For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: హైపర్ ఆది కామెంట్లతో కలకలం.. క్యారెక్టర్ బ్యాడ్ చేశాడంటూ.. షోలో షాకింగ్ సీన్!

  |

  ఇండియాలోని చాలా భాషల కంటే ఆలస్యంగా వచ్చినా సూపర్ డూపర్ హిట్ అయిన షో బిగ్ బాస్. అంచనాలను పక్కన పెడితే ఎన్నో అనుమానాలతో పరిచయమైన దీనికి చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులు మద్దతు భారీ స్థాయిలో లభించింది. దీంతో ఇది తెలుగు బుల్లితెరపై సక్సెస్‌ఫుల్ షోగా మారిపోయింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ.. ఇప్పుడు ఆరో దాన్ని నడుపుతున్నారు. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బాలాదిత్య.. గీతూ రాయల్‌పై కోప్పడ్డాడు. అసలేం జరిగిందో చూడండి!

  ప్రయోగాలతో వచ్చినా చూడట్లే

  ప్రయోగాలతో వచ్చినా చూడట్లే

  బిగ్ బాస్ ఎప్పుడు ప్రసారం అయినా భారీ స్పందన వస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే మొదలైన ఆరో సీజన్ కూడా ఎంతో ప్రయోగాలతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీన్ని గతంలో కంటే వైవిధ్యంగా నడుపుతున్నారు. దీంతో ఆరో సీజన్ జనరంజకంగా సాగుతూ ముందుకు దూసుకుపోతోందని అంతా అనుకున్నారు. కానీ, దీనికి రేటింగ్ మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు.

  ఆరియానా ఎద అందాల ప్రదర్శన: ఆమెనింత ఘోరంగా ఎప్పుడూ చూసుండరు!

  దీపావళి ఎపిసోడ్.. హైపర్ ఆది

  దీపావళి ఎపిసోడ్.. హైపర్ ఆది

  ఆదివారం రాత్రి బిగ్ బాస్ షోలో దీపావళి ఎపిసోడ్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో ఎంతో మంది సెలెబ్రిటీలు తమదైన ఆటపాటలతో సందడి చేశారు. అలాగే, నాగార్జున కూడా ఇంట్లోని కంటెస్టెంట్లతో చాలా ఆటలు ఆడించాడు. ఇక, ఇందులో జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది వచ్చి తెగ హడావిడి చేశాడు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి తనదైన శైలిలో వర్ణించాడు.

  మంటల్లో నామినేషన్స్ టాస్కు

  మంటల్లో నామినేషన్స్ టాస్కు

  ఆరో సీజన్‌లో ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్క్ గతంలో మాదిరిగానే సాగింది. ఇందులో తాను నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్.. ఇద్దరు ఫొటోలను మంటల్లో వేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నారో అన్న దానికి సరైన కారణాలు కూడా చెప్పాలి. ఈ టాస్క్ ఆద్యంతం ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగింది.

  బాత్‌టబ్‌లో బట్టలు లేకుండా సమీరా రెడ్డి.. అబ్బా ఏం ట్విస్ట్ ఇచ్చింది గురూ!

  గీతూ రాయల్ వర్సెస్ ఆదిత్య

  గీతూ రాయల్ వర్సెస్ ఆదిత్య


  ఎనిమిదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ టాస్కులో ఆరంభం నుంచి ఎంతో క్లోజ్‌గా ఉంటోన్న కంటెస్టెంట్లు గీతూ రాయల్, బాలాదిత్య మధ్య గొడవ జరిగింది. తనను లయ్యర్ అన్నావని, అది వీడియోలో కూడా కనిపించిందని బాలాదిత్య.. గీతూను నామినేట్ చేయాలని అనుకున్నాడు. కానీ, ఆమె మాత్రం ఎవరు ఏమన్నా నేను మాత్రం అలా అనలేదని చెప్పింది.

  హైపర్ ఆది కామెంట్లు చెబుతూ

  హైపర్ ఆది కామెంట్లు చెబుతూ

  ఆ తర్వాత బాలాదిత్య మాట్లాడుతూ.. 'నేను స్మోకింగ్ చేస్తున్నాను. ఈ విషయం నీవల్లే బాగా హైలైట్ అయింది. అది ఎంతలా అంటే.. స్పెషల్ ఎపిసోడ్‌కు గెస్టుగా వచ్చిన సెలెబ్రిటీ (హైపర్ ఆది) కూడా దీని గురించి మాట్లాడేంతలా ఇది పెద్ద న్యూస్ అయింది. అలా అవడానికి నువ్వే కారణం. దీనివల్ల నా క్యారెక్టర్ బ్యాడ్ అయినట్లు అనిపించింది' అంటూ బాధను చెప్పుకొచ్చాడు.

  కోహ్లీ భార్య అనుష్క హాట్ షో: పండుగ పూట ఎద అందాలు కనిపించేలా!

  హైపర్ ఆది ఏమన్నాడంటే

  హైపర్ ఆది ఏమన్నాడంటే


  దీపావళి ఎపిసోడ్‌లో గెస్టుగా వచ్చిన హైపర్ ఆది.. కంటెస్టెంట్లు అందరి గురించి తనదైన కామెంట్లు చేశాడు. ఈ క్రమంలోనే బాలాదిత్యపై 'నువ్వు సిగరెట్ల గురించి అడిగినంత ఇంకెవరూ దేని గురించి అడగలేదు. బయటకు వచ్చిన తర్వాత అందరూ నీకు సిగరెట్లను గిఫ్టుగా తీసుకొచ్చి ఇచ్చినా ఇస్తారు. బయట అలా అయింది నీ వ్యవహారం' అంటూ ఆది కామెంట్లు చేశాడు.

  నామినేట్ అయింది ఎవరంటే

  నామినేట్ అయింది ఎవరంటే

  ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగిన ఎనిమిదో వారం నామినేషన్స్ టాస్కులో ఏకంగా ఇంట్లో వాళ్లందరికీ బిగ్ బాస్ షాకిచ్చాడు. ఇప్పుడు 14 మంది కంటెస్టెంట్లు ఉండగా.. అందరూ నామినేట్ అయ్యారు. అందులో బాలాదిత్య, ఆది రెడ్డి, గీతూ, శ్రీహాన్‌, శ్రీ సత్య, రేవంత్, మెరీనా, రాజశేఖర్, రోహిత్‌, వాసంతి, ఫైమా, సూర్య, ఇనాయా, కీర్తీలు ఎలిమినేషన్ జోన్‌లోకి ఎంటర్ అయ్యారు.

  English summary
  Telugu Top Reality TV Series Bigg Boss Telugu 6th Season Running Successfully. Baladitya Fires on Geetu Royal about Hyper Aadi Comments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X