Don't Miss!
- News
ఎవడండీ గంటా - లక్షల్లో వాడొక్కడు : అయ్యన్న సంచలనం..!!
- Lifestyle
చలికాలంలో చర్మం పొడిబారుతోందా? ఇలా ఒంట్లో నీటి శాతం పెంచుకోవచ్చు
- Sports
INDvsNZ : టీమిండియాకు ఆ సమస్య ఇప్పటిది కాదు.. తేల్చిచెప్పిన మాజీ లెజెండ్
- Technology
కొత్తగా లాంచ్ అయిన Samsung 5G ఫోన్లు సేల్ మొదలైంది! వివరాలు!
- Finance
Titles: మరోసారి ఉద్యోగాల కోతకు అమెజాన్ సిద్ధం..
- Travel
జ్ఞానోదయ యాత్రకు కేంద్రాలు.. ఏపీలోని ఈ నాలుగు బౌద్ధ క్షేత్రాలు!
- Automobiles
రూ. 50 లక్షల ఖరీదైన కారు కొన్న యుట్యూబర్.. ఆ కారు ఏదో ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6: అప్పులు తీర్చేలా ఆదిరెడ్డి రెమ్యునరేషన్.. ఇది కదా అసలైన విజయం!
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ విభిన్నమైన తరహా లో ముగిసింది. అసలు ఈసారి రేటింగ్స్ అనుకున్నంత స్థాయిలో రాకపోయినప్పటికీ కూడా కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం జనాల్లో మంచి గుర్తింపును అందుకున్నారు. ఎక్కువ రోజులు ఉండరు అనుకున్న వారు కూడా కొందరు చివరి దశ కొరకు నిలబడడం విశేషం. ముఖ్యంగా ఆదిరెడ్డి అయితే టాప్ కంటెస్టెంట్స్ ను దాటుకుంటూ టాప్ 5లో నిలుస్తూ వచ్చాడు. ఇక అతను బిగ్ బాస్ ద్వారా ఎంత ఆదాయాన్ని అందుకున్నాడు అనే వివరాల్లోకి వెళితే..

రెమ్యునరేషన్.. క్రేజ్ కోసమే
బిగ్ బాస్ లో కొందరు అవకాశం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక విధంగా బిగ్ బాస్ లో ఛాన్స్ కోసం సెలబ్రిటీలు రెండు విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి రెమ్యూనరేషన్. మరొకటి క్రేజ్. ఈ రెండిటి కోసమే సెలబ్రెటీలు బిగ్ బాస్ లో ఎన్ని రోజులైనా ఉండడానికి సిద్ధమవుతారు. ఇక ఈసారి కూడా చాలామంది పోటీ పడడంతో మొత్తంగా 21 మందిని హౌస్ లోకి బిగ్ బాస్ సెలెక్ట్ చేశారు.

కామన్ మ్యాన్ తరహాలో
ఇక 21 మంది కంటెస్టెంట్ లో దాదాపు అందరూ కూడా సినిమా ప్రపంచంలో ఏదో ఒక విధంగా పాపులర్ అయిన వారే. అయితే ఒక ఆదిరెడ్డి మాత్రం కామన్ మ్యాన్ తరహాలో హౌస్ లోకి అడుగుపెట్టాడు. అతను ఇంతకుముందు కేవలం బిగ్ బాస్ కు రివ్యూలు ఇచ్చుకుంటూ తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేసుకున్నాడు.

ఆదిరెడ్డి అదరగొట్టేసాడు
ఇక బిగ్ బాస్ లోకి ఆదిరెడ్డి అడుగు పెట్టిన తర్వాత అతనిపై కొంత నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ చాలా వరకు అతను తొందరగానే వెళ్ళిపోతాడు అనే కామెంట్ కూడా చేశారు. కానీ ఎవరి మాటలు పట్టించుకోకుండా తనదైన శైలిలో గేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతూ ముందుకు కొనసాగాడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ అందరికీ ఒక సవాల్ విసిరాడు.

అప్పులోళ్లు వస్తే..
ఇక
హౌస్
లో
నుంచి
వెళ్లిపోయేటప్పుడు
కూడా
అతను
టాప్
కంటెస్టెంట్స్
గురించి
మాట్లాడిన
విధానం
కూడా
హైలెట్
గా
నిలిచింది.
అంతే
కాకుండా
తన
కుటుంబ
పరిస్థితి
గురించి
కూడా
చెబుతూ
అప్పుల
పాలైన
తన
తండ్రి
కొన్నాళ్లపాటు
అప్పులోళ్లు
వస్తే
దాక్కోవాల్సిన
పరిస్థితి
ఏర్పడింది
అని
అలాంటిది
ఇప్పుడు
ఎన్నో
కోట్ల
మంది
జనాలు
చూస్తున్న
ఈ
టీవీ
షోలో
గర్వంగా
మా
నాన్నకు
నిలబెట్టినందుకు
నాకు
ఎంతో
గర్వంగా
ఉంది
అని
అనడం
కూడా
అందరిని
ఎంతగానో
ఆకట్టుకుంది.

రెమ్యునరేషన్ పెరిగింది
ఇక బిగ్ బాస్ ద్వారా ఆదిరెడ్డికి కూడా ఆర్థికంగా మంచి రెమ్యునరేషన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ మొదట అతన్ని కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేసినప్పుడు వారానికి 30 వేలు మాత్రమే ఇస్తామని ఒప్పందం కుదరచుకున్నారు. కానీ ఆ తర్వాత అతని ఫైనల్ వరకు వెళ్లడంతో వారానికి 40 వేలకు ఇవ్వడానికి సిద్ధమైంది. మంచి పర్ఫామెన్స్ ఇస్తూ రేటింగ్ పెంచడంలో కూడా అది రెడ్డి కీలకపాత్ర పోషించాడు అందుకే అతని రెమ్యునరేషన్ పెంచారు.

మొత్తం ఎంత ఇచ్చారంటే..
ఇక ఆదిరెడ్డి బిగ్ బాస్ ద్వారా 15 వారాలు ఉన్నాడు కాబట్టి 6 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే టాప్ 5లో ఉన్నాడు కాబట్టి మరో 5 లక్షలతో బోనస్ గా ఇచ్చి మొత్తంగా 11 లక్షలు ఇచ్చినట్లు టాక్ వస్తోంది. ఆదిరెడ్డికి బిగ్ బాస్ ద్వారా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. కాబట్టి అతని యూట్యూబ్ ఛానల్ రెవిన్యూ కూడా ఇంకాస్త పెరుగుతుంది అని చెప్పవచ్చు. మరి వచ్చిన క్రేజ్ తో అది రెడ్డి రాబోయే రోజుల్లో ఏ విధంగా అడుగులు వేస్తాడో చూడాలి.