ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు ఊహించని మద్ధతు.. నా ఫేవరెంట్ అంటూ స్టార్ హీరో కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 9 ఊహించని ట్విస్ట్‌లతో సాగుతోంది. ఎలిమినేషన్లు, మిడ్ వీక్ ఎలిమినేషన్స్, హోస్ట్ నాగార్జున క్లాసులతో హౌస్‌లో హైడ్రామా నడుస్తోంది. కొందరు కంటెస్టెంట్స్ తమను కేంద్రంగా చేసుకుని బిగ్‌బాస్ హౌస్‌ని నడిపిస్తున్నారు. ఆడియన్స్ కూడా బలంగా వీరికే ఓట్లు గుద్దుతుండటంతో వారి హవా సాగుతోంది. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా, కనీసం ఊహించని విధంగా బిగ్‌బాస్ తెలుగు 9లో అడుగుపెట్టిన కొందరు కంటెస్టెంట్స్ అద్భుతంగా ఆడుతున్నారు. వీరి దెబ్బకు కుర్రాళ్లు సైతం వణికిపోతున్నారు.

ముగ్గురు ఎలిమినేషన్
9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామన్‌మెన్‌లతో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు 9లో తొలివారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, రెండో వారం మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యారు. దీంతో హౌస్‌లో 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగలారు. మూడో వారం మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో విజయం సాధించిన దివ్య నిఖిత హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. దాంతో మొత్తం 13 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో నిలిచారు.

Bigg Boss Telugu 9 Siddu Jonnalagadda praises Suman Shetty infront of Akkineni Nagarjuna

స్ట్రాటజీతో ఆడితేనే
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా అవకాశం అందుకోగానే సరిపోదు. ఇక్కడ పరిస్ధితులుకు తగినట్లుగా, ప్రత్యర్ధుల వ్యూహాలకు తగినట్లుగా వ్యూహాలు ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఎలిమినేషన్ తప్పదు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో మన ఆటతీరుతో పాటు ప్రేక్షకుల ఓటింగ్ ఖచ్చితంగా కావాలి. వారి తీర్పు ఆధారంగానే ఎలిమినేషన్స్ ఉంటాయి. ఎన్నిసార్లు నామినేషన్స్ జరిగినా వారి అండదండలు ఉంటే చాలు నెగ్గుకురావొచ్చు. ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ గడిచిన 8 సీజన్లుగా తెలుగు బిగ్‌బాస్‌లో పలువురు విజేతలుగా నిలిచారు.

భరణి శంకర్‌కు నాగబాబు సపోర్ట్
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టే సెలబ్రెటీలకు ఆల్రెడీ పాపులారిటీ ఉండటంతో ఓట్లకు ఎలాంటి ఢోకా ఉండదు. అయితే వీరిలో కొందరికీ స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు మద్ధతుగా నిలుస్తుండటంతో వారి అభిమానులు కూడా ఓట్లు గుద్దేస్తారు. ఉదాహరణకు మెగా ఫ్యామిలీ అండదండలు ఉన్న కొందరు కంటెస్టెంట్స్ తెలుగు బిగ్‌బాస్ విజేతలుగా నిలిచిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా ఈ బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన బుల్లితెర నటుడు భరణి శంకర్‌కు మెగా బ్రదర్ నాగబాబు మద్ధతు పలికారు. హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన క్షణాల్లోనే ట్వీట్ చేశారు. దీంతో మెగా అభిమానులు, జనసేన కేడర్ ఓట్లు భరణికి పడనున్నాయి.

దూసుకెళ్తున్న సుమన్ శెట్టి
ఇదిలాఉండగా.. బిగ్‌బాస్ తెలుగు 9లో ఎవ్వరూ ఊహించిన విధంగా కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు కమెడియన్ సుమన్ శెట్టి. దాదాపుగా తెలుగు తెరకు దూరంగా ఉన్న ఈ సీనియర్ నటుడు కంటెస్టెంట్‌గా అడుగుపెడతాడని ఎవ్వరూ అనుకోలేదు. సున్నిత మనస్కుడు కావడంతో సుమన్ శెట్టి కుర్రాళ్లతో ఏ మేరకు పోటీపడతాడోనని అంతా భావించారు. కానీ వీటిని పటాపంచలు చేస్తూ దూసుకెళ్తున్నాడు సుమన్. ఎప్పుడు నామినేషన్స్‌లోకి వచ్చినా టాప్ ప్లేస్ తనదే అన్నట్లుగా హవా చూపిస్తున్నాడు. తాజాగా ఓ హీరో నుంచి ఆయనకు ఊహించని మద్దతు దొరికింది.

మీ టైమింగ్‌కి ఫ్యాన్‌ని
ఆదివారం నాటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో తెలుసు కదా టీం సందడి చేసింది. హీరో సిద్ధూ జొన్నలగడ్డ, హీరోయిన్లు రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టిలు హల్ చల్ చేశారు. ఈ సందర్భంగా ఓ స్కిట్ తర్వాత ఎవరు బాగా చేశారని నాగార్జున అడగటంతో సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. అందరి కంటే బాగా సుమన్ శెట్టి చేశారని చెప్పారు. నా చిన్నప్పుడు ఆయన కామెడీ టైమింగ్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని అని, సుమన్ శెట్టి సినిమాలు చూసి నవ్వుకునేవాళ్లమని ప్రశంసించాడు సిద్దూ. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సుమన్ శెట్టికి సిద్దూ జొన్నలగడ్డ అభిమానులు ఓట్లు మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X