Bigg Boss 9 Telugu 8th Week Nominations: కంటెస్టెంట్స్‌ తలరాతను మార్చేసిన మాజీలు.. ఈ వారం నామినేషన్స్‌ ఇవే..

Bigg Boss 9 Telugu 8th Week Nominations: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) రసవత్తరంగా సాగుతోంది. ప్రేక్షకులకు ప్రతి వారం కొత్త ట్విస్టులు, కొత్త డ్రామాలతో కిక్ ఇస్తోంది. ఎప్పుడూ ఊహించని విధంగా నామినేషన్స్, ఎలిమినేషన్స్, ఫైట్స్ జరిగే ఈ షోలో ఎనిమిదో వారం మరింత ఉత్కంఠగా సాగుతోంది. కామన్ మ్యాన్, సెలబ్రిటీలతో పాటు వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్స్ కూడా హౌస్‌లోకి రావడంతో గేమ్ స్వరూపం మొత్తం మారిపోయింది. ఇలాంటి గేమ్ లో ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ ఎలా సాగింది? నామినేషన్స్ ఎవరు ఉన్నారు? అనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ 9 తెలుగు ప్రారంభంలో కాస్త స్లోగా నడుస్తోందనే కామెంట్స్ వచ్చినా, వైల్డ్‌కార్డ్ ఎంట్రీల తర్వాత సిట్యువేషన్ పూర్తిగా రివర్స్ అయింది. పచ్చళ్ల పాప రమ్య మోక్ష, అయేషా, మాధురి లాంటి కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన వెంటనే హౌస్‌లో హీట్ పెరిగిపోయింది. వాళ్ల వల్ల కామన్ మ్యాన్స్, సెలబ్రిటీస్, వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్ల మధ్య రివాల్స్ మరింత స్పష్టమయ్యాయి. ఇప్పుడు హౌస్ చదరంగం కాకుండా రణరంగంలా మారిపోయిందని చెప్పాలి.

Bigg Boss Telugu 9 Week 8 Nominations Shake the House Eight Contestants on Edge

షాకింగ్ ఎలిమినేషన్
ఇప్పటి వరకు బిగ్‌బాస్ 9 నుంచి తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. వీరిలో శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఆశా సైనీ, శ్రీజ దమ్ము, భరణి శంకర్ అవ్వగా.. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అయేషా బయటికి వెళ్లగా, తాజా ఎపిసోడ్‌లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్ రమ్య మోక్ష (పచ్చళ్ల పాప) ఎలిమినేట్ అయ్యింది. కేవలం రెండు వారాలే హౌస్‌లో ఉన్నా, ఆమె కామెంట్స్, గొడవలు, సెటైర్లు ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేశాయి.

ప్రధానంగా కళ్యాణ్ , తనూజ, డీమాన్, రీతూ వంటి కంటెస్టెంట్లపై రమ్య వేసిన వ్యాఖ్యలు హౌస్‌లో టెన్షన్ పెంచాయి. ఫలితంగా రమ్య ఆటకంటే ఎక్కువగా కాంట్రవర్సీల్లోనే లైమ్‌లైట్‌లో నిలిచింది. చివరికి తనూజ ఫ్యాన్స్, సోషల్ మీడియా నెగటివ్ వేవ్స్ కారణంగా ఆమె ఎలిమినేట్ అయ్యిందని తెలుస్తోంది. రమ్య బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటికి వచ్చిన వెంటనే రమ్య "బిగ్ బాస్ బస్" షోలో పాల్గొంది. ఆ షోలో శివాజీ ఆమెను ప్రశ్నలతో దంచేశారు. ముఖ్యంగా కళ్యాణ్-తనూజ, పవన్ లింక్ అప్ విషయంలో ఆమె ఇచ్చిన సమాధానాలపై శివాజీ స్ట్రాంగ్ కౌంటర్లు వేయడం చర్చనీయాంశమైంది.

నామినేషన్ ప్రక్రియ ఇలా..
బిగ్ బాస్ లో 8 వారం నామినేషన్స్ రణరంగంగా మారాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ప్రియ, శ్రీజ, మర్యాద మనీష్, ఫ్లోరా తిరిగి హౌస్‌లోకి వచ్చి హాట్ టాపిక్ అయ్యారు. బిగ్ బాస్ వీరికి రెండు కత్తులు ఇచ్చి ఒకటి నామినేట్ చేయడానికి, మరొకటి నామినేషన్ పవర్‌ని వేరే వారికి ఇవ్వడానికి , గేమ్‌ని మరింత ఆసక్తిగా మార్చేశాడు. అంతేకాదు, వీరిలో కొంతమంది మళ్లీ హౌస్ మెంబర్స్‌గా కొనసాగుతారని హింట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు.

ప్రియ ఎంట్రీతోనే సంజన షాక్ అయింది. "రోడ్ రోలర్‌లా" అంటూ బాడీ షేమింగ్ చేసిన మాటలపై ప్రియ కౌంటర్ వేసింది. "ఇది ఫన్నీ కాదు, హర్ట్ చేస్తుంది" అంటూ క్లాస్ ఇచ్చింది. సంజన "నేను కూడా బక్కగా ఏం లేను" అని అనడంతో హౌస్‌లో టెన్షన్ పెరిగింది. మరోవైపు మర్యాద మనీష్, కళ్యాణ్‌పై నిప్పులు చెరిగాడు "ఇమ్మానుయేల్ నిన్ను నమ్మాడు, కానీ నువ్వు వెన్నుపోటు పొడిచావ్" అంటూ సెటైర్లు వేశాడు. దాంతో కళ్యాణ్, ఇమ్మానుయేల్ మధ్య వాగ్వాదం చెలరేగింది.

ఇమ్మానుయేల్ కూడా తనూజను నామినేట్ చేస్తూ "నాకోసమే ఆడింది కానీ ఓటింగ్‌లో మోసం చేసింది" అన్నాడు. దాంతో తనూజ "రెండు నాలుకలతో మాట్లాడుతున్నాడు" అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. కళ్యాణ్-రాము మధ్య కూడా వాగ్వాదం తలెత్తింది "నువ్వు కెప్టెన్ కాలేవు" అని కళ్యాణ్ అంటే "నువ్వూ కాలేదు" అంటూ రాము ఫైర్ అయ్యాడు. చివరగా మర్యాద మనీష్ "ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవిలో పెడుతున్నారు" అంటూ తనూజపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి వారం నామినేషన్స్ ఫుల్ డ్రామా, ఫుల్ ఎమోషన్, ఫుల్ ఫైర్ తో సాగినట్టు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎనిమిదో వారం నామినేషన్ లిస్ట్ ప్రకారం, దివ్వెల మాధురి, రీతూ చౌదరి, సంజన, తనూజ, డీమాన్ పవన్, కళ్యాణ్, గౌరవ్, రాము రాథోడ్ నామినేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో పూర్తి వివరాలపై క్లారిటీ రాలేదు. అధికారికంగా త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఈ వారం నామినేషన్లకు సంబంధించిన వివరాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X