For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: కంటెస్టెంట్లపై బిగ్ బాస్ ఫైర్.. గేట్లు ఓపెన్.. ఇక నుంచి సీజన్ మొత్తానికి నో కెప్టెన్సీ?

  |

  దేశంలో అత్యధిక పాపులర్ రియాలిటీ షోలోకెల్లా మోస్ట్ పాపులర్ బిగ్ బాస్. హిందీలో ప్రారంభమైన ఈ షో ఆ తర్వాత వివిధ భాషల్లోకి పాకింది. ఈ క్రమంలోనే తెలుగులో స్టార్ట్ చేశారు. అనేక కాంట్రవర్సీల మధ్య ప్రారంభమైన ఈ షో ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ సీజన్లపై సీజన్లతో ముందుకు వస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ప్రసారమవుతోన్న విషయం తెలిసిందే. అయితే గత సీజన్లతో పోలిస్తే.. ఈ సీజన్ చాలా చప్పగా సాగుతోందని టాక్ వినిపిస్తోంది. పెద్దగా తెలియని కంటెస్టెంట్లు, వాళ్లు ఎంత ప్రయత్నించినా రాని పర్ఫామెన్, చిరాకు తెప్పించే పలువురి ఓవరాక్షన్ తో రేటింగ్ అయితే దారుణంగా పడిపోయిందని సమాచారం. అయితే తాజాగా ఇంటి సభ్యులపై ఫైర్ అయి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ వివరాళ్లోకి వెళితే..
  మిగతా సీజన్లతో పోలిస్తే..

  కంటెస్టెంట్ల తీరు నచ్చక..

  కంటెస్టెంట్ల తీరు నచ్చక..

  ప్రేక్షకులకు పెద్దగా తెలియని కంటెస్టెంట్లు, వాళ్లు ఎంత ప్రయత్నించినా ఆకట్టుకోని పర్ఫామెన్, చిరాకు తెప్పించే ఓవరాక్షన్ తో రేటింగ్ ఇప్పటికే దివాలా తీసిందని టాక్. ఇక హౌజ్ లో బిగ్ బాస్ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారీతీనా కంటెస్టెంట్లు వ్యవహరించడంతో అస్తవ్యస్తంగా సాగుతోందని టాక్. అయితే ఇది ఇలానే సాగితే చాలా కష్టమని భావించారో, లేక నిజంగానే కంటెస్టెంట్ల తీరు నచ్చకనో తెలియదు గానీ ఇంటి సభ్యులపై తీవ్రంగా సీరియస్ అయ్యాడు బిగ్ బాస్.

   రెండు గ్రూపులుగా విడగొట్టి..

  రెండు గ్రూపులుగా విడగొట్టి..

  బిగ్ బాస్ తెలుగు 6 అక్టోబర్ 18న ప్రసారమయ్యే ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడగొట్టి సినిమా పాత్రలను ఇచ్చాడు. అందులో బాహుబలిగా రోహిత్, దేవసేనగా మెరీనా, చిరంజీవిగా రేవంత్, వెంకటేష్ గా ఆదిరెడ్డి, అతిలోక సుందరిగా ఇనయా సుల్తానా, పుష్పగా ఆర్జే సూర్య, శ్రీవల్లిగా గీతూ రాయల్, రాములమ్మగా కీర్తి భట్, బాలకృష్ణగా శ్రీహాన్, ప్రభాస్ గా రాజ శేఖర్, పవన్ కల్యాణ్ గా బాలాదిత్య ఉన్నట్లు తెలుస్తోంది.

  ఒక్కసారిగా విరుచుకుపడిన బిగ్ బాస్..

  ఒక్కసారిగా విరుచుకుపడిన బిగ్ బాస్..

  అయితే ఈ పాత్రల్లో వారు కొద్దిసేపు కూర్చున్నట్లు తెలుస్తోంది. దీంతో వారు చేసిన పర్ఫామెన్స్ బిగ్ బాస్ కు నచ్చనట్లు ఉంది. ఇక ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డాడు బిగ్ బాస్. అందరినీ గార్డెన్ ఏరియాలోకి రమ్మని వరుసగా నిలుచోమ్మని చెప్పాడు. ''మీకు ఈ షో పట్ల ఆసక్తి లేదని మీరు నమ్మినట్లయితే తక్షణమే ముఖ్య ద్వారం నుంచి బిగ్ బాస్ ఇంటిని వదిలి బయటకు వెళ్లొచ్చు'' అని చెప్పి గేట్లు ఓపెన్ చేయించాడు బిగ్ బాస్.

   టాస్క్ ను మధ్యలో ఆపేసి..

  టాస్క్ ను మధ్యలో ఆపేసి..

  దీంతో హౌజ్ మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇదంతా ఇవాళ్టి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో చూపించారు. అయితే ఈ టాస్క్ ను మధ్యలో అర్థాంతరంగా ఆపేసి కంటెస్టెంట్లపై బిగ్ బాస్ విరుచుకుపడ్డాని బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. టాస్క్ కు సంబంధించిన కాస్ట్యూమ్స్ ని స్టోర్ రూమ్ లో పెట్టించి.. ఒక్క గేమ్ సరిగ్గా ఆడరని ఏకిపారేసినట్లు తెలుస్తోంది.

   కెప్టెన్సీ టాస్క్ రద్దు..

  కెప్టెన్సీ టాస్క్ రద్దు..

  అంతేకాకుండా ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్సీ టాస్క్ రద్దు చేసినట్లు బిగ్ బాస్ అల్టిమేటమ్ ఇచ్చినట్లు తాజాగా ఓ న్యూస్ అందింది. మరి ఇందులో ఏది ఎంతవరకు నిజమనేది పూర్తి ఎపిసోడ్ వచ్చాక గానీ తెలియదు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 ఏడో వారం నామినేషన్లలో గీతా రాయల్, ఆర్జే సూర్య మినహా.. మొత్తం 13 మంది కంటెస్టెంట్లు ఉన్న విషయం తెలిసిందే.

  English summary
  Bigg Boss Serious On Housemates And Open House Gates To Go Out In Bigg Boss Telugu 6th Season. And Cancelled Captaincy Entire Season.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X