For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6:వెటకారమనే తలగడ.. ఓవరాక్షన్ దుప్పటి.. రేవంత్‌పై కమెడియన్ కామెంట్స్

  |

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ అనూహ్య పరిణామాలు, సంఘటనలతో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికీ బిగ్ బాస్ హౌజ్ లో 11 వారాలు గడవగా 12 మంది ఇంటి సభ్యులు హౌజ్ నుంచి బయటకు వెళ్లారు. ఇక ఈ వారం నామినేషన్లలో 9 మంది ఇంటి సభ్యులకు ఏడుగురు నామినేట్ అయ్యారు. తాజాగా ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో నామినేషన్ల పర్వంతోపాటు ఆడియెన్స్ అడిగిన ప్రశ్నలకు హౌజ్ మేట్స్ సమాధానాలు ఇచ్చారు.

  ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్లపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, విన్నర్స్, సినీ సెలబ్రిటీస్, రివ్యూవర్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ ద్వారా బయటపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బీబీ కేఫ్ కు జబర్దస్త్ కమెడియన్, సినిమా, బిగ్ బాస్ రివ్యూవర్ మహిధర్ హాజరయ్యాడు.

  ఇది వరకు ఒకసారి హాజరు..

  ఇది వరకు ఒకసారి హాజరు..

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా బిగ్ బాస్ కేఫ్ కు తాజాగా బిగ్ బాస్ రివ్యూవర్ మహిధర్ హాజరయ్యాడు. అతను ఇంతకుముందు కూడ హాజరై పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

  కుందేళ్లు ఎవరు.. తాబేళ్లు ఎవరు..

  కుందేళ్లు ఎవరు.. తాబేళ్లు ఎవరు..

  బిగ్ బాస్ సీజన్ 6 ఎంటర్టైన్ మెంట్ కి అడ్డా ఫిక్స్ లో 11 వారాలు గడిచిపోయాయి. హౌజ్ మేట్స్ లో ఎవరు రాబిట్స్ (కుందేళ్లు), ఎవరు టార్ టాయిస్ (తాబేళ్లు) చెప్పండి.. మాకు తెలియాలి అని మహిధర్ ను అరియానా గ్లోరి ప్రశ్నించింది. ఏది కుందేలు, ఏది తాబేలు అని చెప్పగలం గానీ, ఏది గెలుస్తుందో మాత్రం చెప్పలేను అని మహిధర్ ఆన్సర్ ఇచ్చాడు. దీనికి ఓహో అని రియాక్షన్ ఇచ్చింది అరియానా.

  వెటకారం అనే తలగడతో..

  వెటకారం అనే తలగడతో..

  కుందేలు లిస్ట్ లో ఫస్ట్ చెప్పమంటే రేవంత్ పేరు చెబుతాను. సెకండ్ పర్సన్ కింద చూసుకుంటే ఆదిరెడ్డి అనుకోవచ్చు.. కాకపోతే ఇది బెణికిన కాలు ఉన్న కుందేలు అని మహిధర్ పోల్చాడు. దీనికి అయ్యయ్యో గాయమైంది అని అరియానా అంది. మూడో కుందేలు శ్రీహాన్ అని చెప్పుకోవచ్చు. పరిగెడుతున్నాడు.. పరిగెడుతున్నాడు.. మధ్యలో ఆగిపోయాడు. వెటకారం అనే ఒక తలగడ తీసుకుని.. ఓవరాక్షన్ అనే దుప్పటి తీసుకుని బాగా పడుకున్నాడు అని చెప్పుకొచ్చాడు మహిధర్.

   రేవంత్ కి రాని పని అది..

  రేవంత్ కి రాని పని అది..

  శ్రీసత్య విషయానికొస్తే బ్యాక్ బిట్చింగ్ ఎక్కువ ఉంటుంది.. బ్యాక్ స్టాబింగ్ (వెన్నుపోటు) ఎక్కువ ఉంటుంది అని షాకింగ్ కామెంట్స్ చేశాడు మహిధర్. ఎవిక్షన్ ఫ్రీ పాస్ విషయంలో ఆదిరెడ్డి చేసింది కరెక్టా.. రాంగా అని అరియానా అడిగితే.. వంద శాతం రాంగ్ అని చెప్పాడు మహిధర్. రేవంత్ అగ్రెషన్ లో మార్పు ఏమైనా కనిపించిందా అన్నదానికి.. రేవంత్ కి రాని పని అది.. మనకు రాని పని ట్రై చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు అనే పాలసీ అని మహిధర్ పేర్కొన్నారు.

  మీ గెస్ లు రాంగ్..

  మీ గెస్ లు రాంగ్..

  మహిధర్ కొనసాగిస్తూ గెలుపుకి బంధువులు ఎక్కువ.. ఓటమి ఒక అనాథలాంటింది. దానికి చుట్టాలు ఎవరు ఉండరు. దాన్ని ఎవరు పట్టించుకోరు కూడా అని మహిధర్ చెప్పాడు. దీంతో మహిధర్ గారు.. లాస్ట్ టైమ్ మీరు చాలా పర్ఫెక్ట్ గా ఊహించారు. కానీ, ఈసారి మీ గెస్ లు అన్ని రాంగ్ అవుతున్నాయి అని అరియానా అంటే.. కంటెస్టెంట్లు అలా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటారో అర్థం కావట్లేదని మహిధర్ చెప్పుకొచ్చాడు.

  సేఫ్ గేమ్ ఆడితే తప్పా..

  మీ గెస్ కరెక్ట్ అయితే ఓకేనా అరియానా అంటే.. వాళ్లే సేఫ్ గేమ్ ఆడంగా లేనిది.. మేము సేఫ్ గేమ్ ఆడితే వచ్చిందా అని రివ్యూవర్ మహిధర్ సమాధానం ఇచ్చాడు. దీంతో కళ్లు మూసుకుని ఉండిపోయింది యాంకర్ అరియానా గ్లోరి. ఇలా బిగ్ బాస్ కేఫ్ కు సంబంధించిన తాజా ప్రోమో సాగింది.

  English summary
  Jabardasth Comedian Mahidhar Shocking Comments On Bigg Boss Telugu 6 Contestants Sri Satya Revanth Shrihan In BB Cafe With Ariyana Glory.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X