Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6 డ్యాన్స్ షోలకు అతిథిగా ఆదిరెడ్డి.. నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఎంటర్టైన్ మెంట్ కి అడ్డా ఫిక్స్ అంటూ సెప్టెంబర్ 4న ప్రారంభమైంది బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్. ప్రస్తుతం ఈ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. మరికొన్ని రోజుల్లో విజేతను ప్రకటించనున్నారు. ఇప్పటివరకు టైటిల్ విన్నర్ రేసులో రేవంత్ కొనసాగాడు.
అయితే విన్నర్ ను ప్రకటించే సమయంలోపు విజేత మారే అవకాశాలున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే శని, ఆది వారాల్లో హోస్ట్ నాగార్జున వచ్చి ఇంటి సభ్యులను ఎంటర్టైన్ మెంట్ చేయడమే కాకుండా ఆ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ను ప్రకటిస్తారనే విషయం తెలిసిందే.

ఇంటి సభ్యులతో ఫన్ గేమ్స్..
ఎన్నో అనుమానాలు, అంచానాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ అనూహ్య పరిణామాలతో ముందుకు సాగుతోంది. చివరి దశకు చేరుకున్న ఈ సీజన్ 14వ వారమంతా కోల్పోయిన బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీని తిరిగి సంపాందించుకోవడాని ఛాలేంజ్ లో గట్టిగా పోటీ పడ్డారు ఇంటి సభ్యులు. ఇక ఈ వారం ఇంటి సభ్యులతో ఫన్ గేమ్స్ ఆడించేందుకు మరోసారి రేడీ అయ్యారు హోస్ట్ నాగార్జున.

స్టెప్పు వేసి సాంగ్ గెస్..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ డిసెంబర్ 11 ఆదివారం నాటి 98వ రోజు ఎపిసోడ్ రెండో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ప్రోమోలో మీ అందరికీ నచ్చే ఆట ఇప్పుడు.. స్టెప్పు వేయు.. గెస్ చేయు అని నాగార్జున తెలిపారు. అంటే ఒక కంటెస్టెంట్ చిటీలో ఉన్న పాట హుక్ స్టెప్పు వేస్తే అతని టీమ్ సభ్యులు ఆ సాంగ్ ఏంటో గెస్ చేసి చెప్పాలి. శ్రీహాన్ వచ్చి స్టెప్పు వేసి చూపించాడు. అతని టీమ్ మేట్స్ అది ఏ పాటో చెప్పలేకపోయారు.

నేను ఒక డ్యాన్సర్ ని సార్..
శ్రీహాన్ టీమ్ మేట్స్ గెస్ చేయకపోవడంతో.. సార్ మేము చెప్పగలం అని ఆదిరెడ్డి అన్నాడు. దీంతో మీరు చెప్పండి అని నాగార్జున అన్నాడు. వెంటనే.. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటి అని గెస్ చేశాడు రేవంత్. దీనికి ఫెంటాస్టిక్ రేవంత్ అని నాగార్జున అన్నారు. తర్వాత ఈ పాటను ప్లే చేస్తే ఆదిరెడ్డి, రేవంత్, ఇనయా సుల్తానా స్టెప్పులు వేశారు. ఆది.. నువ్ రిథమ్ భలే క్యాచ్ చేస్తావ్ అని నాగార్జున అంటే.. యాక్చువల్లీ ఐయామ్ ఏ డ్యాన్సర్ సార్ అని కామెడీ చేశాడు ఆదిరెడ్డి.

వాటికి నువ్వే గెస్టు వి..
తర్వాత సార్ వస్తారే అనే సాంగ్ ను స్టెప్ వేసి చూపించాడు ఆదిరెడ్డి. దాన్ని పర్ఫెక్ట్ గా గెస్ చేసి చెప్పాడు రేవంత్. దీంతో ఆదిరెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్లడం నవ్వు తెప్పించేలా ఉంది. ఈ పాటకు ఇనయా, ఆదిరెడ్డి, రేవంత్ కలిసి స్టెప్పులు వేశారు. తన డ్యాన్స్ తో ఆదిరెడ్డి ఆకట్టుకున్నాడు. దీంతో ఆదిరెడ్డి గుర్తు పెట్టుకో.. డ్యాన్స్ షోలు, డ్యాన్స్ ఈవెంట్స్ జరుగుతాయి. వాటికి నువ్ గెస్ట్ అవుతావ్ అని నాగార్జున అన్నారు.

చివరిగా మిగిలిన ఆదిరెడ్డి, ఇనయా..
అనంతరం శ్రీ సత్య వచ్చి పిల్లా నువ్వు లేని జీవితం హుట్ స్టెప్ వేసింది. తన టీమ్ మేట్స్ అది గెస్ చేయలేకపోయారు. ఆదిరెడ్డి కనిపెట్టాడని రేవంత్ చెప్పడంతో.. అతను ఒక డ్యాన్సర్ నీకు తెలుసా అని ఆదిరెడ్డి డైలాగ్ ను నాగార్జున రిపీట్ చేశారు. ఈ పాటకు ఇంటి సభ్యులందరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఇక చివరిగా ఆదిరెడ్డి, ఇనయా నామినేషన్ లో మిగిలారు. ఎలిమినేషన్ టైమ్ వచ్చిందని నాగార్జున తెలిపారు.
అన్ ఫెయిర్ ఎలిమినేషన్..
స్టేజీపై వైట్ బోర్డ్ ఉంచారు. ఒక రోలర్ తీసుకుని వైట్ బోర్డ్ పై పెయింట్ లా వేస్తే ఎలిమినేట్ అయిన వారు ఎవరనేది తెలుస్తుందని నాగార్జున తెలిపారు. దీంతో ఆదిరెడ్డి, ఇనయా సుల్తానా ఇద్దరూ టెన్షన్ పడుతూ కనిపించారు. దీంతో ప్రోమో ముగిసింది. ఇదిలా ఉంటే ఈ 14వ వారం లేడీ టైగర్ ఇనయా సుల్తానా ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇనయాది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.