For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6:షాకింగ్ గా ఓటింగ్.. టాప్ లోకి బాలాదిత్య.. ఎలిమినేట్ కానున్న బిగ్ బాస్ ముద్దుబిడ్డ?

  |

  ఎన్నో ఊహించని సంఘటనలు, ప్రేమ కహానీలు, గొడవలు, రొమాన్స్, కొత్త కొత్త టాస్కులు ఇలా రకరకాల ఎమోషన్స్ కనిపించేలా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. కొంత మంది కంటెస్టెంట్లను ఓ ఇంట్లో ఉంచడం.. ఆటతీరు, వ్యవహార శైలితో ప్రేక్షకుల మనసు గెలుచుకునేందుకు వాళ్లంతా పాట్లు పడడంతో ఈ షో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికీ ఐదు టీవీ, ఒక ఓటీటీ సీజన్లు పూర్తి కాగా ప్రస్తుతం ఆరో సీజన్‌ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. మంగళవారం జరిగిన ఎపిసోడ్ తో ఒక్కసారిగా ఓటింగ్ షాకింగ్ గా మారింది. ఒకే ఒక్క సీన్ తో ఆమెను వెనక్కి నెట్టి ఆ కంటెస్టెంట్ టాప్ లో కొనసాగుతున్నాడు.

  సీజన్‌లోకి మొత్తం 21 మంది..

  సీజన్‌లోకి మొత్తం 21 మంది..

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్‌లోకి మొత్తం 21 మంది అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఇప్పటికీ 8 వారాలకు గాను 8 మంది షానీ సల్మాన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చలాకీ చంటి, సుదీప పింకీ, అర్జున్‌ కల్యాణ్, ఆర్జే సూర్య వెళ్లిపోయారు.

  నామినేషన్లో 10 మంది..

  నామినేషన్లో 10 మంది..


  సాధారణంగా బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కు ఎన్నో గొడవలతో సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తొమ్మిదో వారం ప్రక్రియ కూడా చాలా వాగ్వాదాలు, దూషణలతో రసవత్తరంగా సాగింది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న 13 మంది ఇంటి సభ్యుల్లో ముగ్గురు శ్రీహాన్, వాసంతి, రాజ శేఖర్ తప్పా మిగిలిన 10 మంది కంటెస్టెంట్స్ గీతూ రాయల్, ఇనయా సుల్తానా, శ్రీ సత్య, రేవంత్, బాలాదిత్య, కీర్తి భట్, ఆదిరెడ్డి, మెరీనా అబ్రహం, రోహిత్ సహ్ని, ఫైమా నామినేట్ అయ్యారు.

  ఎప్పటిలానే రేవంత్ టాప్ లో..

  ఎప్పటిలానే రేవంత్ టాప్ లో..

  సోమవారం నామినేషన్స్ అన్న సంగతి తెలిసిందే. సోమవారం అర్ధరాత్రి నుంచే ఓటింగ్ స్టార్ట్ కాగా రేవంత్ ఎప్పటిలానే టాప్ లో కొనసాగగా.. రెండో స్థానంలోకి ఇనయా సుల్తానా వచ్చేసింది. మూడో స్థానంలో కీర్తి, ఆదిరెడ్డి నాలుగు, బాలాదిత్య ఐదు, గీతూ ఆరు, రోహిత్ ఏడు, శ్రీసత్య ఎనిమిది, ఫైమా తొమ్మిది, మెరీనా పదో స్థానాల్లో కొనసాగారు. అయితే ఇది సోమవారం జరిగిన నామినేషన్స్ ప్రకారం వచ్చిన ఓటింగ్.

  మారిపోయిన ఓటింగ్..

  మారిపోయిన ఓటింగ్..

