Bigg Boss Wild Card Entry: బిగ్ బాస్ లో భారీ ట్విస్ట్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేది వీరే

Bigg Boss Wild Card Entry: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ రియాలిటీ షో ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఎవరి ఊహించని ట్విస్టులు సర్ప్రైజ్ లు, మరెన్నో చూడని కాంట్రవర్సీలను ఒక్క బిగ్ బాస్ షోలో చూస్తున్నాం. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ గా మారిన ఈ బిగ్బాస్.. అప్డేట్ గా అవ్వబోతుంది. ఇప్పటికే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఈ షోను మరింత రసవత్తరంగా మార్చడానికి బిగ్ బాస్ టీం సిద్ధమైంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ల ద్వారా బిగ్ బాస్ హౌస్ లో వినోద విధ్వంసం సృష్టించాలని భావిస్తుంది. ఇంతకీ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ కాబోతున్న కంటెస్టెంట్లు ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? మీరు ఓ లుక్ వెయ్యండి.

ప్రతి ఏడాది సరికొత్త కాన్సెప్ట్ తో ముందుకు వస్తుంది బిగ్ బాస్. ఈ ఏడాది కూడా బిగ్ బాస్ సీజన్ 9 కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలుగా ముందుకు వచ్చింది. అలా 15 మంది కంటెస్టెంట్లతో షో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో సెలబ్రిటీ కేటగిరిలో శ్రష్టి వర్మ, భరణి, ఇమ్మాన్యుయెల్‌, తనూజ, రాము రాథోడ్‌, సుమన్‌ శెట్టి, సంజనా గల్రానీ, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరీలు బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వగా.. కామన్‌ మ్యాన్ కేటగిరిలో డీమాన్‌ పవన్‌, ప్రియా శెట్టి, కళ్యాణ్‌, మర్యాద మనీష్‌, హరిత హరీష్‌, శ్రీజ దమ్ము షోలో అడుగుపెట్టారు. వీరిలో శ్రష్టి వర్మ, మర్యాద మనీష్‌, ప్రియాశెట్టి, హరీత హరీష్‌ లు వరుసగా ఎలిమినేట్‌ అయ్యారు. ఈ మధ్యలో ఎవరూ ఊహించని విధంగా దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ ద్వారా మిడ్‌ వీక్‌ ఎంట్రీ ఇచ్చి, అందర్ని ఆశ్చర్యపరింది. తన ఆటతీరులో సెలబ్రెటీలకు చుక్కులు చూపిస్తోంది.

Bigg Boss Telugu 9 Wild Card Entries Six New Contestants Set to Shake the House

వాస్తవానికి.. దివ్యా నికిత ఎంట్రీ లాగానే వైల్డ్ కార్డు ఎంట్రీస్ ను సర్ప్రైసింగ్ గా ఒక్కొక్కరిని హౌస్ లోకి పంపిస్తారని భావించారు. కానీ, ఈ ఆదివారం షోలో బిగ్ బాస్ రీ లాంచ్ పేరిట వారిని గ్రాండ్ గా హౌస్ లోకి పంపించాలని బిగ్ బాస్ టీం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్ళబోతున్నారు. ఇందులో సీరియల్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫియెన్సర్లు ఉన్నారు. మరో విశేషమేమింటంటే.. వారిలో ఇద్దరు సెన్సేషనల్‌, క్రేజీ స్టార్స్ ఉన్నారట.

1. దివ్వెల మాధురి (Madhuri Divvala)
ఇక వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ల లిస్ట్ లో మీడియా సెన్సేషన్‌ దివ్వెల మాధురీ ఉంది. ఈమె పేరు తెలియని ఆంధ్ర ప్రజలు ఉండరు. సోషల్ మీడియాలో దివ్వెల మాధురీ - వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ జంట ఉన్న ఫాలోయింగ్ చూస్తే షాక్ అవుతారు. ఈ జంట నిత్యం రీల్స్, వీడియోస్‌ చేస్తూ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నారు. అదే సమయంలో వీరి బంధం ఎప్పుడూ మీడియాలో చర్చనీయంగానే ఉంటుంది. అంతే కాదు.. దివ్వెల మాధురీ ఆ మధ్య వరుసగా మీడియా ఇంటర్వ్యూలతో తెగ హంగామా చేశారు. దీంతో ఏపీ రాజకీయ సమీకరణాలు మారాయి అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెడితే.. రచ్చ రచ్చే..

