Bigg Boss Telugu 9 Wild Card Entry: వైల్డ్ కార్డ్‌తో బిగ్‌బాస్‌లోకి.. ఎవరీ దివ్య నిఖిత?
బిగ్‌బాస్ తెలుగు 9 హోరాహోరీగా సాగుతోంది. గొడవలు, కొట్లాటలతో హౌస్ హీటెక్కిపోతోంది. అయితే గత సీజన్ మాదిరిగానే, ఈ సీజన్‌లోనూ బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీలు ఉంటాయని అంటున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేది వీళ్లేనంటూ రకరకాల పేర్లు తెర మీదకి వచ్చాయి. కట్ చేస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా సామాన్యులకే దక్కేలా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో టాలెంట్ నిరూపించుకుని హౌస్‌లో అడుగు పెట్టలేకపోయిన ఓ నలుగురికి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్.
బిగ్‌బాస్‌లో 13 మంది కంటెస్టెంట్స్
9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు సామాన్యులతో కలిపి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్.. బిగ్‌బాస్ తెలుగు 9లో ఎంట్రీ ఇచ్చారు. వీరిలో తొలివారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో మర్యాద మనీష్ హౌస్‌ను వీడాడు. ఇక మూడో వారంలో ఆరుగురు నామినేషన్స్‌లో ఉండగా.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని పుకార్లు వినిపించాయి. అదే జరిగితే 13 మంది కంటెస్టెంట్స్ కాస్తా 11కు చేరే అవకాశం ఉంది. లేదు ఎప్పటిలాగే ఆదివారం ఏకైక ఎలిమినేషన్ ఉంటే 12 మంది కంటెస్టెంట్స్ మిగులుతారు.

సెలబ్రెటీలకు సామాన్యుల షాక్
సామాన్యులు, సెలబ్రెటీలతో డబుల్ హౌస్ - డబుల్ డోస్ అంటూ వచ్చిన బిగ్‌బాస్ తెలుగు 9 ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాము సెలబ్రెటీలతో ఉన్నట్లు అస్సలు ఫీల్ అవ్వని కామనర్స్.. వారికి గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తున్నారు. టాస్క్‌లు, డిస్కషన్స్ ఏదైనా సరే తగ్గేదే లే అంటున్నారు. సెలబ్రెటీలను దాటుకుని రెండో వారం కామనర్ డిమోన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. అయితే రీతూ చౌదరి ఫౌల్ గేమ్ ఆడటం వల్లే పవన్ కెప్టెన్ అయ్యాడని భావించిన నాగార్జున.. అతని కెప్టెన్సీని పీకేశాడు. దీనిని అవమానంగా భావించిన పవన్.. తన కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇచ్చేసి కష్టపడి ఆడి గంటల వ్యవధిలోనే తిరిగి కెప్టెన్ చైర్‌లో కూర్చొన్నాడు. అలా సామాన్యుల నుంచి సెలబ్రెటీలకు టఫ్ ఫైట్ ఎదురవుతోంది.
బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు
దీనిని ఇలాగే కంటిన్యూ చేయాలని భావించిన బిగ్‌బాస్ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ప్లాన్ చేశారు. ఇక్కడా సామాన్యులకే తొలి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో సత్తా చాటిన దివ్య నిఖిత, అనూష రత్నం, నాగ ప్రశాంత్, షాకీబ్‌లను హౌస్‌లోకి పంపారు. అయితే వారిలో తొలుత దివ్య నిఖితకి హౌస్‌లోకి వచ్చే అవకాశం కల్పించాడు. దీంతో దివ్య నిఖిత ఎవరు? ఆమె బిగ్‌బాస్ వరకు ఎలా వచ్చింది? అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
సినిమా రివ్యూలతో పాపులర్
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యింది దివ్య నిఖిత. వెజ్‌ఫ్రైడ్ మోమో అంటే నెటిజన్లు ఈజీగా ఆమెను గుర్తుపట్టేస్తారు. అయితే ఈవిడకు సినిమాలతో లైట్‌గా టచ్ ఉంది. రామ్ పోతినేని, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన గణేష్ మూవీలో దివ్య నిఖిత బాలనటిగా కనిపించింది. పెరిగి పెద్దయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన దివ్య నిఖిత.. రెండేళ్లలో తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంది. సినిమా రివ్యూలు చెబుతూ ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌ను సాధిస్తోంది దివ్య నిఖిత. బిగ్‌బాస్ తెలగు 9లో సామాన్యులకు అవకాశం కల్పిస్తున్నారని తెలిసి దరఖాస్తు చేసుకుంది. అన్ని అడ్డంకులను దాటుకుని బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. 13 మందితో కూడిన తుది జాబితాలో చోటు దక్కించుకుంది. బిగ్‌బాస్ లాంచింగ్ రోజున ఖచ్చితంగా హౌస్‌లో అడుగుపెడుతుందని అంతా భావించారు. కానీ చివరిలో ఆమెకు నిరాశే ఎదురైంది. అయితే మళ్లీ దివ్యకు వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌బాస్ నుంచి పిలుపొచ్చింది.


Click it and Unblock the Notifications











