Don't Miss!
- Finance
High Tax: ఆ ఇన్వెస్టర్లకు ఝలక్.. టాక్స్ రేటు 5 నుంచి 20 శాతానికి పెంపు.. ఎప్పటి నుంచంటే..
- News
చైనాకు అమెరికా భారీ షాక్ - కూల్చివేత..!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6: ఫైనల్ ఎపిసోడ్ కూడా డిజాస్టర్.. గత 5 సీజన్స్ కంటే చెత్త రేటింగ్స్!
బిగ్ బాస్ గత ఐదు సీజన్స్ రేటింగ్స్ ద్వారా అయితే స్టార్ మా నిర్వాహకులకు ఎంతగానో లాభాలను అందుకున్నారు. అయితే 6వ సీజన్కు వచ్చేసరికి మాత్రం వారు అత్యాశతో చేసిన కొన్ని పొరపాట్లు షో రేటింగ్ను భారీ స్థాయిలో తగ్గించేసాయి. దీంతో నాగార్జున కూడా కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసేటప్పుడే తీవ్రస్థాయిలో నిర్వాకులపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఆరో సీజన్లో ఫైనల్ ఎపిసోడ్ కూడా అత్యంత దారుణమైన రేటింగ్స్ వచ్చాయి. ఇక గత సీజన్ తో పోలిస్తే ఏ స్థాయిలో బిగ్ బాస్ పడిపోయింది అనే విషయం అర్థమవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదటి సీజన్ టీఆర్పీ
బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి కూడా ఓ వర్గం ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. మొదట్లో హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ రావడంతో భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక మొదటి సీజన్ లాంచ్ ఎపిసోడ్ కు 16.18 టిఆర్పి రాగా ఆ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు కాస్త తక్కువగా 14.13 టీఆర్పీ వచ్చింది.

రెండవ సీజన్ లో నాని
ఇక బిగ్ బాస్ రెండవ సీజన్ నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు కూడా దాదాపు అదే తరహాలో రేటింగ్ వచ్చింది. మొదటి ఎపిసోడ్ కు 15 టిఆర్పి రేటింగ్ రాగా ఫైనల్ ఎపిసోడ్ కు 15.0 టిఆర్పి వచ్చింది. ఒక విధంగా రెండో సీజన్ స్థాయి మరికొంత పెరిగింది అనిపించింది.

3వ సీజన్ లో రికార్డులు
ఇక
జూనియర్
ఎన్టీఆర్
నాని
ఇద్దరు
కూడా
ఒత్తిడి
తట్టుకోలేక
ఆ
తర్వాత
కొనసాగ
లేకపోయారు.
దీంతో
రంగంలోకి
దిగిన
నాగార్జున
ఏ
మాత్రం
బ్రేక్
లేకుండా
ముందుకు
సాగారు.
ఆయన
మూడవ
సీజన్
నుంచి
బిగ్
బాస్
హోస్ట్
కొనసాగుతున్నారు.
అయితే
మూడో
సీజన్
మొదటి
ఎపిసోడ్
కు
17.9
టిఆర్పి
వచ్చింది.
ఇక
ఫైనల్
ఎపిసోడ్
కు
18.29
టిఆర్పి
రావడంతో
అప్పటికి
అది
ఒక
సరికొత్త
రికార్డుగా
నమోదైంది.

4వ సీజన్ కూడా హిట్
ఇక నాలుగవ సీజన్ కు కూడా మరింత ఎక్కువ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు కూడా నాగార్జుననే హోస్ట్ గా కొనసాగిన విషయం తెలిసిందే. నాలుగవ సీజన్ మొదటి ఎపిసోడ్ కు 18.5 టిఆర్పి రాగా ఫైనల్ ఎపిసోడ్ కు అంతకంటే ఎక్కువ స్థాయిలో 19.51 టిఆర్పి వచ్చింది. ఆ సీజన్ వలన కూడా బిగ్ బాస్ కు చాలా లాభాలు వచ్చాయి.

5వ సీజన్ కు తక్కువగా..
ఇక
రేటింగ్
కూడా
అధికంగా
వస్తూ
ఉండడంతో
నాగార్జున
ఐదవ
సీజన్
కు
వచ్చేసరికి
తన
రెమ్యునరేషన్
కూడా
అమంతంగా
పెంచేసాడు.
అంతే
కాకుండా
బిగ్
బాస్
నిర్వాహకులు
కూడా
కంటెస్టెంట్స్
విషయంలో
ప్రయోగాలు
చేసింది.
ఇక
ఐదవ
సీజన్
కు
మాత్రం
మళ్లీ
రేటింగ్స్
ఒకసారి
గా
తగ్గిపోతూ
వచ్చాయి.
ఐదవ
సీజన్
మొదటి
ఎపిసోడ్
కు
15.71
టీఆర్పీ
వచ్చింది.
దీంతో
ఫైనల్
ఎపిసోడ్
కు
మాత్రం
కాస్త
ఎక్కువగా
16.04
టీఆర్పీ
వచ్చింది.

6వ సీజన్ చెత్తగా..
ఇక బిగ్ బాస్ ఆరో సీజన్ మాత్రం మరింత దారుణంగా పడిపోయింది. అసలు ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు అత్యాశకు పోయి సెలబ్రిటీల విషయంలో కాస్త పొరపాట్లు చేసింది. తక్కువ పారితోషికం ఇచ్చి ఎవరిని పడితే వారిని తీసుకువచ్చింది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక బిగ్ బాస్ 6వ సీజన్ మొదటి ఎపిసోడ్ కు చాలా తక్కువ స్థాయిలో 8.86 TRP రాగా ఫైనల్ ఎపిసోడ్ కు అంతకంటే తక్కువ స్థాయిలో 8.17 TRP వచ్చింది. దీన్ని బట్టి బిగ్ బాస్ ఏ స్థాయిలో పడిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.