Don't Miss!
- News
ఎన్నికల వేళ కొత్త వరాలు - కీలక నిర్ణయాలు: నేడే ప్రభుత్వ ప్రకటన..!?
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6 హౌజ్ లో ఏకాభిప్రాయం రచ్చ, తొలిసారి శ్రీసత్యపై శ్రీహాన్ ఫైర్.. చెత్త నిర్ణయమంటూ!
ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ ఆసక్తికరంగానే సాగుతోంది. ప్రస్తుతం హౌజ్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తోంది. డిఫరెంట్ రౌండ్స్ తో మూడు రోజులుగా ఈ టాస్క్ కంటిన్యూ అవుతోంది. ఇంటి సభ్యులు ఎవరికీ వారే గట్టి పోటీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ పోటీలో శ్రీసత్య, ఇనయా సుల్తానా, కీర్తి భట్ ముగ్గురు డిస్ క్వాలిఫై కాగా రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఫైమా కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఈ హౌజ్ లో ఏకాభిప్రాయమనే చర్చ ఎన్నోసార్లు వచ్చింది. మళ్లీ తాజాగా విడుదల చేసిన డిసెంబర్ 2 శుక్రవారం నాటి ఎపిసోడ్ లో మళ్లీ అదే చర్చ సాగింది.

రోహిత్ కోసం ఫైమా..
గత ఎపిసోడ్ లో ఏకాభిప్రాయంలో భాగంగా ఆదిరెడ్డి, రేవంత్ తప్పుకోగా.. శ్రీహాన్, కీర్తి, రోహిత్, ఫైమా రోల్ బేబీ రోల్ గేమ్ ఆడారు. ఇందులో శ్రీహాన్ ఫస్ట్, రోహిత్ సెకండ్ వచ్చారు. చివరిగా వచ్చిన కారణంగా కీర్తి ఔట్ అయిపోయింది. తర్వాత గుడ్డు జాగ్రత్త టాస్క్ లో ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్ పాల్గొన్నారు. రోహిత్ కోసం ఫైమా తప్పుకుంది. ఈ టాస్క్ లో వరుసగా ఆదిరెడ్డి, రోహిత్, రేవంత్ వచ్చారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మళ్లీ ఏకాభిప్రాయమనే చర్చ వచ్చింది.

ఏకాభిప్రాయంతో నిర్ణయించి..
ఈ ప్రోమోలో అనౌన్స్ మెంట్ ను శ్రీహాన్ చదివాడు. తదుపరి ఛాలెంజ్ లో కేవలం ముగ్గురు పోటీదారులు మాత్రమే పాల్గొంటారు. ఐదుగురు పోటీ దారులు ఏకాభిప్రాయంతో నిర్ణయించి బిగ్ బాస్ కు చెప్పండని శ్రీహాన్ తెలిపాడు. నేనైతే ఆడాలనుకుంటున్నాను అని ఫైమా అంది. కష్టపడి ఆడి ఫస్ట్ పొజిషన్ కు వచ్చిన నేను ఒక త్యాగం వల్ల డౌన్ అయి.. ఇంకో త్యాగం వల్ల అంతకన్నా డౌన్ అవ్వడం నాకు ఇష్టం లేదని రేవంత్ చెప్పాడు.

చూసేందుకే ఎబ్బెట్టుగా ఉంటుంది..
నాలుగో పొజిషన్ నుంచి మూడో స్థానానికి, అక్కడి నుంచి ఫస్ట్ పొజిషన్ కు వచ్చాను. అంతకష్టపడి తెచ్చుకున్న పొజిషన్ ని కిందకు దించుకోవాలనుకోవట్లేదని శ్రీహాన్ అన్నాడు. సింపుల్ ఈక్వెల్ నంబర్ ఆఫ్ టాస్క్స్ ఆడాము. నాకంటే ఎక్కువ ఉన్నవాళ్లతో ఆడించకుండా నేను వెళ్లి ఆడతానంటే.. చూసేందుకే ఎబ్బెట్టుగా ఉంటుందని ఆదిరెడ్డి అన్నాడు. తక్కువ ఉన్నంతమాత్రానా ఆడొద్దని లేదిక్కడ అని ఫైమా అంది.

