For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: హౌజ్ లో తప్పు చేసిన గీతూ.. ఆమెతోపాటు ఆదిరెడ్డితో అంట్లు తోమించిన బిగ్ బాస్

  |

  ఎన్నో అంచనాలు, విమర్శలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రియాలిటీ షో బిగ్ బాస్ షో. ప్రారంభమైన మొదటి సీజన్ నుంచి ప్రేక్షకుల ఆదరణతో దూసుకుపోతోంది ఈ షో. ఇప్పటికి ఐదు టెలివిజన్, ఒక ఓటీటీ సీజన్ లతో ఎంటర్టైన్ చేసిన ఈ రియాలిటీ షో తాజాగా ఆరో సీజన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ లోని కంటెస్టెంట్లపై బిగ్ బాస్ కోపంగా ఉన్నాడు.

  ఇప్పటివరకు జరిగిన సీజన్ లోని అందరికంటే ఈ ఆరో సీజన్ ఇంటి సభ్యులు అత్యంత దారుణంగా నిరాశపరిచారని అసహనం వ్యక్తం చేశాడు. తర్వాత వారికి బుద్ధి చేప్పేందుకని పనిష్ మెంట్ కూడా ఇచ్చాడు. ఈ క్రమంలోనే హౌజ్ సభ్యులకు పోటాపోటీ టాస్క్ లు ఇవ్వడం, అంట్లు తోమించడం వంటి శిక్షలు వేస్తున్నాడు బిగ్ బాస్. మరి దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 6 అక్టోబర్ 19 నాటి రెండో ప్రోమో వివరాల్లోకి వెళితే..

  ఇంటి సభ్యులకు చురకలు..

  ఇంటి సభ్యులకు చురకలు..

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ అక్టోబర్ 18న ప్రసారమైన ఎపిసోడ్ లో హౌజ్ మేట్స్ పై బిగ్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇంటి సభ్యులను అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిచి వాలందరికి క్లాస్ పీకాడు బిగ్ బాస్. ప్రతి విషయంలో ఇంటి సభ్యులు నిర్లక్ష్య వైఖరి ఆవలంబిస్తున్నారని చురకలు అంటించాడు. హౌజ్ లో ఉండాలని లేకుంటే తక్షణమే బయటకు వెళ్లొచ్చని చెప్పాడు. తర్వాత వాళ్లందరికి పనిష్ మెంట్ ఇచ్చే పనిలో పడ్డాడు బిగ్ బాస్.

  ఆకలి మంట ఎలా ఉంటుందో..

  ఆకలి మంట ఎలా ఉంటుందో..

  ఇందులో భాగంగానే ఇంటి సభ్యులతో బిగ్ బాస్ ఆడుకోవడం మొదలు పెట్టాడు. టాస్క్ లు సరిగా ఆడకుండా బద్దకంగా ఉంటున్న హౌజ్ మేట్స్ కు ఆకలి మంటలు ఎలా ఉంటుందో తెలిసేలా చేశాడు. పోరాడి గెలుచుకున్న వారికే ఆహారం అని కొత్త నియమం పెట్టారు.

  విజయం సాధించిన వారికే..

  విజయం సాధించిన వారికే..

  ఆహారం పొందేందుకు రెండు టీమ్ లుగా విభజించి పోటీలు పెట్టాడు బిగ్ బాస్. ఆ పోటీల్లో విజయం సాధించిన వారికే ఆహారం ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో చపాతీ, ఆలు కర్రీ ఫుడ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ ఆహారాన్ని గెలిచిన టీమ్ మాత్రమే తినాలని చెప్పారు.

  సంచాలక్ గా జబర్దస్త్ ఫైమా..

  సంచాలక్ గా జబర్దస్త్ ఫైమా..

  ఇందుకోసం రివర్స్ థగ్ ఆఫ్ వార్ పోటీ పెట్టాడు బిగ్ బాస్. ఇంటి సభ్యులు వాళ్ల నడుముకు తాడు కట్టుకుని ఈ గేమ్ ఆడతారు. ఈ ఆటలో కిందపడి చాలా కష్టపడ్డారు ఇంటి సభ్యులు. ఈ పోటీకి సంచాలక్ గా జబర్దస్త్ ఫైమా వ్యవహరించింది. ఈ గేమ్ లో విన్ అయిన వారు చపాతీలను తిన్నారు. ఈ క్రమంలోనే చపాతీ తింటూ శ్రీహాన్ ను ఊరించింది శ్రీ సత్య. ఇక ఓడిపోయిన గీతూ రాయల్ గెలిచిన ఆదిరెడ్డి ప్లేట్ లో నుంచి భోజనం తీసుకుని తినింది.

  నియమాలను ఉల్లంఘిస్తే..

  నియమాలను ఉల్లంఘిస్తే..

  ఇది చూసిన బిగ్ బాస్ కి కోపం వచ్చింది. దీంతో నియమాలను ఉల్లంఘిస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ముందే హెచ్చరించడం జరిగింది. ఆదిరెడ్డి మీరు మీ ఆహారాన్ని ఓడిపోయిన టీమ్ కు చెందిన గీతూ రాయల్ తో పంచుకున్నారు. అందుకే మీ ఇద్దరు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పాడు బిగ్ బాస్.

  గిన్నెలు తోమడం మొదటిసారి..

  గిన్నెలు తోమడం మొదటిసారి..

  అలా చెప్పి వారిద్దరితో ప్లేట్లు, గిన్నెలు, పెద్ద బౌల్స్ పడేసి తోమించారు. వారు గిన్నెలు తోముతున్నప్పుడు మిగతా ఇంటి సభ్యులు ఫన్ క్రియేట్ చేశారు. చిన్న ఆలు ముక్కు పెట్టింది పెద్ద బొక్క అని ఆర్జే సూర్య నవ్వించాడు. తర్వాత అంట్లు తోమాకా.. ఆదిరెడ్డి, గీతూ ఒకే చోట కూర్చుని మాట్లాడుకున్నారు. మొదటిసారి గిన్నెలు తోమడం, ఎప్పుడు తోమిందే లేదు అని ఆదిరెడ్డి అంటే.. మా ఇంట్లో నేను చేయి కడుక్కోడానికి కూడా గిన్నె పట్టుకొస్తారు అని గీతూ చెప్పింది. టార్చర్ తల్లీ ఇదందా అని నిట్టూర్చాడు ఆదిరెడ్డి.

  నామినేషన్లలో 13 మంది..

  ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్‌లోని ఏడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ లో మొత్తం 13 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో ఇనాయా సుల్తానా, బాలాదిత్య, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్, కీర్తి భట్, శ్రీహాన్‌, శ్రీ సత్య, రేవంత్, జబర్ధస్త్ ఫైమా, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్, రోహిత్‌లు ఉన్నారు. కెప్టెన్ ఆర్జే సూర్య, గీతూ రాయల్ నామినేషన్ లో లేరు.

  English summary
  Bigg Boss Gives Punishment To Geetu Royal Adireddy Through Cleaning In Bigg Boss Telugu 6th Season October 19th Episode Promo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X