Maryada Manish: లాస్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన శ్రీముఖి.. మర్యాద మనీష్‌కి బంపరాఫర్

ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూసిన బిగ్‌బాస్ తెలుగు 9 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి చదరంగం కాదు.. రణరంగమే అని ముందు నుంచి చెబుతూ వచ్చారు కింగ్ అక్కినేని నాగార్జున. ఈసారి డబుల్ హౌస్.. డబుల్ డోస్ అని స్పష్టం చేశారు. స్టేజ్‌పై ఒక్కొక్క కంటెస్టెంట్‌ను ఆహ్వానిస్తూ తన స్టైలీష్ పర్ఫార్మెన్స్‌తో అలవోకగా హోస్టింగ్ చేసుకొచ్చారు నాగ్. స్టేజ్‌పైకి వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్‌కు ధైర్యం చెబుతూ.. ఆల్ ది బెస్ట్ చెప్పారు.

మొత్తంగా బిగ్‌బాస్ తెలుగు 9లో సెలబ్రెటీలతో పాటు సామాన్యులకు సమానంగా అవకాశం కల్పించారు నిర్వాహకులు. మొత్తం 9 మంది సెలబ్రెటీలకు, 6 మంది సామాన్యులకు కంటెస్టెంట్స్‌గా ఛాన్స్ ఇచ్చారు. సెలబ్రెటీ కేటగిరీలో కన్నడ నటి తనూజ పుట్టస్వామి, సీనియర్ హీరోయిన్ ఆశా షైనీ, బుల్లితెర నటుడు భరణి శంకర్, జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి, జబర్దస్త్ నటుడు ఇమ్యాన్యుయేల్, కమెడియన్ సుమన్ శెట్టి, ఫోక్ సింగర్ రాము రాథోడ్, కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ, సీనియర్ హీరోయిన్‌ సంజన గల్రానీ‌లు హౌస్‌లో అడుగుపెట్టారు. ఇక బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో టాప్ 13లో చోటు దక్కించుకుని ప్రేక్షకుల ఓటింగ్‌ ఆధారంగా పవన్ కళ్యాణ్ పడాల, శ్రీజ దమ్ము, హరిత హరీష్, పవన్ డిమోన్, ప్రియ శెట్టిలు కామనర్స్‌ కేటగిరీలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా ఛాన్స్ దక్కించుకున్నారు

Bigg Boss Telugu 9 Maryada Manish entered as bigg boss contestant

అయితే బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో కామనర్స్‌లో చివరిగా ప్రియా శెట్టిని విజేతగా ప్రకటించిన నాగార్జున.. మిగిలిన 8 మందికి వీడ్కోలు చెప్పబోతుండగా యాంకర్ శ్రీముఖి సడెన్‌గా ప్రత్యక్షమైంది. నువ్వెంటీ ఇలా వచ్చావని నాగ్ అడగ్గా.. బిగ్‌బాస్ కామనర్స్‌కు హాయ్ చెప్పి వెళ్దామని వచ్చానని చెప్పింది శ్రీముఖి. అగ్నిపరీక్షలో ఎన్నో కఠిన పరీక్షలు దాటుకుని వచ్చి టాప్ 13లో చోటు దక్కించుకున్నారని పేర్కొంది. వీరిలో ఇంకొక్కరికి ఛాన్స్ ఇవ్వాలని నాగార్జునను రిక్వెస్ట్ చేసింది శ్రీముఖి.

దానికి నాగ్ స్పందిస్తూ.. నా చేతిలో ఏం లేదని, బిగ్‌బాస్‌దే తుది నిర్ణయమని ఆయనను అడిగాడు. దాంతో మరో అగ్నిపరీక్ష కంటెస్టెంట్‌కు అవకాశం కల్పించే అధికారాన్ని నాగార్జునకు ఇచ్చారు బిగ్‌బాస్. దీంతో టేబుల్‌పై ఉన్న కార్డ్స్‌లో నుంచి ఒకరిని బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా సెలెక్ట్ చేయమని శ్రీముఖికి చెప్పారు నాగ్. ఆయన ఆదేశాల మేరకు శ్రీముఖి ఒక ఫోటోను తీసుకొచ్చి రివీల్ చేయగా అది మర్యాద మనీష్ ఫోటో కావడంతో అతను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అతనితో కలిపి కామన్‌మెన్ కేటగిరీలో మొత్తం ఆరుగురు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినట్లయ్యింది. హౌస్‌లో అడుగుపెట్టగానే అమ్మానాన్న, అక్కా, ఫ్రెండ్స్ మీ అందరి కోసం సాధించానని పొంగిపోయాడు మనీష్.

ఇక తొలి రోజే నాగార్జున ఈసారి బిగ్‌బాస్‌లో రెండు హౌస్‌లు ఉంటాయని తెలిపారు. ఓనర్స్ మెయిన్ హౌస్‌లో ఉంటారని, టెనెంట్స్ ఔట్ హౌస్‌లో ఉంటారని చెప్పారు. టాస్క్‌లలో పాల్గొని, ఎంతో కష్టపడి, అగ్నిపరీక్షలో విజయం సాధించిన కామనర్సే మెయిన్ హౌస్‌లో ఉండటానికి నిజమైన అర్హులని చెప్పారు నాగ్. సెలబ్రెటీలంతా టెనెంట్స్ కాబట్టి.. వాళ్లు ఔట్ హౌస్‌లో ఉంటారని తెలిపారు. మొత్తానికి బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్‌గా లాంచ్ కాగా.. రేపటి నుంచి హౌస్ హీటెక్కిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X