For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: ఆ అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. ఆర్జే సూర్య బ్రేకప్ స్టోరీ

  |

  బిగ్ బాస్ షోలో ఈసారి ఎలిమినేషన్స్ అనేవి ఊహించిన విధంగానే జరిగాయి. ముఖ్యంగా టాప్ ఫైల్ లో ఉంటారు అనుకున్న సగం మంది హౌస్ లో నుంచి వెళ్లిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ఈ సీజన్ మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ గా ఉంటాడు అనుకున్న ఆర్జే సూర్య కూడా వెళ్లిపోవడం ఓ వర్గం వారిని షాక్ కు గురి చేసింది. అతనికి అదృష్టం కలిసి రాకపోవడంతో సగం మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక అతను ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఎమోషనల్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే...

  రోజు పదిరూపాయలు

  రోజు పదిరూపాయలు

  ఆర్ జె సూర్య మాట్లాడుతూ.. నా జీవితం మొదట్లో చాలా ఇబ్బందుల్లోనే గడిచింది. ముఖ్యంగా మా ఫ్యామిలీ చాలా నిరుపేద కుటుంబం. అమ్మ బీడీలు చుట్టేది. నాన్న తాపీ మేస్త్రిగా పనిచేసేవాడు. నాన్న పని చేయకపోతే ఇంట్లో భోజనం కూడా ఉండేది కాదు. ఆయన ఒక్కరోజు కూడా సెలవు అనేది లేకుండా పనిచేసేవారు. వాళ్ళు తప్పితే నాకు ఈ ప్రపంచంలో మరెవరు స్ఫూర్తిగా నిలవలేరు. ఇక నేను స్కూల్లో ఉన్నప్పుడే సోడా బాటిల్లు క్లీన్ చేసుకుంటూ రోజు పది రూపాయలు సంపాదించుకునే వాడిని.. అని అన్నాడు.

  అమ్మాయితో ప్రేమ

  అమ్మాయితో ప్రేమ

  ఇక గ్రాడ్యుయేషన్ సమయంలోనే ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను. ఆమెతో కొన్నాళ్ల ప్రేమ అనంతరం పెళ్లి చేసుకుందామని కూడా చెప్పింది. అయితే హఠాత్తుగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను ఆ విషయంలో చాలా ఫీల్ అయిపోయాను. ఇక మా అమ్మ నా బాధ చూడలేక అమ్మాయి వాళ్ళ ఇంట్లో వారితో మాట్లాడి నచ్చ చెప్పింది.. అని సూర్య చెప్పాడు.

  ఫోన్ కాల్ వచ్చింది

  ఫోన్ కాల్ వచ్చింది

  ఇక పెళ్లి చేయడానికి అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. కాకపోతే చదువు పూర్తి అయిన తర్వాతనే పెళ్లి చేస్తామని అన్నారు. అది కూడా మీకు అప్పటివరకు ప్రేమ ఉంటేనే అని చెప్పడంతో సరే అని ఇద్దరం ఒప్పుకున్నాము. ఇక రెండు నెలలు గడిచిన తర్వాత నాకు అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ అమ్మగారు మా ఇంటికి వచ్చిన విధానం నాకు నచ్చలేదు. మీ నాన్నగారు అసలే రాలేదు.. అని సూర్య చెప్పుకొచ్చాడు.

  నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా

  నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా

  నాకు ఏదో అనుమానంగా ఉంది అసలు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని డౌట్ గా ఉంది అని ఆ అమ్మాయి చెప్పింది. అంతేకాకుండా మీ పేరెంట్స్ ను వదిలేసి మా ఇంటికి వచ్చేయాలని కూడా చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను. వెంటనే ఫోన్ పగలగొట్టేసాను...అని సూర్య చెప్పాడు.

  3 గంటల వరకు ఏడ్చాను

  3 గంటల వరకు ఏడ్చాను

  ఆ తర్వాత బాధపడుతూ ఇంటికి వెళ్లి తలుపులు మూసి ఒక్కసారిగా మా అమ్మ కాళ్ళ మీద పడిపోయాను. దాదాపు 3 గంటల వరకు ఏడ్చిన నేను వెంటనే మా అమ్మకు క్షమాపణలు కూడా చెప్పాను. ఇక అమ్మ కూడా జరిగిన విషయాలేని పట్టించుకోకుండా నన్ను క్షమించేసింది. ఇక మరుసటి రోజు చెన్నై రెడ్ ఎఫ్ఎమ్ సంస్థ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. హైదరాబాదులో వేకెన్సీ ఉంది అని చెప్పడంతో ఆ విధంగా నా ఆర్జే ప్రయాణం మొదలైంది. అనంతరం యాంకర్ గా అలాగే షార్ట్ ఫిలింలో కూడా నటిస్తూ ఇంతవరకు వచ్చాను.. అని ఆర్ జె సూర్య వివరణ ఇచ్చాడు.

  English summary
  Bigg boss telugu 6 rj surya about his emotional breakup story
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X