ఇదేం ట్విస్ట్‌రా బాబూ.. హౌస్‌లోకి శ్రీజతో పాటు అతడి రీ ఎంట్రీ.. ఇక రచ్చ రచ్చే!

Bigg Boss Telugu 9: 'ఎక్స్‌పెక్ట్ ది అన్‌ఎక్స్‌పెక్టెడ్' అన్నట్టుగా సాగుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు మరో ఆసక్తికర మలుపు తీసుకోబోతుంది. ఇప్పటికే డ్రామా, గొడవలు, రొమాన్స్, ఎమోషన్స్ మేళవించిన ఈ రియాలిటీ షోలో, ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్‌లతో హీట్ పెంచేస్తున్నాడు బిగ్ బాస్. తాజాగా షోలో కొత్త మలుపు తెచ్చేందుకు ఎలిమినేట్ అయిన ఇద్దరు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి రాకతో షో మరింత రసవత్తరంగా మారనుంది. ఇంతకీ ఆ కంటెస్టెంట్స్ ఎవరు?

ఇటీవల ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ శ్రీజ, భరణి, ప్రియా, మనీష్, శ్రేష్ఠి వర్మ, ఫ్లోరా సైనీ, మర్యాద ప్రియ అందరూ హౌస్‌లోకి తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. వారు కూడా ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. బిగ్ బాస్ ఈసారి వారందరికీ రెండు కత్తులు ఇచ్చి ప్రత్యేక నామినేషన్ టాస్క్ పెట్టారు. ఒక కత్తితో తమకు నచ్చని కంటెస్టెంట్‌ను నామినేట్ చేయాలి, మరో కత్తితో డైరెక్ట్ అటాక్ చేయాలి. ఈ టాస్క్‌లో శ్రీజ - మాధురిని నామినేట్ చేయడంతో హౌస్‌లో పెద్ద గొడవ మొదలైంది. శ్రీజ మాటలు, ప్రశ్నలు చూసి మాధురి ఒక్కసారి షాక్ అయిపోయింది. దీంతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Bigg Boss Telugu 9 Dammu Sreeja and Bharani Re-Enter the House Double Drama and Twists Begin Again

ఈ క్రమంలో హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్లు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రకటించడంతో కంటెస్టెంట్స్ లో మరింత టెన్షన్ మొదలైంది. గత వారం హౌస్‌లో యాక్టివ్‌గా ఉన్న అయేషా టైఫాయిడ్, డెంగ్యూ కారణంగా హౌస్‌ నుంచి బయటకు వెళ్లడం, మరోవైపు తక్కువ ఓట్లు రావడంతో రమ్య మోక్ష ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయింది. ఈ లోటును భర్తీ చేసేందుకు మాజీ కంటెస్టెంట్లను రీఎంట్రీ ఇవ్వాలని ఫ్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో దమ్ము శ్రీజ, భరణి రీఎంట్రీని ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇక హౌస్‌లో రమ్య, ఆయేషా ఎలిమినేట్ అయ్యాక మొత్తం 10 మంది ఉన్నారు. ఇప్పుడు శ్రీజ, భరణి రాకతో హౌస్ మళ్లీ 12 మందితో ఫుల్ కాబోతుంది.

ఇలా మాజీలు రీఎంట్రీ ఇవ్వబోతున్నారంటే.. షో కొత్త ఫేజ్‌లోకి అడుగుపెట్టినట్టే. ముఖ్యంగా దమ్ము శ్రీజ రీఎంట్రీ కోసం ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు. తన మాటల తూటాలతో బిగ్ బాస్ హౌస్ ను షేక్ చేసింది. షోలోని ప్రతి కంటెస్టెంట్ కు చుక్కలు చూపించండి. ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టు విరుచుకపడింది. ముఖ్యంగా సెలబ్రిటీ కంటెస్టెంట్లకు కంటిమీద కునుకు లేకుండా చేసిందడంలో ఎలాంటి అతిశక్తి లేదు. అయితే అప్పట్లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు రావడంతో శ్రీజాను ఎలిమినేట్ చేసి బయటకు పంపించారు.

ఆమె ఎలిమినేషన్‌ను చాలా మంది ప్రేక్షకులు అన్‌ఫెయిర్ గా ఫీలయ్యారు. అయితే.. శ్రీజ రీ ఎంట్రీ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. "శ్రీజ మళ్లీ వస్తే హౌస్‌లో ఎనర్జీ తిరిగి వస్తుంది" అనే కామెంట్స్ తో అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నా.. ఆమె మరింత స్ట్రాంగ్‌గా, స్ట్రాటజీతో ఆటలో పాల్గొంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సారి శ్రీజ ఎవరిని సపోర్ట్ చేస్తుంది? ఎవరిపై దాడి చేస్తుంది? అనే ప్రశ్నలతో ప్రేక్షకులు ఉత్కంఠగా ఉన్నారు. శ్రీజ రాకతో మాధురి, కళ్యాణ్, తనూజ ల మధ్య గట్టి రచ్చ జరగడం ఖాయమనీ, ఒకవైపు కామనర్స్ - మరోవైపు సెలబ్రిటీలు అంటూ హౌస్‌ రెండు గ్రూపులుగా విడిపోతుందనేది హాట్ టాక్.

ఇక బిగ్ బాస్ ఫాదర్ భరణి శంకర్ కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. గతంలో భరణీ హౌస్‌లో బంధాలు, ఎమోషనల్ లో ఇరుక్కపోయారు. ఆ కారణంగా ఎలిమినేట్ అయ్యాడు. కానీ ఈసారి భరణీ స్ట్రాంగ్‌గా ఫీల్డులోకి దిగుతాడని అంటున్నారు. తన నిజమైన గేమ్ ఆడేందుకు హౌస్ లో అడుగుపెట్టబోతున్నారట. భరణి రీఎంట్రీతో తనూజ, దివ్య నిఖిత, రామ్ రాథోడ్ లల్లో కొత్త ఉత్సాహం తిరిగి రాబోతున్నందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ఇద్దరి రాకతో హౌస్‌లో హౌస్ హీటెక్కే అవకాశం ఉంది. ప్రేక్షకుల మాటల్లో చెప్పాలంటే "ఇప్పుడే రియల్ గేమ్ మొదలవుతుంది!" వీరిద్దరూ హౌస్‌లో ఎవరిని సపోర్ట్ చేస్తారు, ఎవరిపై అటాక్ చేస్తారు, ఎవరి మీద బిగ్ బాస్ కొత్త ట్విస్ట్ ప్లాన్ చేశాడో వచ్చే ఎపిసోడ్‌లు చెబుతాయి.

More from Filmibeat

Read more about: bharani bigg boss telugu sreeja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X