Don't Miss!
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- News
student: న్యూడ్ వీడియోతో షాక్ అయిన కాలేజ్ విద్యార్థి, బ్లాక్ మెయిల్ చేసిన శాడిస్టు లేడీ, క్లైమాక్స్ లో?
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Bigg Boss Telugu 6: చివరలో నాగార్జున ట్విస్ట్.. వచ్చే సీజన్ ఇక లేనట్లే అని హింట్ ఇచ్చాడుగా!
అక్కినేని నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ కు హోస్ట్ గా ఉన్న విషయం తెలిసిందే. మొదటి రెండు సీజన్స్ తర్వాత ఆయన కంటిన్యూ అవుతూ 6వ సీజన్ వరకు ఎంతో డిఫరెంట్ గా ఆడియన్స్ ను ఏంట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే 6వ సీజన్ చివరి ఎపిసోడ్ లో నాగార్జున ప్రవర్తించిన తీరు మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తదుపరి బిగ్ బాస్ సీజన్ కు ఆయన రానట్లే అని ఆయన వెళ్లిపోయిన విధానంతో అర్ధమైపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఎన్టీఆర్, నాని..
బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ తో మొదలైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ అయితే మంచి క్రేజ్ అందుకున్నాడు. అయితే అతను ఆ తర్వాత ఒకవైపు షూటింగ్స్ మరొకవైపు బిగ్ బాస్ ను మాత్రం బ్యాలెన్స్ చేయలేక ఒకటే సీజన్ కు విముక్తి పలికాడు. ఆ తర్వాత వచ్చిన నాని కూడా అదే తరహాలో బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పేసాడు.

ఈ వయసులో కూడా..
అయితే యువ హీరోల కంటే దీటుగా అక్కినేని నాగార్జున మాత్రం వరుసగా హోస్ట్ గా కొనసాగడం విశేషం. 4 టెలివిజన్ సీజన్స్ తో పాటు ఒక ఓటీటీ సీజన్ కు కూడా ఆయన హోస్ట్ గా వ్యవహరించారు. ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా నాగార్జున అదే ఎనర్జీతో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు.

ప్లాన్ రివర్స్ కావడంతో..
అయితే గత ఐదు సీజన్ల వరకు కూడా నాగార్జున బాగానే నిలదొక్కుకున్నాడు. మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి. కానీ 6వ సీజన్కు వచ్చేసరికి మాత్రం బాస్ ప్లాన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. అసలు కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసే విషయంలోనే బిగ్ బాస్ కు భారీగా దెబ్బ పడింది. మినిమం కాస్త తెలిసిన సెలబ్రిటీలను తీసుకువస్తే ఆడియోన్స్ కూడా ఫోకస్ చేసేవారు. దానికి తోడు టాస్క్ లు కూడా అంతగా వర్కౌట్ కాలేదు.

చెత్తగా ముగిసిపోయింది
సాధారణ రోజుల్లోనే కాకుండా నాగార్జున వచ్చిన వీకెండ్స్ లో కూడా రేటింగ్స్ అయితే దారుణంగా పడిపోయాయి. బిగ్ బాస్ లో 6వ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కూడా అంతగా ఆసక్తిగా ఏమీ అనిపించలేదు. అందుకనే విన్నర్ ఎవరో లీక్ కావడంతో సోషల్ మీడియాలోనే అనేక రకాల నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. మొత్తానికి 6వ సీజన్ అయితే కాస్త నీరసంగానే మొదలై చెత్తగా ముగిసిపోయింది. అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

నాగ్ అలా వెళ్లిపోవడంతో..
ఇక నాగర్జున మరో సీజన్ హోస్ట్ గా ఉండడం కష్టమే అనే కామెంట్స్ కూడా ముందుగానే వినిపించాయి. ఇక ఆదివారం ఫైనల్ ఎపిసోడ్లో నాగార్జున విన్నర్ ఎవరో ప్రకటిస్తూ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పేసాడు. అంతేగాని మళ్ళీ కలుద్దాం అని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చేసిన సీజన్ అన్నిటి గురించి మాట్లాడి వచ్చే సీజన్ కు కలుద్దామని కూడా అనేవారు. కానీ ఇప్పుడు మాత్రం జస్ట్ గుడ్ నైట్ చెప్పేసి తదుపరి సీజన్ గురించి ఒక్క మాట కూడా అనలేదు. దీంతో ఆయన మళ్ళీ హోస్ట్ గా వచ్చే అవకాశం లేదు అని క్లారిటీ వచ్చేసింది.