Bigg Boss 8th Week Elimination: బిగ్‌బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. ఫైర్‌బ్రాండ్‌ అవుట్.. ఆమెకు అన్యాయం చేశారా?

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో మరోసారి షాకింగ్ ఎలిమినేషన్ జరిగిందనే విషయం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇంటిలోకి వైల్డ్ కార్డుగా వచ్చిన దివ్వెల మాధురి అనూహ్యంగా ఇంటి నుంచి బయటకు వెళలిపోయారనే వార్త ఆమె అభిమానులకు షాక్ కలిగించింది. అయితే ఓటింగ్‌లో కొంత మెరుగైన నంబర్లను సాధించినప్పటికీ.. ఆమెను ఎలిమినేట్ చేయడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దివ్వెల మాధురి ఎలిమినేషన్ వివరాల్లోకి వెళితే..

అత్యంత ఆసక్తకరంగా సాగుతున్న బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో 5వ వారం 2.0 ఎపిసోడ్‌ను డిజైన్ చేశారు. ఈ సందర్భంగా సుమారుగా ఐదుగురు సెలబ్రిటీలను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇంటిలోకి ప్రవేశపెట్టారు. అలా వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చిన వారిలో కంట్రవర్షియల్ పొలిటిషియన్, బిజినెస్ ఉమెన్ దివ్వెల మాధురి ఇంటిలోకి అడుగుపెట్టారు. అయితే తన స్వభావానికి అనుగుణంగానే తన ఫైర్ బ్రాండ్ ప్రవర్తనతో ఇంటిలో గందరగోళం సృష్టించారు

Divvela Madhuri eliminated from Bigg Boss Telugu 9

గత మూడు వారాలుగా దివ్వెల మాధురి తన మార్కు ఆటతో కొనసాగారు. అయితే ఎనిమిది వారంలో జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఇంటిలో ఉండటానికి అర్హత లేని వారిలో దివ్వెల మాధురి ఒకరిగా మారారు. దాంతో ఆమె నామినేట్ అయి ఎలిమినేషన్ ముప్పులోకి వచ్చారు. ఈ వారం నామినేషన్లలో సంజనా గల్రానీ, మాధురి దువ్వాడ, తనుజా గౌడ, రీతూ చౌదరీ, రాము యాదవ్, డీమాన్ పవన్, గౌరవ్, కల్యాణ్ పడాల నామినేట్ అయ్యారు.

అయితే సోషల్ మీడియాలో వెల్లడైన అనధికార ఓటింగ్ వివరాల్లోకి వెళితే.. పోలైన ఓట్లలో అత్యధికంగా తనుజా పుట్టస్వామికి వచ్చాయి. ఆమెకు 32 శాతం ఓట్లు నమోదు అయ్యాయి. ఆ తర్వాత కల్యాణ్ పడాల 18 శాతం రాము రాథోడ్ 9 శాతం ఓట్లు వచ్చాయి. ఇక సంజనా గల్రానీ 8.58 శాతం, మాధూరి దువ్వాడ 8.29 శాతం, డీమాన్ పవన్ 8.29 శాతం, రీతూ చౌదరీ 8.28 ఓట్లు, గౌరవ్ గుప్తా 8.28 శాతం ఓట్లు రావడంతో ఎలిమినేషన్ నుంచి ఎవరు అవుట్ అవుతారనే అనే టెన్షన్ క్రియేట్ అయింది.

అయితే అనూహ్యంగా 8వ వారంలో దివ్వెల మాధురి ఎలిమినేట్ అయినట్టు వార్త బయటకు వచ్చింది. అయితే అనధికారికంగా అయినప్పటికీ.. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లడం జరిగింది అనే టాక్ స్ప్రెడ్ అయింది. అయితే అతి తక్కువ ఓట్లు వచ్చిన గౌరవ్‌ గుప్తాను కాకుండా మాధురిని ఎలిమినేట్ చేయడం ఏమిటి? అనే విషయాన్ని ఆమె అభిమానులు ప్రస్తావిస్తున్నారు. అయితే కాల్ ఓటింగ్‌లో గౌరవ్‌కు అధికంగా వచ్చాయా? అందుకే ఆమెను ఎలిమినేట్ చేశారా? అనే విషయంపై చర్చ జరుగుతున్నది.

ప్రస్తుతం సీజన్‌లో ఇప్పటి వరకు 8 వారాల్లో మొత్తం 9 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్‌లో శ్రష్టి వర్మ, ఆ తర్వాత మర్యాద రామన్న, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీష్, 5వ వారం ఆశా సైనీ, శ్రీజ దమ్ము, 6వ వారం భరణి శంకర్, 7వ వారం రమ్య పికిల్ ఎలిమినేట్ అయ్యారు. ఇక 8వ వారంలో దివ్వెల మాధురి ఎలిమినేట్ అయినట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X