  మంగళవారం నాటికి మాత్రం ఓటింగ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఓటింగ్ తో టాప్ లోకి బాలాదిత్య దూసుకొచ్చాడు. ఎందుకంటే మంగళవారం వదిలిన ప్రోమో, ఎపిసోడ్ తో ఈ ఓటింగ్ పెరిగింది. అన్ అఫిషియల్ పోల్ ప్రకారం బాలాదిత్య టాప్ లో ఉంటే రెండో స్థానంలో రేవంత్ ఉన్నాడు. ఇనయా సుల్తానా మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత కీర్తి 4, ఆదిరెడ్డి 5, రోహిత్ 6, మెరీనా 7, ఫైమా 8, శ్రీ సత్య 9, చివరి పదో స్థానంలో గలాట గీతూ చేరింది.

  వీక్ నెస్ పై దెబ్బ కొడుతూ..

  వీక్ నెస్ పై దెబ్బ కొడుతూ..

  మంగళవారం ఉదయం బాలాదిత్య ఏడుస్తున్న ప్రోమోతో ఈ ఓటింగ్ గ్రాఫ్ మారిపోయింది. టాస్క్ జరుగుతున్నప్పుడు గేమ్ పరంగా ఆడకుండా బాలాదిత్య వీక్ నెస్ పై దెబ్బ కొడుతూ గేమ్ ఆడింది. బాలాదిత్యకు స్మోకింగ్ అలవాటు ఉందని తెలిసిందే. అవి లేకుంటే అతను ఒత్తిడికి లోనవుతాడు, డిప్రెషన్ లోకి వెళతాడు. అది తెలిసిన గీతూ తాజాగా జరిగిన బ్లూ అండ్ రెడ్ టీమ్ స్క్వాడ్ గేమ్ టాస్క్ లో సిగరెట్స్, లైటర్ దాచిపెట్టింది.

   చెల్లి అని పిలిచిన బాలాదిత్యపై ఇలా చేయడంతో..

  చెల్లి అని పిలిచిన బాలాదిత్యపై ఇలా చేయడంతో..

  లైటర్, సిగరెట్లు దాచిపెట్టి స్ట్రిప్స్ ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసింది. ఆమెకు శ్రీ సత్య చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసింది. దీంతో బాలాదిత్య ఎమోషనల్ అయ్యాడు. ఇది చూసి కొంతమేర అర్థం చేసుకున్న శ్రీహాన్ వచ్చి ఓదార్చాడు తప్పా వాళ్లిద్దరు కనికరించలేదు. దీంతో చెల్లి అని పిలిచిన బాలాదిత్యపై గీతూ ఇలా చేయడంతో ఆమెపై నెగెటివిటీ మరింత ఎక్కువైంది. ఆమెకు ఎలాంటి బంధాలు, ఎమోషన్స్ లేకుండా చిరాకు తెప్పిస్తుందని నెటిజన్లలో చాలా గట్టిగా ఉన్న అభిప్రాయం.

   ఎలిమినేట్ చేయాలని..

  ఎలిమినేట్ చేయాలని..


  కానీ, ఆమెను ఎప్పుడూ బిగ్ బాస్ కాపాడుతూ వస్తాడని నెటిజన్ల అభిప్రాయం. తాజాగా గీతూ చేసిన పనికి ఆమెను కచ్చితంగా ఎలిమినేట్ చేయాలని నెటిజన్లు గట్టిగా ఫిక్స్ అయ్యారని టాక్. బిగ్ బాస్ ముద్దు బిడ్డగా పేరు తెచ్చుకున్న గీతూ రాయల్ ఉంటే ఇంకెన్నీ అరాచకాలు చూడాల్సి వస్తుందో అని ఈవారం ఆమెకు చరమగీతం పాడాలని అనుకుంటున్నారట నెటిజన్లు. అయినా బిగ్ బాస్ ఆమెను కాపాడతాడన్న టాక్ కూడా ఉంది. ఇదిలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ తో ఇనయా సుల్తానా కూడా ట్రెండింగ్ లోకి వచ్చినట్లు సమాచారం.

  English summary
  Baladitya Goes Top In Latest Voting Due To November 1 Date Episode And Netizens Feel Will Eliminate Geetu Royal This Week In Bigg Boss Telugu 6.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X