బిగ్‌బాస్‌లో దివ్వెల మాధురి రూలింగ్.. నా రూల్స్ నచ్చకపోతే హౌస్ నుంచి వెళ్లిపోండంటూ వార్నింగ్..

Madhuri Divvela's Rules: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్ల టాక్ వార్ తో హై వోల్టేజ్ డ్రామాగా మారుతోంది. ప్రతి ఎపిసోడ్‌లోనూ కొత్త ట్విస్టులు, కొత్త గొడవలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల హౌస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీస్ రావడంతో గేమ్ మరింత రసవత్తరంగా మారింది. వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో మాధురి దివ్వెల మాత్రం రెచ్చిపోతుంది. తన స్టైల్‌తో షేక్ చేస్తోంది. ఎవరినీ చూసి బెదరని మాధురి, ఒక్కొక్కరిని ఫేస్ చేస్తూ, తనదైన మాస్ డైలాగులతో ప్రత్యర్థులను సైలెంట్ చేయిస్తోంది.

తాజా ఎపిసోడ్‌లో మాధురి అన్ని కంటెస్టెంట్లను ఒకచోట కూర్చోబెట్టి "హౌస్ రూల్స్" అంటూ తనదైన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చింది. "ఇక్కడికి ప్రతి ఒక్కరూ గేమ్ ఆడటానికి వచ్చారు. కాబట్టి కొన్ని నియమాలు పాటించాలి. మార్నింగ్ సాంగ్ వచ్చే వరకు ఎవరు మాట్లాడకూడదు. ఎవరికైనా మాట్లాడాలనిపిస్తే గార్డెన్ ఏరియాలోకి వెళ్లి మాట్లాడండి. అది కూడా సైలెంట్‌గా!" అంటూ స్పష్టంగా చెప్పింది. "నైట్ అంతా మాకు నిద్ర పట్టడం లేదు. కొందరు అల్లర్లు చేస్తారు. ఇకపై మా నిద్ర డిస్టర్బ్ అయితే క్షమించను"అంటూ గట్టిగా హెచ్చరించింది.

Bigg Boss Telugu 9 Madhuri Divvela s Rules Spark Clash With Rithu in House

తనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెబుతూ, "లైట్స్ ఆఫ్ అయిన తర్వాత హౌస్‌లో పూర్తి సైలెంట్ ఉండాలి. లైట్స్ ఆన్ ఉన్నప్పుడు ఏం చేస్తారో మీ ఇష్టం, కానీ రాత్రి ఇకఇకలు పగపగలుఇక బంద్!" అంటూ స్పష్టంగా ఆదేశించింది. మాధురి రూల్స్ వింటూ కూర్చున్న కంటెస్టెంట్స్ ఒక్కసారి సైలెంట్ అయిపోయారు. వెంటనే ఇమాన్యుయేల్ "ఈ రూల్స్ అందరికీ ఓకేనా?" అని ప్రశ్నించగా, రీతు తప్ప అందరూ "ఓకే, ఓకే" అంటూ తలూపారు. కానీ మాధురి మాత్రం "ఓకే కాకపోయినా ఈ రూల్స్ పాటించాల్సిందే!" అంటూ ఖరాఖండిగా చెప్పేసింది.

దీంతో రీతు ఆగకుండా రియాక్ట్ అయింది. "ఇది బిగ్‌బాస్ రూలా లేక మీ రూలా?" అంటూ ఎదురుప్రశ్నించింది. దాంతో మాధురి రెచ్చిపోయింది. "కాదు ఇది నా రూల్. ఏంటి గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా?" అంటూ రీతుపై మండిపడింది. "నేనేం తప్పు మాట్లాడాను?" అని రీతు ప్రతిగా అడగగా, మాధురి ఆమెను కార్నర్ చేసేందుకు ప్రయత్నించింది. ఇలా ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. "నేను చెప్పిన రూల్స్ పాటించకపోతే ఒప్పుకోను, ఇది నా హెల్త్ ప్రాబ్లమ్!" అంటూ మాధురి గట్టిగా అరిచింది. రీతు కూడా అసలు తగ్గలేదు. "హెల్త్ ప్రాబ్లమ్ అయితే సైలెంట్‌గా వెళ్లి పడుకోండి కానీ ఇలా అరవకండి!" అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చింది.

దీంతో మాధురి ఆగ్రహం మరింత పెరిగి.. "లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మీరు చేష్టల వల్ల మాకు నిద్ర పట్టడం లేదు. రాత్రంతా గార్డెన్ ఏరియాలో కూర్చున్నా!" అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. రీతు కూడా వెనకడుగు తగ్గకుండా "ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి!" అంటూ మరోసారి రియాక్ట్ అయింది. దాంతో మాధురి, "మీలా ఇష్టం వచ్చినట్లు ఎవ్వరూ బిహేవ్ చేయడం లేదు. బిగ్‌బాస్ లైట్స్ ఆఫ్ చేశాక కూడా మాట్లాడతారా? అసలు లైట్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారు బిగ్‌బాస్?" అంటూ మళ్లీ ప్రశ్నలు సంధించింది.

తదుపరి క్షణంలోనే రీతు 'మీరు చెప్పిన మాట వినడానికి నేను హౌస్‌లోకి రాలేదు. బిగ్‌బాస్ రూల్ అయితే పాటిస్తా, కాదంటే లేదు'అంటూ గట్టిగా చెప్పేసింది. దీంతో మాధురి "నా రూల్స్ నచ్చకపోతే బిగ్‌బాస్ హౌస్‌ నుండి వెళ్లిపోండి!" అంటూ షాక్ ఇచ్చేలా మాట్లాడింది. రీతు కూడా తడబడకుండా "కావాలంటే మీరు వెళ్లిపోండి, నేను కాదు!" అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. ఎవరూ కూడా తగ్గకుండా వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో రీతు "అలా అరవకండి, మీ హెల్త్‌కే ప్రాబ్లమ్ అవుతుంది" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించగా, మాధురి మరింత ఆగ్రహంగా "పడుకునేటప్పుడు పక్కకు వచ్చి ఇకఇకలు, నవ్వులు చేస్తే నేను ఊరుకోను!" అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది.

చివరగా రీతు "మాధురి రూల్స్ మీ అందరికీ ఇష్టమేనా?" మళ్లీ హౌస్‌మేట్స్‌ను అడిగింది. అందుకు కొందరు కంటెస్టెంట్లు "బిగ్‌బాస్ రూల్స్ మాత్రమే పాటిస్తాం, మాధురి రూల్స్ కాదు!" అంటూ స్పష్టంగా చెప్పారు. దీంతో హౌస్‌లో వాతావరణం హీటెక్కిపోయింది. ప్రస్తుతం మాధురి- రీతూల మధ్య చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "మాధురి బిగ్ బాస్ లా ఆడుతోంది!" అని కొంతమంది కామెంట్ చేయగా.. మరికొందరూ మాధురికి రీతు బాగా కౌంటర్ ఇచ్చింది! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ లో మాధురి రూలింగ్ చేస్తే ప్రయత్నం చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X