పూజిత పొన్నాడతో పెళ్లి వరకు.. షాకింగ్‌గా బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు అర డజన్ బ్రేకప్స్!

బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటుడు అర్జున్ కళ్యాణ్ బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో సీజన్ 6 ద్వారా టీవీ ఆడియెన్స్ లో మరింతగా పేరు సంపాదించుకున్నారు. ఇక స్టార్ స్టేటస్ ను కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్రేకప్స్, యంగ్ బ్యూటీ పూజితా పొన్నాడతో ప్రేమ పెళ్లికి ప్లాన్ వంటి విషయాలపై స్పందించారు. ఆయన బ్రేకప్ స్టోరీలపై ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

రీసెంట్ ఇంటర్వ్యూలో అర్జున్ కళ్యాణ్ తన బ్రేక్స్ పై రియాక్ట్ అయ్యారు. ఇంజనీరింగ్ లో రెండు బ్రేకప్స్, అమెరికాలో ఒకరితో రిలేషన్ షిప్ అయి బ్రేకప్, మరో నటితో బ్రేకప్, ఇక నటి పూజితా పొన్నాడతోనూ రిలేషన్ షిష్ లో ఉండి పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్ అయినట్టు తెలిసిందని ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనిపై బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్ ఇలా స్పందించారు. 'ఇదంతా నిజమే. పూజితా పొన్నాడతో బ్రేకప్ అయ్యింది. అంతకు ముందు కూడా బ్రేకప్ లు జరిగాయి. పూజితా పొన్నాడ నేను ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిల్మ్ తో దగ్గరయ్యాం. ఆ తర్వాత రిలేషన్ షిప్ స్టార్ట్ అయ్యింది. పెళ్లి వరకు కూడా వెళ్లాం. కానీ ఎందుకో చివరల్లో కుదరలేదు.

Bigg Boss Telugu 6 Contestant Arjun Kalyan Poojitha Ponnada Breakup Story

ఇక వాసంతితో నాకు మొదటి నుంచి మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది. శిరీష అనే అమ్మాయితో రిలేషన్ ఉండేది. కానీ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత కొంచెం ఎఫెక్ట్ అయ్యింది. ఇక బీబీ జోడీలో కిస్ చేయడం స్క్రిప్ట్ లాంటిదే. ఇక శిరీష మాత్రం నాకు ఫ్రెండే. మా ఇంట్లో చాలా సంప్రదాయంగా ఉంటారు. ఇలాంటి వాటిపై సీరియస్ గా ఉంటారు. అందుకు నేనే ముందే ఇంట్లో చెంపేస్తా. పూజితా గురించి కూడా ఇంట్లో చెప్పాను. మా ఫ్యామిలీతోనూ తనతో టచ్ లో ఉండేవారు. ఇక బ్రేకప్ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నాం.' అని అర్జున్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

అర్జున్ కళ్యాణ్ కెరీర్ 2013 నుంచే ప్రారంభం అయ్యింది. ఆయన బీటెక్ పూర్తి చేసిన తర్వాత సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. ఇదే సమయంలో పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ వచ్చారు. చిన్న సినిమా చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత నేనూ నా గర్ల్ ఫ్రెండ్ టీవీ సిరీస్ తో 2016లో కాస్తా గుర్తింపు దక్కించుకున్నారు.

ఇక పూజితా పొన్నాడతో కలిసి ఉప్మా తినేసింది. సూడోసైడ్, అన్ స్పోకెన్ వంటి షార్ట్ ఫిల్మ్స్ లో కలిసి నటించారు. వరుడు కావలనె అనే చిత్రంతో పాటు ప్రేమ్ చిత్రంలో చిన్న పాత్రల్లో మెరిశారు. ఇక మిస్మమ్మ అనే వెబ్ సిరీస్ తోనూ అలరించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ద్వారా 2022లో మెరిశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X