For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: ఐదో సీజన్‌లో విజేత ‘అతడే’నా.. అలా బయటకు వచ్చిన మేటర్.. బిగ్ బాస్ తీరుపై అనుమానాలు

  |

  బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. హిందీలో చాలా ఏళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ షో.. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి పరిచయం అయింది. ఇక్కడ బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందనను అందుకుని నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. సరికొత్త కాన్సెప్టుతో నడిచే షోనే అయినా.. ఆడియెన్స్ దీనికి ఫిదా అయిపోయారు. గతంలో ఎన్నడూ చూడని టాస్కులు, గొడవలు, లవ్ ట్రాకులు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల అంశాలు కనిపించడంతో దీనికి ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే వస్తోంది. అయితే, విజేతల విషయంలో మాత్రం దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లలో మగవాళ్లే గెలిచారు. ఇక, ఇప్పుడు వస్తున్న ఐదో సీజన్‌ విషయంలోనూ అదే రిపీట్ అవబోతుందని తెలుస్తోంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   అన్నీ హిట్లే.. నేషనల్ లెవెల్ గుర్తింపు

  అన్నీ హిట్లే.. నేషనల్ లెవెల్ గుర్తింపు

  చాలా అనుమానాల మధ్య తెలుగులోకి వచ్చింది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. అసలు ఇలాంటి వాటిని మన వాళ్లు ఎంకరేజ్ చేస్తారా? ఇక్కడ ఇది క్లిక్ అవుతుందా? ఇలా అనుకుంటోన్న పరిస్థితుల్లో ఈ షోకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో నాలుగు సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ సక్సెస్ అయ్యాయి. అదే సమయంలో అత్యధికంగా టీఆర్పీ రేటింగ్‌ను కూడా సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే గత సీజన్‌లో ఏకంగా 18 పైచిలుకు రేటింగ్‌తో రికార్డు నమోదైంది. తద్వారా జాతీయ స్థాయిలో తెలుగు బిగ్ బాస్ పేరు సంపాదించుకుంది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  నాలుగు సీజన్లు.. ముగ్గురు స్టార్ హీరో

  నాలుగు సీజన్లు.. ముగ్గురు స్టార్ హీరో

  బిగ్ బాస్ షో తెలుగులో సూపర్ హిట్ అవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అదే సమయంలో దీన్ని ఎంతో చక్కగా నడిపించిన స్టార్ హీరోల పాత్ర కూడా ఉందనే చెప్పాలి. మొదటి సీజన్‌లో నందమూరి చిన్నోడు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ షోను జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. తద్వారా ఈ షోకు గట్టి పునాదులు వేశాడు. రెండో సీజన్‌లో నాని తనదైన శైలి హోస్టింగ్‌తో మెప్పించాడు. ఇక, మూడు, నాలుగు సీజన్లను అక్కినేని నాగార్జున మరింత సక్సెస్ చేశాడు. ఈ సీజన్లకే రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చింది. దీంతో స్టార్ మా నెంబర్ వన్ అయింది.

  నాలుగు సీజన్లు.. నలుగురూ మగవాళ్లే

  నాలుగు సీజన్లు.. నలుగురూ మగవాళ్లే

  బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ తెలుగులో నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ అన్ని సీజన్లలోనూ మగ కంటెస్టెంట్లే విజేతలుగా నిలిచారు. మొదటి సీజన్‌లో ప్రముఖ నటుడు శివ బాలాజీ, రెండో దానిలో యాక్టర్ కమ్ మోడల్ కౌశల్ మండా, మూడో సీజన్‌లో టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్, నాలుగో దానిలో యంగ్ హీరో అభిజీత్ విజయం సాధించారు. ఫస్ట్ సీజన్‌లో నటుడు ఆదర్శ్ బాలకృష్ణ, రెండో దానిలో సింగర్ గీతా మాధురి, మూడో సీజన్‌లో యాంకర్ శ్రీముఖి, నాలుగో సీజన్‌లో అఖిల్ సార్థక్‌లు రన్నరప్‌లుగా నిలిచారు.

