ఒక్క రాత్రికి నా రేట్ అంత అని .. ఆ ఉచ్చులో బిగ్ బాస్ బ్యూటీ
తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ద్వారా నైనికా అనసురు మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా తనదైన శైలిలో బుల్లితెర ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అంతకుముందే నైనికా అనసురు సోషల్ మీడియాలో క్రేజ్ దక్కించుకుంది. తన కొరియోగ్రఫీతో ప్రశ్నంసలు అందుకుంది. ఇక ఢీ వంటి షోల్లోనూ తన డ్యాన్స్ తో మెస్మరైజ్ చేసింది. అలాగే 2023లో వచ్చిన పిల్లా పడేసావే టీవీ సీరిస్ లో ఫీమేల్ లీడ్ లో నటించి నటిగా గుర్తింపు సంపాదించుకుంది.
ఇక 2024లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ గా ఎంపికై హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌజ్ లో ప్రతి టాస్క్ లో యాక్టివ్ గా ఉండి తన సత్తా చాటుకుంది. ఇక నైనికా ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది. తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్ గా కొనసాగుతున్న సెలబ్రెటీ టాక్ షో కిస్సిక్ టాక్స్ కు నైనికా అనసురు హాజరైంది. ఈ టాక్ షోకు ఇప్పటికే బుల్లితెర స్టార్, వెండితెర ప్రముఖ నటులు హాజరవుతూ తమ వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా నైనికా అనసురు కిస్సిక్ టాక్స్ లో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేసింది. జబర్దస్త్ వర్ష అడిగిన ప్రశ్నలకు ఆశ్చర్యకరంగా సమాధానాలు ఇచ్చింది. నైనికా అనసురు మాట్లాడుతూ.. నేను ప్రస్తుతం మానసికంగా, ఫిజికల్ గా చాలా హెల్తీగా ఉన్నాను. మైండ్ హెల్తీగా ఉంటే అందంగానూ కనిపిస్తాం. ఇక నా పెళ్లికి చాలా సమయం ఉంది. నేను కొరియోగ్రఫీతో పాటు నటిగాను రాణించాలని ఆశ పడ్డాను. కానీ కొన్ని కారణాలతో అస్సలు ఆ దారిలో వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మనం ఎదిగే కొద్దీ కింది లాగే వాళ్లు ఎందరో ఉంటారు.
ముఖ్యంగా నేను నా లైఫ్ లో చాలా అనుభవించాను. నా కెరీర్ ను కూడా పక్కన పెట్టి ఒక వ్యక్తి కోసం ఎంతో ఆరాట పడ్డాను. నా లైఫ్ లో కొన్ని తప్పులు ఎందుకు చేశానని చాలా సార్లు బాధపడ్డాను. బిగ్ బాస్ 8 హౌజ్ లో ఉన్నప్పుడు కూడా నాకు బిగ్గెస్ట్ హార్ట్ బ్రేక్ ఉంది. ఇక ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్లకి ఒక్కటే చెబుతున్నాను. దేవుడు చూస్తున్నాడు. కర్మ తప్పకుండా తిరిగి వస్తుంది. నన్ను మోసం చేసిన వాళ్లు ఒక్కరు కూడా ప్రస్తుతం హ్యాపీగా లేరు. అదే వారికి శిక్ష అనుకోవచ్చు.
ఇక నేను ఒక సమయంలో సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. ఒక విషయంలో నా మాట ఎవ్వరూ వినడం లేదు, నమ్మలేదు అని ఫిక్స్ అయిన సందర్భం అది. మరోవైపు నేను కాస్టింగ్ కౌజ్ ను కూడా ఎదుర్కున్నాను. ఒకరు నాపై ఉన్న గౌరవంతో ఫోన్ చేసి మీ ఫొటోలు ఇలా వెతున్నాయండి, రేట్ తో పాటు అని చెప్పారు. అలాంటి వాళ్లు చిన్న పిల్లల నుంచి ముసలివాళ్లలనే కాకుండా కుక్కలని కూడా వదలరు. ఇక మా డాడీ మాతో ఉండరు. నాకు చిన్నప్పటి నుంచి అమ్మే అన్నీ చూసుకున్నారు. ఆయనతో పడలేక అమ్మ సెపరేట్ గా ఉంటోంది.


Click it and Unblock the Notifications











