Bigg Boss 9 Telugu Voting: 4వ వారం ఓటింగ్ లో ఊహించని ట్విస్ట్ .. డేంజర్‌జోన్‌లో టాప్ కంటెస్టెంట్స్..
Bigg Boss Telugu 9 Voting: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రంజుగా సాగుతోంది. ఎప్పుడూ ఊహించని ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు, కాంట్రవర్సీలతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈ సీజన్ లో ఓనర్ వర్సెస్ టెనెంట్స్ గా కాన్సెప్ట్‌లో డిజైన్ చేసి, కంటెస్టెంట్ల మధ్య ఉత్కంఠను, ఎమోషన్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోన్న ఈ రియాలిటీ గేమ్ మూడో వారం విజయవంతంగా ముగించుకొని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. చూస్తుండగానే నాలుగో వారం ఎలిమినేషన్స్‌కు చేరువైంది. నామినేషన్లలో ఉన్నవాళ్లు గట్టెక్కేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటింగ్ సరళి చూస్తుంటే ఈసారి ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుంచి వెళ్లిపోక తప్పదని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మొదటి వారం కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ, రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ కాగా.. ఇక మూడో వారం అల్లరి పిల్ల ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ గట్టిగా జరిగింది. నామినేషన్ సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య వాదోపవాదనలు జరిగాయి. హౌస్‌మేట్స్ మధ్య గొడవలు కూడా జరిగాయి. అంతేకాకుండా కంటెస్టెంట్లను కన్ఫెషన్ రూమ్లో పిలిచి, ఇంట్లో ఉండటానికి అర్హత లేని వారి పేర్లను బాక్స్‌లో వేయమని సూచించారు. అంతేకాక, ఒక స్పెషల్ గేమ్ ద్వారా గెలిచిన వారికి కూడా నామినేషన్ చేసే అదనపు పవర్ ఇచ్చారు. ఇలా నాలుగో వారంలో నామినేషన్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా సాగింది.

నామినేషన్స్ నిలిచిందెవరు?
నాలుగో వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి. ఈ వారంలో తనూజ గౌడ, సుమన్ శెట్టి లకు ఇమ్యూనిటీ పవర్ ఉండటంతో ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. అలాగే డీమాన్ పవన్ కెప్టెన్‌గా ఉండటం వల్ల నామినేషన్స్‌లో సేఫ్‌గా నిలిచాడు. మిగతా 10 మంది సభ్యులలో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లోకి వెళ్లారు. ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజన గల్రానీ, మాస్క్ మ్యాన్ హరీష్, దివ్య, శ్రీజ లు ఆ వారంలో నామినేషన్స్‌లో నిలిచారు. నామినేషన్స్ ప్రక్రియ హౌస్‌లో ఉత్కంఠను మరింత పెంచుతూ, కంటెస్టెంట్ల మధ్య అనుబంధాలను, వ్యూహాలను ప్రభావితం చేసింది. ఈ వారంలో ఎవరు సేఫ్ అవుతారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో ఆడియన్స్ ఓటింగ్ ఫలితాల ఆధారంగా నిర్ణయించబడుతుంది.
ఇక సోషల్ మీడియా పోల్స్, బిగ్ బాస్ ఆన్ లైన్ ఓటింగ్ ప్రకారం.. ఎవరూ ఊహించని విధంగా సంజన గల్రానీ టాప్ లో నిలిచారు. దాదాపు 24.11 శాతం ఓటింగ్ సాధించింది. ఇక ఫ్లోరా షైనీ 18.09 శాతం ఓట్లతో రెండవ స్థానంలో నిలించింది. ఇక వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన దివ్య కూడా బిగ్ బాస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోంది. ఆ అమ్మడు కూడా 17. 75 శాతం సాధించింది. ఇక రీతూ చౌదరి ఓటింగ్ కాస్త వెనుక పడినట్టు ఉంది. కేవలం 14 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. ఇక డేంజర్ జోన్ లో ఇద్దరూ కామనర్స్ ఉన్నారు. అయితే.. ఇందులో మాస్క్ మ్యాన్ హరీష్ కేవలం 11.05 శాతం ఓట్లు పొందగా, శ్రీజ దమ్ము అందరి కంటే తక్కువ ఓట్లు పొందినట్టు తెలుస్తోంది కేవలం 11.05 శాతం ఓట్లు మాత్రమే పొందింది.
నాలుగో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆడియన్స్ ఓటింగ్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సంజన లీడ్‌లో ఉంది. ఫ్లోరా, దివ్య, రీతూ లు సేఫ్ జోన్ లో ఉండగా... హరీష్, శ్రీజ లు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒక్కరి ఎలిమినేషన్ అయ్యే అవకాశాలున్నాయి. ఇందులో మాస్క్ మ్యాన్ రాష్‌గా బిహేవ్ చేస్తూ చిచ్చులు పెడుతున్నందున అతను ఎప్పుడు బయటకు పంపబడుతాడో అభిమానులు ఆసక్తిగా వేచిచూస్తున్నారు. అదే సమయంలో శ్రీజ నామినేషన్స్‌లో నిలిచింది. ఆమె సేఫ్ కావడం కష్టంగానే ఉంది. ఇక శ్రీజ విషయంలో ఆడియన్స్ విసిగిపోయారు. ఆమె నామినేషన్స్ కు వస్తే.. ఎప్పుడు బయటకు పంపిస్తామా? అనేలా వేచి చూస్తున్నారు. అలాంటి తరుణం ఇప్పుడు వచ్చింది. శ్రీజ సేఫ్ కావడం కష్టమే అని చెప్పాలి. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో? అనేది ఆడియన్స్ ఓటింగ్ ఫలితమే నిర్ణయిస్తుంది.


Click it and Unblock the Notifications