  అందాలన్నీ చూపిస్తూ రెచ్చిపోయిన పవన్ హీరోయిన్: బట్టలు ఉన్నా లేనట్లే.. మరీ ఇంత దారుణంగానా!

   ఐదో సీజన్ స్టార్ట్స్... ఇది కూడా రికార్డు

  ఐదో సీజన్ స్టార్ట్స్... ఇది కూడా రికార్డు

  తెలుగులో ఇప్పటి వరకూ ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్లు విజయవంతం అయ్యాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపించారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కుల, గొడవలు, కొట్లాటలు, రొమాన్స్ వంటి వాటితో మరింత రంజుగా మార్చేశారు. దీంతో ఈ సీజన్ ప్రారంభ ఎపిసోడ్‌‌కు ఏకంగా 18 రేటింగ్ సొంతమైంది.

  మూడు వారాలు.. ముగ్గురు లేడీస్ ఔట్

  మూడు వారాలు.. ముగ్గురు లేడీస్ ఔట్

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ప్రతి వారం నామినేషన్స్‌లో ఎక్కువ మంది ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మొదటి వారం ఏడుగురు నామినేట్ అవగా.. అందులో నుంచి సరయు రాయ్ ఎలిమినేట్ అయింది. రెండో వారంలో ఆరుగురు సభ్యులు నామినేషన్స్‌లో ఉండగా.. వీరి నుంచి సీనియర్ నటి ఉమాదేవి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇక, ఇప్పుడు మూడో వారంలో ఐదుగురు నామినేట్ అవగా.. ఈ కంటెస్టెంట్ల నుంచి తాజా ఎపిసోడ్‌లో లహరి షారి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.

  ప్రభాస్, ఎన్టీఆర్‌పై పవన్ కల్యాణ్ ఊహించని కామెంట్స్: సన్నాసుల్లారా అవి ఊరికే ఇవ్వలేదురా అంటూ!

   ఐదో సీజన్‌లో విజేత ‘అతడే'నా అని

  ఐదో సీజన్‌లో విజేత ‘అతడే'నా అని

  గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ప్రవేశించారు. అందులో తొమ్మిది మంది అమ్మాయిలు కాగా, తొమ్మిది మంది అబ్బాయిలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ఇందులో చాలా మంది ప్రేక్షకులకు సుపరిచితులు అయిన కంటెస్టెంట్లే ఉన్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారానో.. తమ తమ రంగాల్లో మెప్పించడం ద్వారానో ఫేమస్ అయిన వాళ్లు పలువురు ఉన్నారు. అయితే, ఈ సారి కూడా మగ కంటెస్టెంటే విజేతగా నిలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

  Recommended Video

  SP Balasubrahmanyam : సజీవ మూర్తిగా ఎస్పీ బాలు.. చీకటి వెలుగులతోపాటు | Mohan Lal | Filmibeat Telugu
  ఆ పరిణామంతో బయటకు... డౌట్లతో

  ఆ పరిణామంతో బయటకు... డౌట్లతో

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లో అప్పుడే ముగ్గురు అమ్మాయిలు ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ఇంక ఆరుగురు మాత్రమే మిగిలారు. అందులో టైటిల్ పోరుకు పోటీ పడే వాళ్లు ఉన్నారా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అదే సమయంలో షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, శ్రీరామ చంద్రలు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. అందుకే ఈ సారి కూడా అబ్బాయిలే గెలిచే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇక, ఫీమేల్ కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయడం ద్వారా నిర్వహకులు ఇప్పటికే దీనిపై పరోక్షంగా హింట్ ఇచ్చేశారని పలువురు అంచనా వేస్తున్నాడు. చూడాలి మరి ఈ సారి ఎలా జరుగుతుందో!

  English summary
  Bigg Boss is the Telugu Top Reality TV Series Recently Started 5th Season. Let we Know about This Season Winner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X