2 .అలేఖ్య చిట్టి పికెల్స్ రమ్య (Ramya moksha kancharla)
ఇక మరో సోషల్‌ మీడియా సెన్సేషనల్‌, అలేఖ్య చిట్టి పికిల్స్ బ్యూటీ రమ్య మోక్ష కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆమె బిగ్ బాస్ షో ప్రారంభంలోనే రాబోతుందన్నారనే పెద్ద ఎత్తున్న ప్రచారం జరిగింది. కానీ ఆమె ఎంట్రీ ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఆమెని బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి తీసుకురాబోతున్నారట. అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా రమ్య పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఆ మధ్య పికిల్స్ రేట్ విషయంలో కస్టమర్ తో గొడవ పడటం.. ఆ గొడవ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అలేఖ్య చిట్టి పికిల్స్ బ్యూటీ వార్తల్లో నిలిచారు. అంతేకాకుండా.. రమ్య కాస్త గ్లామరస్‌ షో, జిమ్‌ వీడియోలు ఫోటోలు పంచుకుంటూ సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. అలా ఈ అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. అదే క్రేజ్‌ ఆమెకి బిగ్‌ బాస్‌ ఆఫర్‌ అందుకుంది.

3. అయేషా జీనత్ (Ayesha Zeenath)
వీరితో పాటు మరో గ్లామర్ బ్యూటీగా అయేషా జీనత్ కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్ టీవీ, సినీ రంగాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ కేరళ బ్యూటీ, తెలుగువారికి మాత్రం కొత్త కాదు. సావిత్రిగారి అబ్బాయి, ఊర్వశివో రాక్షసివో వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇక ఇటీవల 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్' షోలో కూడా తన ఎనర్జీతో అలరించిన జీనత్, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్ వినిపిస్తోంది. ఆమె ఎంట్రీతో షోలో మళ్లీ కొత్త ఉత్సాహం రానుందనే అంచనాలు ఉన్నాయి.

4. శ్రీనివాస సాయి ( Srinivasa Sai)
తెలుగు నటుడు, గోల్కొండ హైస్కూల్‌ ఫేమ్ శ్రీనివాస సాయి కూడా బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా అడుగుపెట్టబోతున్నారట. గోల్కొండ హైస్కూల్‌ సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. తరువాత శుభలేఖలు, వినరా సోదర వీరకుమారా వంటి సినిమాల్లో నటించారు. కానీ, అనుకున్న విధంగా వెండితెరపై అవకాశాలు అందుకోలేకపోయారు. ఇదిగో ఎప్పుడు బిగ్ బాస్ షో ద్వారా తన టాలెంట్ ను చూపించాలని బిగ్ బాస్ లో అడుగుపెట్టాలని భావిస్తున్నారట. యాక్టివ్, స్మార్ట్‌గా ఉండే ఈ కుర్రాడు హౌస్‌లోకి వెళ్లిన తర్వాత మంచి ట్రాక్‌లు వేస్తాడనే అంచనాలు ఉన్నాయి.

5. గౌరభ్ గుప్త (Gaurav Gupta)
టెలివిజన్‌లో గీత LLB సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు గౌరభ్ గుప్త. తన సిక్స్‌ప్యాక్, స్టైలిష్ లుక్‌తో ఇప్పటికే చిన్న తెర ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న ఈ కండాల వీరుడు ఇప్పుడు ఈ ఫిట్‌నెస్ ఫ్రీక్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. గౌరవ్ హౌస్ లో అడుగు పెడితే... హౌస్‌లో జరిగే ఫిజికల్ టాస్క్‌లలోనూ, ఫన్ మోమెంట్స్‌లోనూ గౌరభ్ దూసుకుపోతాడని అంచనాలు వేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే.. ఏమైనా లవ్ ట్రాక్స్ కూడా సెట్ చేసే అవకాశముంది.

6. నిఖిల్ నాయర్ (Nikhil nair )
గృహలక్ష్మి సీరియల్‌లో తులసి చిన్న కొడుకు ప్రేమ్‌గా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు నిఖిల్ నాయర్. ఆ తరువాత 'పలుకే బంగారమాయెనా' సీరియల్‌లో హీరోగా నటించి, 'దిల్ సే' వెబ్‌సిరీస్‌తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీస్ ద్వారా అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు తన సిక్స్‌ప్యాక్ ఫిజిక్‌తో బిగ్ బాస్ స్టేజ్‌కి రెడీ అవుతున్నాడట. ఫిజికల్ టాస్క్‌లలో హల్ చల్ చేయడమే కాదు.. లవ్ ట్రాక్‌లలో ఊహించని ట్విస్ట్‌లు ఖాయం అంటున్నారు అతని ఫ్యాన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X