Bigg Boss Telugu 5th Week Nominations: నామినేషన్స్‌లో బిగ్‌బాస్ ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేషన్ ముప్పులో ఎవరెవరు
బిగ్‌బాస్ తెలుగు 9 ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పటి వరకు 4 వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్.. తాజాగా 9వ వారంలోకి అడుగుపెట్టింది. బిగ్‌బాస్ ప్రేక్షకులకు శని, ఆదివారాల నాటి ఎపిసోడ్స్ ఎంత ముఖ్యమో..సోమవారం కూడా అంతే కీలకం. ఆ రోజు నామినేషన్స్ జరగడంతో పాటు హౌస్‌లో గొడవలు, కొట్లాటలు తారాస్థాయిలో ఉంటాయి. మరి బిగ్‌బాస్ తెలుగు 9లో 5వ వారం ఎవరెవరు నామినేషన్స్‌లో ఉన్నారు? ఈ వివరాల్లోకి వెళితే..
నామినేషన్స్‌లో బిగ్‌బాస్ ట్విస్ట్
15 మందితో బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభం కాగా.. తొలి వారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. రెండో వారం మర్యాద మనీశ్, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం మాస్క్ మ్యాన్ హరిత హరీశ్ హౌస్‌ను వీడారు. మూడో వారం మధ్యలో బిగ్‌బాస్ అగ్నిపరీక్ష కంటెస్టెంట్ దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టారు. దీంతో మొత్తం 12 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో ఉన్నారు. ఎప్పటిలాగే ఈ వారం కూడా బిగ్‌బాస్ నామినేషన్స్ హోరాహోరీగా జరగ్గా.. బిగ్‌బాస్ ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.

అందరినీ నామినేట్ చేసిన బిగ్‌బాస్
నామినేషన్స్ అంటే ఒక్కో కంటెస్టెంట్ తగిన కారణం చెప్పి ఇద్దరినీ నామినేట్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఎవరి పేరు చెబుతారో వారు నామినేషన్స్‌లో ఉన్నట్లుగా చెబుతారు. అయితే తాజా సీజన్‌లో సిలబస్ మొత్తం మార్చేశానని నాగార్జున తొలి నుంచి చెబుతున్నాడు. దీనికి తగినట్లుగానే 5వ వారం నామినేషన్స్‌లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఏ ఒక్కరికీ నామినేట్ చేసే అవకాశం లేకుండా ఓ పెద్ద లిస్ట్ చదివాడు. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ, దివ్య నిఖితలు నామినేషన్స్‌లో ఉన్నట్లు చెప్పారు. కెప్టెన్ రాము రాథోడ్ తప్పించి ఈ వారం మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నట్లు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
బెడ్ ఎక్కించిన బిగ్‌బాస్
నామినేషన్స్ ట్విస్ట్‌తో షాక్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఈసారి ఇలా జరిగిందేంటీ అని మాట్లాడుకుంటూ ఉండగా మరో బాంబు పేల్చాడు బిగ్‌బాస్. అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిపించి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ కావాలంటే ఒక టాస్క్‌లో పాల్గొనాలని చెబుతాడు. ఓ బెడ్‌పై అందరినీ ఎక్కించి.. ఇందులో గెలవాలంటే నామినేట్ అయిన వారందరినీ కిందకి దించాల్సి ఉంటుందని, ఎక్కువసేపు ఎవరైతే బెడ్‌పై ఉంటారో వారు ఇమ్యూనిటీని సాధిస్తారని కండీషన్ చెబుతాడు బిగ్‌బాస్. ఇందులో అందరూ హోరాహోరీగా తలపడగా.. నాకు అన్యాయం జరిగిందంటూ దివ్య.. భరణి ముందు కంటతడి పెట్టింది.
నామినేషన్స్ తప్పించుకున్న ఇమ్మాన్యుయేల్
ఆ తర్వాత కంటెస్టెంట్స్‌కు గాలి - నీరు - నిప్పు టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. మూడు లెవల్స్‌లో గేమ్ ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ టాస్క్‌కి రీతూ చౌదరి- సంజన గల్రానీలు సంచాలక్‌గా వ్యవహరించగా.. ఇమ్మాన్యుయేల్, పవన్ కళ్యాణ్‌లు చాలా వేగంగా టాస్క్ పూర్తి చేసేలా కనిపించారు. చివరిలో కళ్యాణ్ స్లో అవ్వగా.. ఇమ్మూ మాత్రం దూకుడుగా ఆడి ఇమ్యూనిటీ సాధించి నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. దాంతో కెప్టెన్ రాము, ఇమ్మాన్యుయేల్ తప్పించి మిగిలిన 10 మంది కంటెస్టెంట్స్.. 5వ వారం బిగ్‌బాస్ తెలుగు 9 నామినేషన్స్‌లో నిలిచారు. మరి వీరిలో 5వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











