For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: నామినేషన్ లో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. నువ్వే నా టార్గెట్ అంటూ గీతూ కౌంటర్

  |

  బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్యలో ఎంత సాన్నిహిత్యం ఉన్నా కూడా నామినేషన్స్ కు వచ్చేసరికి మాత్రం ఎ బంధాలు అయినా సరే శత్రువులుగా మారిపోతాయి. ఇక బిగ్ బాస్ 6వ సీజన్ కూడా మొదట ఎంతో స్నేహంగానే హ్యాపీడేస్ తరహాలో మొదలయ్యి ఇప్పుడు రెండవసారి నామినేషన్స్ కు వచ్చేసరికి కంటెంట్స్ అందరు కూడా ఒకరిపై ఒకరు ఊహించని విధంగా నిందలు వేసుకుంటున్నారు. ఇక రెండవ వారం నామినేషన్స్ కూడా మరింత ఆసక్తికరంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక ప్రోమో కూడా విడుదల చేశారు ఆ వివరాల్లోకి వెళితే..

  ఈసారి ఒక్క ఓటు మాత్రమే

  ఈసారి ఒక్క ఓటు మాత్రమే

  ఇక ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వివరాల్లోకి వెళితే.. ప్రతి వారం బిగ్ బాస్ ప్రతి కంటెస్టెంట్ కు కూడా ఇద్దరిని నామినేట్ చేసే ఓటు హక్కు మాత్రమే ఇస్తూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం ఒకే ఒక్క ఓటుతో ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలి అని ఇంట్లో ఎవరికి ఉండడానికి అర్హత లేదో సరైన కారణం చెప్పి ఓటు వేయాలి అని అన్నారు. నామినేట్ చేయాలని అనుకుంటున్నా కంటెస్టెంట్ యొక్క ఫోటోను ఒక కొండకు అతికించే దాన్ని బావిలో ప్రయాల్సి ఉంటుంది.

  బాండింగ్ సమస్య

  బాండింగ్ సమస్య

  ఇక ఈ తరహా నామినేషన్స్ లో ప్రతి ఒక్కరు కూడా చాలా కోపంగానే పాల్గొన్నట్లు అనిపిస్తోంది. ఇక ఆరోహి ఎప్పటిలానే మళ్లీ తనకు బాండింగ్ సమస్య ఎదురయింది అని ఆదిరెడ్డి తో ఆమె నామినేట్ చేసింది. ఇక ఈ ఇంట్లో ఆట ఆడని వారు వెళ్లిపోవాలా లేక నీతో రాపో లేనివాళ్ళు వెళ్లిపోవలా అని ఆదిరెడ్డి కోపంగానే అడిగాడు. కానీ ఆటలో తనకు బెస్ట్ పెర్ఫెమెన్స్ ఏమి అనిపించలేదు అని ఆరోహి వితండవాదం చేసింది.

  మగాళ్లకు బుద్దిలేదు

  మగాళ్లకు బుద్దిలేదు

  ఇక గీతు చేసిన కొన్ని కామెంట్స్ కు కౌంటర్ గా శ్రీహన్ ఆమెను నామినెట్ చేశాడు. నిన్న రాత్రి నువ్వు ఈ మగాళ్లకు బుద్దిలేదు అని ఎందుకు అన్నావు అని అడిగాడు. ఎవరో ఎదో చేశారు అని అందరిని అనడం ఎందుకని గీతుకి కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆమె ఎవరు చేశారో తనకు తెలియదని అంటూ అనవసరమైన మాటలు ఎక్కువగా మాట్లాడింది. అలాంటి స్టేట్మెంట్ అంటే ప్రతీ కుక్కకి ఒక్కరోజు వస్తుంది అనేది కాదని గీతు వివరణ ఇచ్చింది.

  మాట్లాడడం ఆపేయండి

  మాట్లాడడం ఆపేయండి

  నేహా చౌదరి కూడా గీతుని నామినేట్ చేసింది. కంప్లైంట్ పాయింట్స్ చెప్పేటప్పడు కూడా ఏంటి ఈ అమ్మాయి ఇలా ఆలోచిస్తుంది అని అనిపించిందని అనేసింది. ఇక నా మాటలు మీ మీద ఇంపాక్ట్ చూపిస్తే మీరు నాతో మాట్లాడడం ఆపేయండి అని సూటిగా సమాధానం ఇచ్చింది. ఇక ఆమె అలా అనడంతో నేత కూడా సైలెంట్ అయిపోయింది.

  మీకు మాత్రమే రెండు బుర్రలు

  మీకు మాత్రమే రెండు బుర్రలు

  ఇక కూల్ గా ఉండే సుదీప RJ సూర్యను నామినేట్ చేయడం విశేషం. నీకు నచ్చినట్లు ఉండాలి అంటే ఇక్కడ అవ్వదు అని సుదీప అనడంతో ఇక పాత గొడవలు గుర్తు చేస్తూ ఆడవాళ్ళని గౌరవించడం తన సంస్కారం అని మరో ఆన్సర్ ఇచ్చాడు. ఇక ఆది రెడ్డి అయితే మెరినా రోహిత్ లపై సెటైర్ వేశాడు. ఇక్కడ మీకు మాత్రమే రెండు బుర్రలు పని చేస్తున్నాయి అని అనడంతో అది బిగ్ బాస్ డిసిషన్ అని అన్నారు.

  నువ్వు నా టార్గెట్

  ఇక గీతు వర్సెస్ రేవంత్ గేమ్ మరోసారి హౌస్ లో వాతావరణాన్ని మార్చేలా ఉన్నట్లు అనిపిస్తోంది. నేను ఇక్కడా కాంపిటేటర్ అయితే నువ్వు నా టార్గెట్ అనే ఆలోచిస్తాను అని తెగేసి చెప్పింది. ఇక కీర్తి కూడా రేవంత్ తో వాదించినట్లు తెలుస్తోంది. నేను మెల్లగా మాట్లాడుతున్నప్పుడు మీరు మెల్లగా మాట్లాడాలి అని రేవంత్ చెబుతున్నా కూడా కీర్తి గట్టిగా అరిచేసింది. ఇదే నీ నెగిటివ్ ఫాల్ట్ అని ఆమె అలా అనడంతో రేవంత్ సహనం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ నామినేషన్ పోరులో ఎవరు నామినేట్ అవుతారో చూడాలి.

  English summary
  Bigg Boss Telugu 6 latest promo second week nomination new twist
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X