Bigg Boss Telugu 6th Week Voting: ఓటింగ్‌లో సుమన్ vs తనూజ .. డేంజర్ జోన్‌లో ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్?
బిగ్‌బాస్ తెలుగు 9 హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికి 5 వారాలు పూర్తి చేసుకున్న ఈ మెగా షో ప్రస్తుతం ఆరో వారంలోకి ప్రవేశించింది. షో మొదలైన నాటి నుంచి నేటి వరకు తొలి వారం శ్రష్టి వర్మ, రెండో వారంలో మర్యాద మనీష్, మూడో వారంలో ప్రియా శెట్టి, నాలుగో వారంలో హరిత హరీష్, ఐదో వారంలో దమ్ము శ్రీజ - ఫ్లోరా షైనీలు ఎలిమినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆరో వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు? అనేది ఉత్కంఠగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..
వైల్డ్ కార్డ్‌తో ఆరుగురు
బిగ్‌బాస్ తెలుగు 9లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. గత ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరుతో ఆరుగురు కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. వారు.. ఆయేషా జీనత్, దివ్వెల మాధురి, రమ్య మోక్ష కంచర్ల, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా.. దీంతో హౌస్‌లో కంటెస్టెంట్స్ సంఖ్య 16కి చేరుకుంది. 6వ వారం నామినేషన్స్ హోరాహోరీగా జరుగుతాయని విశ్లేషకులు భావించారు. దానికి తగ్గట్లుగానే నామినేషన్స్ జరిగాయి. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారు కూడా తొలిరోజే సత్తా చాటడంతో షో ఉత్కంఠగా సాగుతోంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులకు నామినేషన్స్ నుంచి రిలీఫ్
సోమవారం కావడంతో నామినేషన్స్‌కి శ్రీకారం చుట్టాడు బిగ్‌బాస్. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్లకి ఈ వారం నామినేషన్స్ ఉండవని చెప్పాడు. అయితే నామినేషన్స్ చేసే పవర్ మాత్రం వాళ్లకే ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందుకోసం బాల్ ఆన్ ఫైర్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీని ప్రకారం.. పై నుంచి వచ్చిన బాల్‌ను ఎవరో ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ పట్టుకుని పాత ఇంటి సభ్యుల్లో ఒకరికి ఇవ్వాలి.. బాల్ అందుకున్న కంటెస్టెంట్స్...పాత ఇంటి సభ్యుల్లో ఇద్దరిని కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది. వీరిలో ఒకరి నామినేట్ చేయడం, మరొకరిని సేవ్ చేసే అధికారం కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌కు ఇచ్చాడు బిగ్‌బాస్.
6వ వారం నామినేషన్స్‌లో ఆరుగురు
తొలుత నిఖిల్ నాయర్... తనూజ గౌడకి బాల్ ఇవ్వగా.. ఆమె సుమన్ శెట్టి, రాము రాథోడ్‌లను నామినేట్ చేసింది. ఆ తర్వాత రమ్య మోక్ష బాల్ అందుకుని దానిని రాముకు ఇచ్చింది. దాంతో అతను డిమోన్ పవన్ , రీతూ చౌదరిలను నామినేట్ చేశాడు. గౌరవ్ గుప్తా బాల్‌ను సంజనకు ఇవ్వగా.. ఆమె భరణి, రాములను నామినేట్ చేసింది. మరోసారి బాల్ అందుకున్న గౌరవ్ గుప్తా దానిని సుమన్ శెట్టికి ఇవ్వగా.. తనూజ, సంజనలను సుమన్ నామినేట్ చేశాడు. దివ్వెల మాధురి బాల్ అందుకుని రీతూ చౌదరికి ఇవ్వగా ఆమె రాము, దివ్య నిఖితాలను నామినేట్ చేసింది. వీరిలో కొందరిని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ .. సేవ్ చేయడంతో మొత్తంగా 6వ వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్‌లో నిలిచారు. వారు డిమాన్ పవన్, తనూజ గౌడ, సుమన్ శెట్టి, దివ్య నిఖిత, భరణి, రాము రాథోడ్.
దుమ్మురేపుతోన్న సుమన్ శెట్టి
సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్‌ను పరిశీలిస్తే... ఎప్పుడు నామినేషన్స్‌లో ఉన్నా సుమన్ శెట్టి టాప్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ వారం కూడా 21.82 శాతం ఓటింగ్‌తో నెంబర్‌వన్‌గా నిలిచాడు. అతనికి తనూజ పుట్టస్వామి గట్టి పోటీ ఇస్తున్నారు. ఆమె 20.82 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత డిమోన్ పవన్ 18.96 శాతం, భరణి శంకర్ 15.52 శాతం, రాము రాథోడ్ 11.5 శాతం, దివ్య నిఖిత 11.38 శాతం ఓటింగ్‌తో నిలిచారు. వీరిలో ప్రస్తుతానికి రాము రాథోడ్, దివ్య నిఖితలు డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే ఓటింగ్ ముగిసే సమయానికి ర్యాంకింగ్స్ మారిపోయే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











