Bigg Boss Telugu 9 Voting: బిగ్ బాస్ 4 వారం నామినేషన్స్ 6 గురు.. డేంజర్ జోన్‌లో ఎవరెవరంటే?
Bigg Boss Telugu 9 Voting: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు, గొడవలు, అలకలతో రసవత్తరంగా సాగుతోంది. ప్రతి సీజన్‌ను ప్రత్యేక కాన్సెప్ట్‌తో డిజైన్ చేసినట్లే ఈ సీజన్ ను ఓనర్ వర్సెస్ టెనెంట్స్ గా గేమ్ డిజైన్ చేశారు. హౌస్‌లోకి సెలబ్రెటీలు, కామనర్స్ ను రప్పించి, కంటెస్టెంట్ల మధ్య ఉత్కంఠ రేపుతున్నారు. ఇలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోన్న ఈ రియాలిటీ గేమ్ మూడో వారం విజయవంతంగా ముగించుకొని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియపై అన్ని దృష్టి పడింది. ఈ వారం ఎంత మంది నామినేషన్స్ లో నిలిచారు? ఎవరి ఓటింగ్ పరిస్థితి ఎలా ఉంది? అనే వివరాలు మీకోసం..
బిగ్ బాస్ రియాలిటీ షో పుల్ టైం ఎంటర్టైమెంట్ అందిస్తోంది. ఇప్పటివరకు మూడో వారాలు విజయవంతంగా ముగించుకొని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. మూడో వారాల్లో హౌస్ నుండి ముగ్గురు సభ్యులను ఎలిమినేట్ అయ్యారు. సంజన గల్రానీ అనూహ్యంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు. ఓటింగ్ ప్రక్రియకు సంబంధం లేకుండా సంజనాను ఇంటి నుంచి బయటకు పంపి సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. వీకెండ్ ఎపిసోడ్‌లో ఆమెను తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చి స్పెషల్ డ్రామా క్రియేట్ చేశారు. ఇలా షోపై హైప్ క్రియేట్ చేశారు. ఇక గత వారంలో సరైన ఓటింగ్ లేకపోవడం వల్ల ప్రియాశెట్టి ఎలిమినేట్ అయ్యారు.

ఇక నాలుగో వారంలో బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియను ఆసక్తికరంగా మారింది. కంటెస్టెంట్లను కన్ఫెషన్ రూమ్‌లో పిలిచి, ఇంటిలో ఉండటానికి అర్హత లేని వారి పేర్లను ఓటుగా మార్చి బాక్స్‌లో వేయాలని సూచించారు. దీనివల్ల, కొందరు సభ్యులు ఇంటిలో ఉన్న తమ అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఇతర సభ్యులను నామినేట్ చేశారు. అలాగే.. ఓ స్పెషల్ గేమ్ నిర్వహించి అందులో గెలిచిన వారికి కూడా నామినేషన్ చేసే పవర్ ను ఇచ్చారు. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఫ్లోరా, రీతూ, సంజన, హరీష్, దివ్య, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.
అయితే.. తనూజ గౌడ, సుమన్ శెట్టి ఇమ్యూనిటీ పవర్ పొందడంతో ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. అలాగే డీమాన్ పవన్ కెప్టెన్‌గా ఉండటం వల్ల నామినేషన్స్‌లో సేఫ్ గా నిలిచారు. ఇక మిగతా 10 మంది సభ్యులలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లోకి వెళ్ళారు. ఇలా బిగ్ బాస్ సీజన్ 9 నాలుగో వారం నామినేషన్స్‌లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. అందులో ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజన గల్రానీ, మాస్క్ మ్యాన్ హరీష్ , దివ్య, శ్రీజ లు నామినేషన్స్ లో నిలిచారు.
ఉత్కంతగా సాగిన నామినేషన్స్ ప్రక్రియలో మెదటి సారి శ్రీజ నామినేషన్స్ లో నిలిచింది. వాస్తవానికి గతవారం శ్రీజ నామినేషన్స్ నిలించింది. కానీ, డీమాన్ పవన్ తన స్పెషల్ పవర్ వాడి శ్రీజను సేవ్ చేశాడు. దీంతో ఆమె సేఫ్ అయింది. ఇక ఎట్టకేలకు నాలుగో వారంలో నామినేషన్స్‌లోకి రావడంతో ఆమె పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి వచ్చిన దివ్య కూడా ఈ వారం తొలిసారిగా నామినేషన్స్‌లో ఉంది. కొత్తగా ఇంట్లోకి వచ్చినందున ఆడియన్స్ కొంత సానుకూలంగా ఆమెను చూడవచ్చు.
కానీ శ్రీజ విషయంలో ఆడియన్స్ విసుగ్గా ఉన్నారు. ఆమె నామినేషన్స్ కు వస్తే.. ఎప్పుడు బయటకు పంపిస్తామా? అనేలా వేచి చూస్తున్నారు. అలాంటి తరుణం ఇప్పుడు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీజ సేఫ్ కావడం కష్టమని భావిస్తున్నారు. అయితే.. ఓటింగ్ నేటితో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓటింగ్ సరళి ఏలా ఉండబోతుంది? ఎవరు లీడ్ లో ఉంటారు? ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో? అనేది ఆడియన్స్ ఓటింగ్ ఫలితమే నిర్ణయిస్తుంది. బిగ్ బాస్ తెలుగు 9 తాజా పరిణామాలు తెలుసుకోవాలనుకుంటే.. ఫిల్మీబీట్ ఫాలో అవుతూ ఉంటుంది.


Click it and Unblock the Notifications











