Don't Miss!
- Sports
నేను అనుకున్న సవాల్ ఎదురవ్వలేదు.. అతి త్వరలోనే సెంచరీ కొడతా: రోహిత్ శర్మ
- News
టీడీపీ డ్యామేజ్ కంట్రోల్- అయ్యన్నపై చర్యలు తీసుకోక తప్పదా..?!
- Lifestyle
లైఫ్ పార్ట్నర్తో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఇలా ఏర్పరచుకోండి
- Finance
Wipro Layoffs: ఫ్రెషర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విప్రో.. 452 మంది తొలగింపు..
- Automobiles
దేశీయ మార్కెట్లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు
- Technology
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
Bigg Boss Telugu 6: నేను మాట్లాడితే నీ ఇంట్లో గొడవలవుతాయి.. రేవంత్ పై శ్రీహన్ ఆగ్రహం
బిగ్ బాస్ లో రోజురోజుకు పరిస్థితులు మరింత విభిన్నంగా మారుతున్నాయి. కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫైలన్స్ లోకి వెళ్లేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమాత్రం పట్టు విడవకుండా వారి కంటే బలంగా ఉన్న వారిపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. ఇక ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్యలో అయితే మరింత పోటీ నెలకొంది. ఇక 12 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు 13వ వారంలో కొనసాగుతోంది. ఇక సోమవారం రోజు నామినేషన్స్ ముందు జరిగిన గొడవల విషయంలోకి వెళ్తే..

నామినేషన్స్ ముందు రోజు
హౌస్ లో ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నామినేషన్స్ ముందు రోజు మాత్రం ఊహించని సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా స్నేహితులుగా కలిసి ఉన్నవారు కూడా నామినేషన్ లో తప్పనిసరిగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇక అప్పుడప్పుడు మంచి స్నేహితులుగా కనిపిస్తున్న రేవంత్ శ్రీహాన్ మధ్యలో కూడా గొడవలు గట్టిగానే జరుగుతున్నాయి. ఈ వారం కూడా వారి మధ్య ఒక విషయంలో గొడవ మొదలైంది.

సరదాగా తీసుకున్నప్పటికీ..
రేవంత్ కొన్నిసార్లు ఇతర కంటెస్టెంట్స్ పై చేసే కామెంట్స్ ఊహించిన విధంగా ఉంటాయి. ఇప్పటివరకు వాటిని కొందరు సరదాగా తీసుకున్నప్పటికీ మళ్ళీ నామినేషన్స్ సమయంలో మాత్రం గుర్తు చేస్తూ నామినేట్ చేస్తున్నారు. ఒక విధంగా రేవంత్ చాలాసార్లు అలాంటి చిన్న చిన్న పాయింట్స్ గురించి నామినేట్ చేయడం చాలా దారుణం కొంచెం బలమైన కారణం చెప్పి నామినేట్ చేయాలి అని కౌంటర్లు కూడా ఇచ్చాడు.

మరొక అర్థం వచ్చేలా కామెంట్
అయితే
రేవంత్
కంటే
ఇప్పుడు
హౌస్
లో
బలంగా
ఉన్న
మరొక
కంటెస్టెంట్
శ్రీహన్
అని
చెప్పాలి.
వీరిద్దరికీ
జనాల్లో
మంచి
ఆదరణ
ఉంది.
ప్రతిసారి
కూడా
అత్యధిక
ఓట్లు
అందుకుంటున్న
వారిలో
ఎక్కువగా
వీరే
హైలైట్
అవుతున్నారు.
ఇక
శ్రీహన్
గతంలో
రేవంత్
చేసిన
కొన్ని
తప్పులను
ఎత్తిచూపుతు
తీవ్ర
ఆగ్రహం
వ్యక్తం
చేశాడు.
చాలాసార్లు
నామీద
కామెంట్స్
చేశావు.
మన
ఇద్దరి
మధ్యలో
ఒక
అమ్మాయి
ఉంది
అనే
విషయం
మర్చిపోయి
నేను
దుప్పటి
పట్టుకుని
వెళతాను
మరొక
అర్థం
వచ్చేలా
మాట్లాడుతామని
శ్రీహన్
అతనికి
చెప్పాడు.

ఎన్ని గొడవలు అవుతాయో తెలుసా?
అయితే నేను ఎన్ని కామెంట్స్ చేసినా కూడా అదే చాలా సరదాగా చేసినవే అని నువ్వు దాన్ని అనవసరంగా హైలైట్ చేసి సీరియస్ గా తీసుకుంటున్నావు అని కూడా రేవంత్ చెప్పాడు. కానీ శ్రీహన్ మాత్రం అతని మాటలకు ఏకీభవించలేదు. కొన్ని కొన్ని మాటలు అనకూడదు అని నేను నీ గురించి మాట్లాడితే నీ ఇంట్లో ఎన్ని గొడవలు అవుతాయో తెలుసా? అని మరొక విధంగా మాట్లాడాడు.

శ్రీ సత్య ఊహించని రియాక్షన్
అయితే శ్రీహన్, రేవంత్ ఇద్దరు గొడవ పడుతూ ఉండడంతో ఇంట్లో సభ్యులందరూ కూడా ఏమీ అనలేకపోయారు. అయితే పక్కనే శ్రీ సత్య కూడా వారి మధ్య గొడవలు ఆపలేకపోయింది. అంతేకాకుండా శ్రీ సత్య రేవంత్ కు సపోర్ట్ చేస్తున్నట్లు మాట్లాడింది. నువ్వు అనవసరంగా ఎందుకు ఆ మాటలను సీరియస్ గా తీసుకుంటున్నావు. అన్నంత మాత్రాన అది నిజమైపోతుందా అని ఆమె మరొక విధంగా మాట్లాడింది. ఇక తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే రేవంత్ శ్రీహన్ నార్మల్ గా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వివాదాలు ఫైనల్ ఎపిసోడ్లో ఎలాంటి వాతావరణం క్రియేట్ చేస్తాయో చూడాలి.