నాకు ట్రోలింగ్ అలవాటే.. నా టాటూ సీక్రెట్.. బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డేరింగ్ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ శ్రీజ దమ్ము తాజాగా ఇంటర్వ్యూకు హాజరైంది. తను మాట్లాడుతూ 'నేను వైజాగ్ లో పుట్టి పెరిగాను. అమ్మనాన్న గ్రామ పంచాయతీలో ఉద్యోగం చేస్తున్నారు. మాది జాయింట్ ఫామిలీ. ఇక రీల్స్ ద్వారా మంచి క్రేజ్ దక్కించుకున్నాను. కట్ చేస్తే ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అగ్ని పరీక్షలో కనిపించాను. నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఎక్కువగా కుటుంబ సభ్యులతోనే ఉంటాను. వైజాగ్ లోనే బీటెక్ కంప్లీట్ చేశాను. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టాను. ఇన్ఫోసిస్, అసెంచర్ వంటి ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగం చేశాను. కంప్లీట్ సాఫ్ వేర్. ఇక నాకు టాస్క్ లంటే ఇష్టం, అడ్వెంచర్స్ అంటే ఇష్టం. అందుకే బిగ్ బాస్ లోకి రావాలి అనుకున్నాను.
చాలా మంది బిగ్ బాస్ కు హీరోయిన్ అయిపోవాలని వస్తుంటారు. కానీ నాకు అలాంటి కోరిక లేదు. కానీ బిగ్ బాస్ ద్వారా ఫేమ్ వస్తుందని మాత్రం ఆశిస్తున్నాను. ఇక బిగ్ బాస్ లోకి నా మాటలకు అందరూ షాక్ అయ్యారు. శ్రీముఖిపై నేను వేసిన కౌంటర్, అభిజీత్ తో మాట్లాడిన తీరు బాగా వైరల్ అయ్యింది. దాంతో ట్రోల్స్ కూడా నడిచాయి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారురా? స్పీకర్ మింగేసిందా? డబ్బా రేకు అంటూ చాలా ట్రోల్స్ వచ్చాయి. కానీ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. నాకు ట్రోల్స్ చిన్నప్పటి నుంచి అలవాటే. అలాగే నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటాను. అందుకే నాకు ఇలా త్వరత్వరగా మాట్లాడే తత్వం వచ్చింది.

ట్రోల్స్ గురించి ఆలోచించి, నా వాయిస్ ను నేను మార్చుకోలేను కదా. ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్స్ కూడా వ్యతిరేకంగా వచ్చేవి. కానీ కొద్దిరోజుల తర్వాత నేను కామెంట్స్ ను పట్టించుకోవడం మానేశాను. ఇక బిగ్ బాస్ షో అగ్నిపరీక్షను మొత్తం నడిపిస్తున్నారు. అయితే నన్ను స్టేజ్ మీదకు పిలచినప్పుడు ఊరికనే ఊర్లోకి వచ్చేస్తారని అనడం షాక్ అనిపించింది. ఆయన సీరియస్ గానే అన్నారు. కానీ నేను ఫన్ గానే తీసుకున్నాను. ఇక ఆ విషయాన్ని నవదీప్ కూడా మర్చిపోయారు. ఇక టాస్క్ మాత్రం అన్ ఫెయిర్ జరిగిందని అనిపించింది.
ఇక నాకు టాటూలంటే చాలా ఇష్టం. అందుకే టాటూ వేయించుకున్నాను. నా చేతిపై ఉన్న టాటూ ఐ లవ్ బిగ్ బాస్ అని ఉంటుంది. టాస్క్ ల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాను. మున్ముందు ఎలా ఆడాననేది మీరే చూస్తారు. కాకపోతే నా వాయిస్ వల్లనే నేను గొడవ పడుతున్నానని అందరూ అనుకుంటారు. ఇక బిగ్ బాస్ లో నా రియాలిటీని చూపిస్తాను.
బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత కూడా ఇలానే ఉంటాను. నాకు హీరోయిన్లలో సమంత రూతు ప్రభు అంటే చాలా ఇష్టం. చివరిగా నాకు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో శ్రీముఖి, అభిజీత్ చాలా ఎంకరేజ్ చేశారు. ఇక బింధు మాధవి నుంచి ఆడపులి అనే టైటిల్ ను తీసేసుకుంటా అనే ఇప్పటికే ప్రామీస్ చేశాను.' అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











