Haritha Harish Remuneration: బిగ్‌బాస్ నుంచి హరిత హరీష్ ఎలిమినేట్.. నాలుగు వారాలకు ఎంత సంపాదించాడంటే?
హోరాహోరీగా సాగుతోన్న బిగ్‌బాస్ తెలుగు 9 మరికొద్దిగంటల్లో 5వ వారంలోకి అడుగుపెట్టనుంది. వీకెండ్ వస్తుందంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు హౌస్‌ను వీడతారన్నది తెలిసిందే. దీంతో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కానున్నారు? ఓటింగ్ ఎలా జరుగుతున్నది? ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ నాలుగు వారాలకు గాను ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు అన్నది పరిశీలిస్తే..
15 మందితో బిగ్‌బాస్ తెలుగు 9
15 మందితో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైంది. వీరిలో 9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు సామాన్యులు. కామనర్స్‌ని ఓనర్స్‌గా, సెలబ్రెటీలను టెనెంట్స్‌గా అభివర్ణిస్తున్నారు. తొలి వారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. రెండో వారం మర్యాద మనీష్, మూడో వారం ప్రియాశెట్టిలు హౌస్‌ను వీడారు. దాంతో సెలబ్రెటీలలో 8 మంది, కామనర్స్‌లో నలుగురు మిగిలారు. అయితే గత వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో ఫైనలిస్ట్‌గా నిలిచిన దివ్య నిఖిత హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. దీంతో హౌస్‌లో మొత్తం 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

4వ వారంలో నామినేషన్స్‌లో ఆరుగురు
సోమవారం హోరాహోరీగా నామినేషన్స్ జరగ్గా.. నాలుగో వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచారు. వీరిలో సంజనా గల్రానీ, ఫ్లోరా షైనీ, శ్రీజ దమ్ము, హరిత హరీష్, దివ్య నిఖిత, రితూ చౌదరిలు ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఓటింగ్‌ను బట్టి చూస్తే సంజన గల్రానీ ఏకంగా 20.82 శాతం ఓటింగ్‌తో టాప్‌లో నిలిచారు. గత వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ డ్రామా పండించడం, హౌస్‌లో తన మైండ్ గేమ్‌తో సంజనకు ఓట్లు గుద్ధిపడేశారు ప్రేక్షకులు.
ఓటింగ్‌లో సంజన టాప్
సంజన తర్వాత 17.75 శాతం ఓటింగ్‌తో ఫ్లోరా షైనీ నిలిచారు. అనంతరం 16.11 శాతం ఓటింగ్‌తో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖిత, 15.91 శాతం ఓటింగ్‌తో రీతూ చౌదరి, 15.06 శాతం ఓటింగ్‌తో దమ్ము శ్రీజ, 14.36 శాతం ఓటింగ్‌తో హరిత హరీశ్‌లు నిలిచారు. వీరిలో దమ్ము శ్రీజ, హరిత హరీశ్‌లు డేంజర్ జోన్‌లో నిలవగా.. హరిత హరీశ్ ఆదివారం ఎలిమినేట్ కానున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గురువారం వరకు దమ్ము శ్రీజ లీస్ట్ ఓటింగ్‌తో ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు.
హరిత హరీశ్ ఎలిమినేషన్
కానీ ఈ వారం గాయం కారణంగా హరిత హరీశ్ ఫిజికల్ టాస్క్‌లకు దూరంగా ఉండటం, దూకుడు కూడా తగ్గించడంతో అతని ఓటింగ్ దారుణంగా పడిపోయింది. అటు కెప్టెన్ అయ్యే ఛాన్స్‌ని తృటిలో చేజార్చుకున్న పవన్ కళ్యాన్ పడాలకి శ్రీజ అండగా నిలబడటంతో అతని ఓటింగ్ శ్రీజకు మళ్లింది. దాంతో శ్రీజ ప్లేస్‌లోకి హరిత హరీశ్ వచ్చాడు. గొడవలు, వివాదాల జోలికి కూడా పెద్దగా వెళ్లకపోవడంతో అతని అభిమానులు నిరాశ చెందారు. చివరికి బిగ్‌బాస్ తెలుగు 9లో ఫైనలిస్ట్‌గా ఉంటాడనుకున్న హరీశ్ నాలుగో వారానికే ఎలిమినేట్ కావడం గమనార్హం.
హరిత హరీశ్ రెమ్యునరేషన్ ఎంత?
ఇకపోతే.. నాలుగు వారాల పాటు హౌస్‌లో ఉన్నందుకు హరిత హరీశ్ ఎన్ని కోట్లు పారితోషికంగా అందుకున్నాడు అనేది హాట్ టాపిక్‌గా మారింది. హరిత హరీశ్‌కు రోజుకు 10 వేల రూపాయల చొప్పున వారానికి 70 వేలు రెమ్యునరేషన్‌గా చెల్లించారు. ఈ లెక్కన 28 రోజులకు 2,80,000 లక్షలను పారితోషికంగా అందుకున్నాడు హరిత హరీష్


Click it and Unblock the Notifications











