Bigg Boss Telugu 9: సంజన దెబ్బకి ఇమ్మాన్యుయేల్ చిత్తు.. బుజ్జిగాడు బేబీ రూటే వేరు!
బిగ్‌బాస్ తెలుగు 9 హోరాహోరీగా సాగుతోంది. వివాదాస్పద వ్యక్తులు, ఎంటర్‌టైన్ చేసే వాళ్లతో బిగ్‌బాస్ హౌస్ నిండిపోయింది. రెండ్రోజుల పాటు నామినేషన్ల వ్యవహారం ఇంటిలో హీట్ పెంచింది. నామినేషన్‌ల నాటి గొడవలు ఇంకా కంటెస్టెంట్స్ మధ్య ఉప్పు, నిప్పులాంటి వాతావరణాన్ని కల్పించాయి. కంటెస్టెంట్స్ అంతా బాగానే ఆడుతున్నప్పటికీ ఈ రెండ్రోజుల్లో సంజన గల్రానీ తన ఉగ్రరూపం చూపించారు. ఈ నేపథ్యంలో ఈ కన్నడ నటిని ఉద్దేశించి ఇమ్మాన్యుయేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నామినేషన్స్‌లో 9 మంది
బిగ్‌బాస్ తెలుగు 9లో సంజనా గల్రానీ, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, శ్రష్టీ వర్మ, ఇమ్మాన్యుయేల్, తనూజ, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డిమోన్ పవన్‌లు తొలి వారం నామినేషన్స్‌లో నిలిచారు. కామనర్స్‌కి నామినేట్ చేసే అవకాశం రాగానే మూకుమ్మడిగా సంజన గల్రానీని సెలెక్ట్ చేశారు. హౌస్‌లో గొడవలకు కారణం అవుతోందని, అబద్ధాలు ఆడుతోందని కారణాలుగా చెప్పారు. దీంతో ఆమె రెచ్చిపోయింది. గుడ్డు గురించి పెట్టుకున్న పెంట.. హౌస్‌లో రచ్చకు దారి తీసింది.

ఈ వారం క్రెడిట్ సంజనాదే
ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారని కామనర్స్ చర్చ స్టార్ట్ చేయగా.. వారంతా సంజన పేరే చెప్పారు. ఇంతలో ఉడకబెట్టిన గుడ్డు ఒకటి పోవడంతో సంజన మీద అనుమానం వచ్చింది. దీనిపై ఆమెను ఓనర్స్ నిలదీయగా.. ఆమె నో అంటూ నవ్వుతూ చెప్పింది. ఇమ్మాన్యుయేల్ అయితే మీరే తిన్నారా అని అడగ్గా.. నేను చాలా గుడ్డు, నాకు గుడ్డెందుకు అని ఆన్సర్ ఇచ్చింది. ఈమె మాటలతో భరణి ఊగిపోయాడు. గుడ్డు దొంగిలించింది సంజనయేనని ఎలాగైనా బయటపెట్టాలని హరిత హరీష్ డిసైడ్ అయ్యాడు. మీరు తింటే తిన్నానని ఒప్పుకోండి.. మీరు తిన్న గుడ్డు నాదే దాని సంగతి నేను చూసుకుంటానని చెప్పాడు. అయినా సరే సంజన బయటపడలేదు.
భరణికి షార్ట్ టెంపర్
మీ వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని భరణి ఇక రెచ్చిపోయాడు. హరీష్ తనకి ఫేవర్‌గా ఉన్నప్పుడు నీకు ప్రాబ్లమ్ ఏంటీ అన్నాడు. నా దగ్గర ఓవర్ స్మార్ట్‌గా మాట్లాడగలనని భరణిపై ఫైర్ అయ్యాడు హరీష్. దీంతో అప్పటి వరకు కాస్త సైలెంట్‌గా ఉన్న భరణి కూడా రెచ్చిపోయాడు. తొక్కలో గుడ్డు, తొక్కలో డిస్కషన్ అంటూ హరీష్ చిరాకుతో పక్కకెళ్లిపోయాడు. హౌస్‌లో అందరూ తన్నుకు చూస్తుంటే.. సంజన తన మైండ్ గేమ్‌లో తను వెళ్లిపోతూ నవ్వుకుంటుంది. అందరూ గొడవ పడుతుండగా.. సంజన ఓ కుర్చీలో కూర్చొని సినిమా చూస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మీరు ఓనరైతే
ఈ గొడవ మొత్తం ముగిసిన తర్వాత భరణి, ఇమ్యాన్యుయేల్, సుమన్ శెట్టి, తనూజ, రాము రాథోడ్‌లు కుర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవ్వరూ ఇంత కమ్ బ్యాక్ నాకు తెలిసి ఎవ్వరూ ఇవ్వరని ఇమ్మాన్యుయేల్ చెప్పాడు. ఆ వెంటనే సంజన గారు నాకు అర్ధం కాక అడుగుతున్నాను.. మీరు టెనెంట్‌గానే ఇలా ఉంటే, మీరు ఓనర్ అయితే ఎలా ఉంటుందో చూడాలని ఉందని అన్నాడు. నేను అవన్నీ చేయనని, అన్నయ్య, తమ్ముడిలా చూసుకుంటానని సంజన ఆన్సర్ ఇచ్చింది సంజన. మీరు బంగారం మేడం, మైండ్ పనిచేయాలి కదా.. రిలాక్స్ అవ్వండి అంటూ ఇమ్మాన్యుయేల్ పంచ్‌లు విసిరాడు. నేను నిన్ను ఏం చేయలేదు రా సంజన ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











