనను వినిపించారు.

  బరాబర్ అంటాను..

  బరాబర్ అంటాను..


  ఇక నటరాజ్ మాస్టర్ విశ్వ మధ్యలో మరొకసారి గొడవ జరిగినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే నటరాజ్ మాస్టర్ ఊసరవెల్లి గుంటనక్క అంటూ ఒక స్పెషల్ ట్రాక్ ను నడుపుతున్నాడు. ఇక గత కొన్ని రోజులుగా విశ్వ తో ఆయనకు అస్సలు సరితూగడం లేదు. టాస్క్ ల విషయంలో లో ఇదివరకే నటరాజ్ మాస్టర్ విశ్వను నిలదీయడం కూడా జరిగింది. ఏదైనా అవకాశం దొరికితే దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసి మాట్లాడకు విశ్వ అంటూ నటరాజ్ మాస్టర్ ప్రశ్నించగా.. బయట మంచి యాక్టర్ ఇక్కడ కూడా మంచి యాక్టింగ్ చేస్తున్నాడు అంటూ అనడానికి నువ్వు ఎవరు అని విశ్వ కూడా గట్టిగానే అడిగాడు. ఇక అందుకు నట్రాజ్ మాస్టర్ మరింత కోపంతో బరాబర్ ఉంటారు అని కౌంటర్ ఇచ్చేశాడు.

  నా ఖలేజా పగిలిపోయింది

  నా ఖలేజా పగిలిపోయింది

  ఇక అందరికంటే భిన్నంగా లోబో బిగ్ బాస్ హౌస్ లో మొదటి సారి గట్టిగా అరిచాడు. మనస్ఫూర్తిగా నా లవ్ గురించి చెబుతుంటే సినిమా స్టోరీలా ఉంది అంటూ ప్రియా కామెంట్ చేయడాన్ని లోబో తప్పు పట్టాడు. అలాగే నా ఖలేజా పగిలిపోయింది అంటూ కౌంటర్ ఇచ్చాడు. అప్పటికే నువ్వు స్టోరీ స్టార్ట్ చేసావు అని ప్రియాంక మధ్యలో వాదించగా.. ముందుగా నన్ను మాట్లాడడం పూర్తి చేయనివ్వు అంటూ లోబో ఇంగ్లీష్ లో దిక్కులు పిక్కటిల్లేలా అరిచేశాడు. గట్టిగా అరిస్తే నేను ఏమాత్రం ఊరుకోను అంటూ ప్రియ సమాధానమిస్తున్నప్పటికీ కూడా నేను అలానే చెబుతాను అంటూ లోబో ముందుకు వచ్చేశాడు. నువ్వు ఇంకా ఏమి చూడలేదని కూడా లోబో హెచ్చరిక చేశాడు. .

  Bigg Boss Telugu 5, Episode 19 Highlights || Filmibeat Telugu

  లోబో మరింత ఎమోషనల్ గా..

  ఇక ప్రియపై అరిచిన అనంతరం లోగో పైకి చూస్తూ తన అమ్మ ని తలుచుకుని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. నన్ను క్షమించు అంటూ కంటతడి పెట్టుకోగానే యాంకర్ రవి ఓదార్చే ప్రయత్నం చేశాడు. నా గురించి నీకు తెలియదా అంటూ లోబో మరేదో ప్రశ్నిస్తున్నట్లు అర్థమవుతోంది. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడవద్దు లోబో అని ప్రియ కూడా తన వాదనను వినిపించే ప్రయత్నం చేసింది. ఇక వీరి మధ్య గొడవ ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందో చూడాలి.

  English summary
  Bigg Boss Telugu 5 week 4 nominations lobo angry on artist priya
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X