Don't Miss!
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6 ఇంటి సభ్యుల మధ్య ఆఖరి పోరాటం.. గెలిచిన రోహిత్, మొదలైన గొడవ!
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ పూర్తి కావడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఆదివారం అంటే డిసెంబర్ 18న గ్రాండ్ ఫినాలేలో ఈ సీజన్ టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు. గ్రాండ్ ఫినాలే అంటే సెలబ్రిటీల రాకతో సందడిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు, సెలబ్రిటీల మధ్య విన్నర్ ను ప్రకటించి ట్రోఫీ అందజేస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌజ్ లో ఆరుగురు ఉన్నారు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా శ్రీసత్య బయటకు వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇవాళ్టీ ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటనే వివరాల్లోకి వెళితే..

ఒక్కొక్కరి బిగ్ బాస్ జర్నీ..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లోకి 21 మంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇవ్వగా.. ప్రస్తుతం ఆరుగురు ఇంటి సభ్యులు మిగిలారు. వీరిలో ఈ 15వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా శ్రీసత్య ఎలిమినేట్ కానుందని వార్తలు వస్తున్నాయి. గత మూడు రోజులుగా ఇంటి సభ్యుల బిగ్ బాస్ జర్నీలను వారికి చూపించారు. ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అద్భుతంగా చెప్పాడు బిగ్ బాస్. అది విన్న ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు.

మీ మనసుల్లోని మాటలను..
ఇంటి సభ్యుల బిగ్ బాస్ జర్నీలు పూర్తి కావడంతో మళ్లీ వారికి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈసారి ప్రేక్షకుల ఓట్లను అడిగేందుకు గెలిచే టాస్క్ ఆడించారు బిగ్ బాస్. దీనికి సంబంధించిన డిసెంబర్ 15 గురువారం నాటి డే 102 ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో "మీ మనసుల్లోని మాటలను ప్రేక్షకులతో నేరుగా పంచుకుని వారి ఓట్లను సంపాందించుకునే అవకాశాన్ని మీ అందరికీ ఇస్తూ బిగ్ బాస్ ఈరోజు మీకు ఇస్తున్న టాస్క్ ఆఖరి పోరాటం" అని ఆదిరెడ్డితో చెప్పించారు.

రాయకూడదు రేవంత్..
అయితే ఈ టాస్క్ లో వచ్చే శబ్ధాలను గుర్తుపట్టి వాటిని వరుసగా రాయాలి. ఎవరు అయితే ఎక్కువ శాతం సరిగ్గా రాస్తారో వారికి ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం వస్తుంది. ఇందులో రకరకాల సౌండ్స్ ను వినిపించారు బిగ్ బాస్. ఈ శబ్ధాలు వస్తున్నప్పుడు రేవంత్ రాయడం మొదలు పెట్టాడు. అది చూసిన శ్రీసత్య అతడిని రాయకూడదు రేవంత్ అని చెప్పింది. అప్పుడు ఎందుకు సత్య మాట్లాడుతున్నావ్.. అని శ్రీహాన్ అన్నాడు.

మిగతా దాంట్లో తెచ్చుకోవచ్చు కదా..
శ్రీహాన్ అన్నదానికి తను రాస్తున్నాడు అని శ్రీసత్య వివరణ ఇచ్చుకుంటే.. తను రాస్తే వాళ్లు చూసుకుంటారు నువ్ సంచాలక్ ఆ అని శ్రీహాన్ అసహనం వ్యక్తం చేశాడు. తర్వాత కొద్దిసేపటికి.. రోహిత్, ఆదిరెడ్డి ఓట్లు అడిగే అవకాశానికి దగ్గరయ్యారు అని బిగ్ బాస్ తెలిపారు. దీంతో నీవల్లే పోయింది అని శ్రీహాన్ అంటే.. కాదు శ్రీహాన్ నేను మాట్లాడింది ఒక్కసారే.. మిగతా దాంట్లో తెచ్చుకోవచ్చుకదా పాయింట్స్ అని శ్రీసత్య అంది.

ఏ ఒక్కరికి లభించకూడదో..
శ్రీసత్య అన్నదానికి షాక్ అయ్యాడు శ్రీహాన్. మనవల్ల ఏదైనా అఫెక్ట్ అయిందన్న ఒక ఫీలింగ్ లేకుండా ఉంటారు చూడు మనుషులు అదే నచ్చంది నాకు అని శ్రీహాన్ కోప్పడ్డాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. అనంతరం ఇప్పుడు వీళ్ల నుంచి ఓ ఒక్కరికీ ఓటు అప్పీల్ చేసే అవకాశం లభించాలి, ఏ ఒక్కరికీ లభించకూడదో మిగతా ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో నిర్ణయించి బిగ్ బాస్ కు చెప్పండని శ్రీహాన్ అనౌన్స్ మెంట్ చదివాడు.
రోహిత్ కు 3 ఓట్లు..
అందరికీ ఓట్ అప్పీల్ చేయాలని ఉంటది నాకు ఓటు వేయండని ఆదిరెడ్డి అంటే.. ఇద్దరికీ సేమ్ పాయింటే.. సో మీరే నిర్ణయం తీసుకోండని రోహిత్ అన్నాడు. దీంతో ఫస్ట్ నుంచి రోహిత్ ను ఏకాభిప్రాయంలో తీసేయడం జరుగుతుంది అని శ్రీసత్య అంటే.. నేనైతే ఆదిరెడ్డి గారిని అనుకున్నాను అని రేవంత్ అన్నాడు. దీంతో ఓకే 3 ఓట్లు రోహిత్ కు వచ్చాయి కాబట్టి రోహిత్ అని శ్రీహాన్ చెప్పాడు. ఏకాభిప్రాయంతో రోహిత్ ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం దక్కించుకున్నాడు. 15వ వారం వరకు సపోర్ట్ చేస్తున్నారు.. నేను టైటిల్ విన్నర్ అవుతానని నమ్ముతున్నాను అని రోహిత్ తెలిపాడు.