Asha Saini: బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన లక్స్‌పాప.. 12 ఏళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ తెలుగు 9 అట్టహాసంగా ప్రారంభమైంది. 9వ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా ఎవరు అడుగు పెట్టబోతున్నారా? అన్న ఉత్కంఠకు తెరదించుతూ ఒక్కొక్కరుగా సెలబ్రెటీలు హౌస్‌లో అడుగుపెడుతున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ ఆశా షైనీ కలర్‌‌ఫుల్ డ్రెస్‌లో హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆశా షైనీ సినిమాలు, బయోగ్రఫి ఒకసారి పరిశీలిస్తే..

ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి చాలా మంది నటీనటులు అడుగుపెట్టి స్టార్‌డమ్ సంపాదించారు. ఈ కోవలోకే వస్తారు ఆశా షైనీ. పంజాబ్‌లోని చండీగఢ్‌లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ తండ్రి ఇండియన్ ఆర్మీలో కీలక హోదాలో పనిచేశారు. ఆమె అసలు పేరు ఫ్లోరా షైనీ. తండ్రి ఉద్యోగరీత్యా ఆశా షైనీ.. ఉదంపూర్, జమ్మూకాశ్మీర్, ఢిల్లీలలో చదువుకున్నారు. ఆ తర్వాత వీరి కుటుంబం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు మకాం మార్చింది. అక్కడే ఆశా షైనీ మోడలింగ్ దిశగా అడుగులు వేసి.. తన అందంతో టాప్ మోడల్‌గా వెలుగొందింది. మిస్ కోల్‌కతా బ్యూటీ కాంటెస్ట్‌లో మెరుపులు మెరిపించింది.

Bigg Boss Telugu 9 Asha Saini Entered as contestant her Profile and personal Details

లక్స్ పాప సాంగ్‌తో స్టార్‌డమ్
ఈ దశలో సినిమాలపై ఫోకస్ పెట్టిన ఆశా షైనీ దీనికి తగిన ప్రయత్నాలు చేశారు. 1999లో తెలుగు చిత్రం ప్రేమ కోసం ద్వారా చిత్ర సీమలో అడుగుపెట్టారు. అయితే ఓ జ్యోతిష్యుడి సూచన మేరకు తన పేరును మయూరిగా మార్చుకున్నారు ఆశా షైనీ. అయితే హీరోయిన్‌గా మాత్రం ఆమెకు అంతగా అవకాశాలు రాకపోవడంతో సెకండ్ లీడ్, సపోర్టింగ్ రోల్స్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ దశలో బీ గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ నరసింహ నాయుడు ఆశాషైనీకి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రంలో లక్స్ పాప.. లక్స్ పాప పాట ఆమెకు పాపులారిటీ తీసుకొచ్చింది.

తెలుగులో బిజీ
ఈ ఒక్క పాటతో ఆశా షైనీకి అవకాశాలు క్యూకట్టాయి. చాలా బాగుంది, సర్దుకుపోదాం రండి, నవ్వుతూ బతకాలిరా, ప్రేమతో రా, నువ్వు నాకు నచ్చావ్, ఓ చిన్నదాన, 143, స్వామి, మైఖేల్ మదన కామరాజు, బ్రోకర్, చట్టం, ఆకాశంలో సగం, సహస్ర, ఆ ఇంట్లో తదితర తెలుగు సినిమాలలో నటించారు ఆశా షైనీ. అయితే 2013 తర్వాత ఆమె తిరిగి తెలుగు చిత్రాల్లో నటించలేదు. తన ఫోకస్ పూర్తిగా హిందీ ఇండస్ట్రీ మీదే పెట్టారు. 26 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, పంజాబీ, బెంగాలీ భాషల్లో ఆశా షైనీ నటించారు.

నకిలీ డాక్యుమెంట్ల కేసులో అరెస్ట్
2008లో ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్ల కేసులో ఆశా షైనీని చెన్నై పోలీసులు అరెస్ట్ చేయడం చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన తమిళ చిత్ర పరిశ్రమ..కొన్నాళ్లు తమిళ సినిమాల్లో నటించకుండా నిషేధం విధించింది. ఈ కేసులో ఆమె నిర్దోషిగా తేలడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ నిషేధాన్ని ఎత్తివేసింది. అలాగే 2021లో దేశవ్యాప్తంగా కలకలం రేపిన బాలీవుడ్ నటుడు, నిర్మాత రాజ్ కుంద్రా పోర్నోగ్రఫి కేసులో ఆశా షైనీ పేరు తెరపైకి రావడం దుమారం రేపింది. దాంతో ఆమె స్వయంగా వీడియో రిలీజ్ చేసి.. తనకు రాజ్ కుంద్రాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. నా పేరును, నన్ను ఈ కేసులోకి లాగడం బాధగా ఉందని ఆశా ఆవేదన వ్యక్తం చేశారు.

50కి చేరువ అవుతున్నా చెక్కు చెదరని గ్లామర్‌తో వెలిగిపోతున్న ఆశా షైనీకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయితే తన వయసుకు తగ్గ పాత్రలు వస్తే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ దశలో దాదాపు 12 ఏళ్ల తర్వాత తెలుగు వారిని పలకరించేందుకు బిగ్‌బాస్‌ తెలుగు 9లో అడుగుపెట్టారు ఆశా షైనీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X