ముగ్గురు సభ్యులు ఎవరో..
పోటీదారులు నిర్ణయం తీసుకోలేపోయినందున ఇనయా, శ్రీసత్య, కీర్తి పోటీపడే ముగ్గురు సభ్యులు ఎవరో చెప్పాల్సిందిగా ఆదేశించాడు బిగ్ బాస్. దీంతో రేవంత్, ఫైమా, రోహిత్ అని ఇనయా చెప్పింది. దీంతో అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు ఆదిరెడ్డి. ఇది లాస్ట్ ఛాలెంజ్ అని చెప్పలేదు. లాస్ట్ లో ఉన్నవాళ్లను ఇప్పుడు తీసేస్తే.. ఫస్ట్ లో ఉన్నవాళ్లే ఆడి.. ఫస్ట్ లో ఉన్నవాళ్లకే టికెట్ టు ఫినాలే వస్తుంది అని ఇనయా వివరణ ఇచ్చింది.

అవకాశం అని పది సార్లు అంటారేంటి..
తర్వాత ఆదిరెడ్డి వచ్చి తన వాదన వినిపించాడు. 13వ వారం వరకు కష్టపడ్డాం.. అందరికి అవకాశం రావలనే కదా అని ఇనయా అంటే.. అందరికీ ఛాన్స్ రావడానికి ఇదేం సండే ఫండే కాదు కదా. అవకాశం అవకాశం అని పది సార్లు అంటారేంటి నాకు అర్థం కాదు అని శ్రీహాన్ అరిచాడు. ఎందుకు అరుస్తున్నావ్ అని శ్రీసత్య అంటే.. నా ఇష్టం అరుస్తా అని శ్రీహాన్ బదులిచ్చాడు. లాస్ట్ లో ఉన్నవాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలిచిస్తారా.. ఆడినవాళ్లేమైనా పిచ్చోళ్లా అని మరింత గట్టిగా అరిచాడు శ్రీహాన్.

లాస్ట్ లో ఉన్నవాళ్లకు ఛాన్స్ రావాలని..
లాస్ట్ 2లో ఉన్నవాళ్లు ఆడకపోతే నేక్స్ట్ ఛాలెంజ్ కూడా వేస్ట్ కదా అని ఇనయా అంది. లాస్ట్ లో ఉన్నవాళ్లకు ఛాన్స్ రావాలని బిగ్ బాస్ ఏమైనా రాశారా అని రేవంత్ అన్నాడు. బిగ్ బాస్ ఏం రాయలేదు కానీ, మేం ఆలోచించామని ఇనయా అంటే.. వరెస్ట్ డెసిషియన్ ఆఫ్ ది సీజన్ అని ఆదిరెడ్డి అన్నాడు. ఇంతలో నేను వాళ్ల పొజిషన్ లో ఉండి ఆలోచించి నా నిర్ణయం తీసుకున్నాను.. నేను సొంతంగా విత్ డ్రా అవుతున్నానని రోహిత్ చెప్పాడు.

మీ థింకింగ్ ఏంటి అని..
గేమ్ ఆడనని చెప్పి వెళ్లిపోతున్నావా ఇంకా అని రోహిత్ ను ఇనయా అంటే.. గేమ్ ఆడాలి.. కానీ ఫెయిర్ గా కూడా ఉండాలి. గేమ్ ఆడితే నాకే నచ్చదు. ఎందుకంటే పాయింట్స్ ఎక్కువ ఉన్నవాళ్లకు అన్ ఫెయిర్ అయిపోతుంది క్లియర్ గా అని రోహిత్ అన్నాడు. దీనికి ఫస్ట్ లో ఉన్నవాళ్లను ఉంచి లాస్ట్ లో ఉన్నవాళ్లను తొలగించొచ్చు కదా బిగ్ బాస్ మళ్లీ ఎందుకు ఏకాభిప్రాయమన్నారు అని ఇనయా అంటే.. ఏకాభిప్రాయం అంటే మీ థింకింగ్ ఏంటి అని, అవకాశం ఇవ్వడం గురించి కాదు అని రోహిత్ గట్టిగానే చెప్పాడు.