Don't Miss!
- News
జగన్ మీద కోపంతో చెబుతున్నారేమో అనుకున్నా?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Lifestyle
షుగర్ పేషంట్స్ ఉదయాన్నే ఈ ఆహారాలను తినకూడదు.. తింటే షుగర్ లెవల్స్ పెరిగి, ప్రాణాలకే ప్రమాదం...
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6: ప్రైజ్ మనీతో పాటు విన్నర్ కు మరో అదిరిపోయే గిఫ్ట్.. అలా గేమ్ ఆడించిన నాగ్!
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ పై ఈసారి ప్రశంసల కంటే విమర్శలు ఎక్కువగా వచ్చాయి. అసలు కంటెస్టెంట్స్ విషయంలోనే జనాలు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. దీంతో మధ్యలో కొంత రేటింగ్స్ అయితే దారుణంగా పడిపోయాయి. ఇప్పటికి కూడా కొంత రేటింగ్ తగ్గుతున్నప్పటికీ అప్పుడప్పుడు సరికొత్త టాస్కులతో అయితే బిగ్ బాస్ ఏదో ఒక రకంగా మళ్ళీ లేపే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే చివరి దశలోకి వచ్చేవరకు మాత్రం బిగ్ బాస్ గేమ్ ఉత్కంఠంగా మారుతుంది. ఇక ఈ సీజన్లో బిగ్ బాస్ ప్రైజ్ మనీ తో పాటు మరో అదిరిపోయే గిఫ్ట్ కూడా సెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

అతనే విన్నరా?
బిగ్ బాస్ ప్రతి సీజన్ లో కూడా విన్నర్ ఎవరు అనే విషయంలో ముందుగానే జనాల్లో ఒక క్లారిటీ వస్తూ ఉండడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈసారి ఎవరు విన్నర్ గా నిలుస్తారు అనే విషయంలో కూడా అందరి ఫోకస్ రేవంత్ పైనే ఉంది. మిగతా వాళ్ళు కొంతమంది పోటీగా ఉన్నప్పటికీ కూడా రేవంత్ టైటిల్ విన్నర్ అని చాలా గట్టిగా చెబుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న సర్వేలలో కూడా రేవంత్ బిగ్ బాస్ విన్నర్ అని తేలింది.

వాళ్ళు డేంజర్ జోన్ లోనే..
బిగ్ బాస్ 6వ సీజన్ 14 వారాలు పూర్తి చేసుకోవడంతో ఇప్పుడు కేవలం మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ మిగిలిన రోజుల్లో ఎవరెవరు ఫైనల్స్ లోకి వెళతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా టాప్ 5 అనేది ఇప్పుడు అందరి టార్గెట్. ఇనయా సుల్తానా అయితే వెళ్లిపోయింది ఇక తదుపరి వారంలో కీర్తితో పాటు శ్రీ సత్య రోహిత్ వీరు కొంత డేంజర్ జోన్ లో ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అమ్మాయిలు గెలుస్తారా?
ప్రస్తుతం ఉన్న వారిలో ఇనయా వెళ్లిపోవడంతో ఇంకా అమ్మాయిలలో శ్రీ సత్య కీర్తి మాత్రమే ఉన్నారు. అయితే ఈ సీజన్లో అయినా అమ్మాయిలు గెలవాలి అని ఓవర్గం వారు బాగానే కోరుకుంటున్నారు. ఇక పోటీగా రేవంత్ శ్రీహన్ చాలా బలంగా ఉన్నారు. ఇక వీరితో పాటు ఆదిరెడ్డి కూడా టాప్ 5 లో నిలిచే ఛాన్స్ అయితే లేకపోలేదు.

చివరలో డ్రామా
ఇక మొత్తానికి ప్రైజ్ మనీ అయితే 50 లక్షల కు చేరింది. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ప్రైజ్ మనీ గెస్సింగ్ విషయంలో ఆడిన ఒక డ్రామా అయితే స్క్రిప్ట్ తరహాలో అనిపించింది. ప్రైజ్ మనీని 47 లక్షలకు లాక్కొచ్చిన కంటెస్టెంట్స్ ఇప్పుడు మరో 3 లక్షలు యాడ్ చేస్తే 50 లక్షలు అవుతుంది అన్నప్పుడు నాగార్జున ఒక గేమ్ పెట్టాడు.
రెండు సూట్ కేసులను పట్టుకుని ఒకదాంట్లో మూడు లక్షలు ఉన్నాయని.. కంటెస్టెంట్స్ ఏది కరెక్ట్ గా గెస్ట్ చేస్తే అది అందులో యాడ్ అవుతుంది అని అన్నారు. ఇక ఎడమవైపు ఉన్నదని కంటెస్టెంట్స్ అందరూ కరెక్ట్ గెస్ చేశారు. దీంతో మొత్తంగా ఇప్పుడు 50 లక్షల ప్రైజ్ మనీ సెట్ అయింది.

ప్రైజ్ మనీతో పాటు
50 లక్షల ప్రైజ్ మనీ ఎవరు గెలుచుకుంటారు అనే విషయంలో బిగ్ బాస్ మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. విన్నర్ అయితే దాదాపు ఫైనల్ అయ్యాడు అని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఆ విషయంలో బిగ్ బాస్ ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడు అనేది కూడా చూడాలి. ఇక ఈసారి బిగ్ బాస్ 25 లక్షలు విలువచేసే సువర్ణభూమి ప్లాట్ కూడా విన్నర్ కు అందజేయనున్నాడు.

మరో ఖరీదైన గిఫ్ట్
మొత్తం కంటెస్టెంట్స్ ఇప్పటివరకు అయితే 75 లక్షల విలువచేసే జాక్ పాట్ అయితే అందుకోబోతున్నారు. అయితే శనివారం ఎపిసోడ్లో మరొక అదిరిపోయే గిఫ్ట్ కూడా రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన వారికి ఈసారి మారుతి సుజూకీ బ్రీజా కారు కూడా ఇవ్వబోతున్నట్టు స్టేజ్ పై ప్రకటించారు. మరి ఆ ఖరీదైన కారును ఎవరు గెలుచుకుంటారో చూడాలి.