For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: గెలిచినా 40 లక్షలు రాలేదు.. బాధగానే ఉంది.. : సింగర్ రేవంత్!

  |

  బిగ్ బాస్ 6వ సీజన్ ఊహించిన విధంగా ముగిసిపోయింది. ముఖ్యంగా విన్నర్ ఎవరో అనే విషయంలో ముందుగానే ఒక లీక్ అయితే వచ్చేసింది. కానీ ఓట్ల లెక్కల ప్రకారం రేవంత్ విజేత కాదు అని నాగార్జున చివరిలో ట్విస్ట్ ఇచ్చాడు. ఈ క్రమంలో శ్రీహన్ తీసుకున్న నిర్ణయం వలన రేవంత్ ఒక తరహాలో లాభ పడినట్లే అని చెప్పవచ్చు. ఇక బయటకు వచ్చిన తర్వాత మొదటగా ఒక ఇంటర్వ్యూలో రేవంత్ 40 లక్షలు పోయిన విషయం గురించి కొంత వివరణ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  టాప్ 5లో..

  టాప్ 5లో..

  బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్లో చివరి రోజు మొత్తం ఐదు మంది కప్ కోసం పోటీ పడగా అందులో ఫైనల్ గా శ్రీహాన్ రేవంత్ ఇద్దరు మిగిలిపోయారు. ఇక వారిద్దరిలో ఎవరు గెలుస్తారో అనే విషయంలో ముందుగానే జనాలు రేవంత్ గెలుస్తాడు అని ఒక క్లారిటీకి వచ్చేసారు. ఇక టాప్ 3 ఉన్నప్పటి నుంచి కూడా బిగ్ బాస్ వారికి మనీ ఆఫర్ చేస్తూ వచ్చాడు. కీర్తి తీసుకొకపోవడంతో ఆటలో రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి.

  ఆమె ఒప్పుకొని ఉంటే..

  ఆమె ఒప్పుకొని ఉంటే..

  బిగ్ బాస్ ఫైనల్లో కీర్తి గనక బిగ్ బాస్ ఆఫర్ ను ఒప్పుకుని డబ్బు తీసుకుని ఉంటే తప్పకుండా ఆటలో చాలా చేంజెస్ వచ్చేవి. ఫైనల్ గా అత్యధిక ఓట్లు అందుకున్నటువంటి శ్రీహాన్ని గెలిచి ఉండేవాడు. అయితే రేవంత్ మాత్రం మొదటినుంచి కూడా తనకే ఎక్కువ మెజారిటీ ఓట్లు వచ్చాయని నమ్మకంతోనే బిగ్ బాస్ ఎన్ని ఆఫర్లు ఇచ్చిన కూడా రిజెక్ట్ చేస్తూ వచ్చాడు.

  రేవంత్ రియాక్షన్

  రేవంత్ రియాక్షన్

  ఇంకా చివరగా రేవంత్ గెలవడానికి శ్రీహన్ కూడా మరొక కారణమయ్యాడు. అతను 40 లక్షల క్యాష్ తీసుకొని రేవంత్ ను విజేతగా చేశాడు. అయితే ఈ విషయంపై రేవంత్ మొదటి సారి మీడియా ముందు తన వివరణ ఇచ్చాడు. ఎవరు ఎన్ని అనుకున్నా కూడా నాగార్జున గారు డబ్బు ఆశ ఎంత చూపించినా కూడా నేను టెంప్ట్ అవ్వకుండా కప్ గెలవాలి అని నిర్ణయంతోనే గెలిచాను. దీనికి జనాలు ఎంతగానో సపోర్ట్ చేశారు అని కూడా రేవంత్ చెప్పాడు.

  40 లక్షలు వదిలేసుకున్నా..

  40 లక్షలు వదిలేసుకున్నా..

  కప్ కోసం 40 లక్షలు వదిలేసుకున్నా.. నాకు కూడా బాధగానే ఉంది. ఎందుకంటే చాలా కష్టపడ్డాను. నాగార్జున సార్ డబ్బులు ఆఫర్ తో వచ్చినప్పుడు నేను శ్రీహన్ తరహాలో మాట వెనక్కి తీసుకోలేదు. ఫస్ట్ నుంచి నేను ఒకటే స్టాండ్ మీద ఉన్నాను. కప్పు మాత్రమే ఇంపార్టెంట్ అనుకున్నాను. పేరు సంపాదిస్తే డబ్బు అదంతట అదే వస్తుంది అని నమ్ముతాను. డబ్బులది ఏముంది ఎలాగైనా సంపాదించొచ్చు ఖర్చు పెట్టవచ్చు కానీ రేపు పొద్దున గూగుల్ లో కొడితే ఎవరు ఏమిటి అని అడిగితే టైటిల్ విన్నర్ రేవంత్ అని వస్తుంది. నాకు ఆ తరహా గుర్తింపు చాలు.. అని రేవంత్ అన్నాడు.

  శ్రీహన్ గురించి..

  శ్రీహన్ గురించి..

  అయితే పోటీ ఎంత ఉన్నా కూడా శ్రీహన్ నాకు ఎప్పుడు స్నేహితుడిగానే ఉంటాడు. ఇద్దరం గెలిచాము అని అనుకుంటున్నాను అని రేవంత్ అన్నారు. అయితే రేవంత్ హౌస్ లోకి వెళ్లే ముందు కప్ నాకే ఇవ్వాలి అనే అగ్రిమెంట్ కుదుర్చుకొని హౌస్ లోకి అడుగుపెట్టాడు అని ఒక టాక్ వచ్చింది. దానిపై మీ అభిప్రాయం ఏమిటి అని అడగడంతో.. అనేవాడు ఎన్నో మాటలు అంటాడు. అలాంటి వాటిని నేను ఎంత మాత్రం పట్టించుకోను అని రేవంత్ చెప్పాడు. అంతేకాకుండా నాకు జనాల సపోర్ట్ చాలా స్వచ్ఛంగా ఉంది అని ఇక్కడి నుంచి నా తదుపరి కెరీర్ విషయంలో తగ్గేదేలే అంటూ రేవంత్ దీటుగా ఆన్సర్ ఇచ్చాడు.

  English summary
  Bigg boss telugu 6 singer revanth abouts 40 lakhs twist
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X