Bigg Boss Telugu 9 Voting: రీతూ చౌదరికి షాకిచ్చేలా ఓటింగ్.. డేంజర్ జోన్‌లో టాప్ కంటెస్టెంట్?
బిగ్‌బాస్ తెలుగు 9 మూడో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే హౌస్‌లో గొడవలు, కొట్లాటలు జరుగుతూ ప్రేక్షకులకు కావాల్సినంద వినోదాన్ని అందిస్తున్నాయి. సోమవారం బిగ్‌బాస్‌లో హోరాహోరీగా నామినేషన్స్ జరిగాయి. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టుకోవడానికి, నామినేట్ చేయడానికి కావాల్సిన రీజన్స్ దండిగా ఉండటంతో ఎవరూ తగ్గలేదు. మరి నామినేషన్స్‌లో ఉన్న వారి ఓటింగ్ పరిస్థితి ఏంటీ? ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు లీస్ట్‌లో ఉన్నారు? పరిశీలిస్తే..
హాట్ హాట్‌గా నామినేషన్స్
9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్‌తో కలిపి మొత్తం 15 మందితో బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభమైంది. వీరిలో తొలివారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో మర్యాద మనీశ్ హౌస్‌ను వీడారు. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో 13 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఇక మూడో వారం నామినేషన్స్ హాట్ హాట్‌గా సాగాయి. తొలుత కామనర్లకి నామినేషన్స్ చేసే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. దీంతో సుమన్ శెట్టి, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, సంజనలను నామినేట్ చేశారు. అయితే కెప్టెన్ డిమోన్ పవన్, పవన్ కళ్యాణ్‌లు రీతూని సేవ్ చేయాలని చూడగా.. ప్రియ, శ్రీజ, హరీష్‌లు దానిని గట్టిగా వ్యతిరేకించారు.

రెచ్చిపోయిన హరిత హరీశ్
బిగ్‌బాస్ తెలుగు 9లో ఎప్పుడు నామినేషన్స్ జరిగినా హరిత హరీశ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయనని ఎక్కువమంది నామినేట్ చేయడం లేదంటే.. తనే అందరినీ వాయించి వదిలిపెడుతున్నాడు హరీశ్. తాజాగా ఈ వారం కూడా కామనర్స్‌లో నుంచి ఒకరిని నామినేట్ చేయాలన్నప్పుడు ఒక్కొక్కరికీ ఇచ్చిపడేశాడు హరీశ్. ముఖ్యంగా రీతూ చౌదరి గేమ్, కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఆమె చేసిన హడావుడిని టార్గెట్ చేశాడు మాస్క్ మ్యాన్.
నామినేషన్స్‌లో ఆరుగురు
ఆమె విషయంలో నిజాలు మాట్లాడుకుందాం.. మాట్లాడేటప్పుడు బట్టలు విప్పి మాట్లాడితే బెటర్ అంటూ వ్యాఖ్యానించాడు. రీతూ విషయంలో మీకు కళ్లు మూసుకుపోతున్నాయని ఇద్దరు పవన్‌లకు క్లాస్ పీకాడు హరీశ్. ఆ తర్వాత సంజనని నామినేట్ చేసే సమయంలో రీతూ చౌదరికి దమ్ము శ్రీజకు మధ్య పెద్ద గొడవ జరిగింది. చివరికి అన్నిరకాల గొడవలు, డిస్కషన్స్ ముగిసేసరికి మూడో వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో నిలిచారు. వారు పవన్ కళ్యాణ్, ప్రియ, హరీష్, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, రాము రాథోడ్.
డేంజర్ జోన్‌లో కామనర్
ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్ ప్రకారం బిగ్‌బాస్ తెలుగు 9 మూడో వారం ఓటింగ్‌ను పరిశీలిస్తే.. ఫ్లోరా షైనీ, రాము రాథోడ్‌లు ఓటింగ్‌లో హోరాహోరీ తలపడుతున్నారు. అయితే స్వల్ప తేడాతో ఫ్లోరా టాప్‌లో నిలిచారు. ఫ్లోరాకు 27.37 శాతం ఓటింగ్ రాగా, రాము రాథోడ్‌కు 27 శాతం ఓటింగ్ వచ్చింది. తర్వాత హరిత హరీశ్ (13.57 శాతం) ఓటింగ్‌తో మూడో స్థానంలో నిలిచాడు. అనంతరం పవన్ కళ్యాణ్ పడాలా (12.38 శాతం), ప్రియా శెట్టి 7.3 శాతం ఓటింగ్ సాధించారు. ఈ ఓటింగ్‌ను బట్టి చూస్తే ప్రస్తుతానికి ప్రియా శెట్టి డేంజర్ జోన్‌లో నిలిచారు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి మూడు రోజుల సమయం ఉండటంతో ర్యాంకింగ్స్ మారే అవకాశం ఉంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











