Bigg Boss 9th Week Voting: చెమటలు పట్టిస్తోన్న ఓటింగ్ ... డేంజర్ జోన్‌లో ముగ్గురు టాప్ కంటెస్టెంట్స్?

బిగ్‌బాస్ తెలుగు 9 ఉత్కంఠగా సాగుతోంది. చూస్తుండగానే 8 వారాలు పూర్తి చేసుకుని 9వ వారంలోకి అడుగుపెట్టింది. మరో ఆరు వారాల్లో 9వ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ఇప్పటికే వరుస ట్విస్టులతో కంటెస్టెంట్స్, ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 9వ వారం నామినేషన్స్ పూర్తవ్వగా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వివరాలు పరిశీలిస్తే..

15 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులతో కలిపి 22 మంది కంటెస్టెంట్స్‌ పాల్గొన్నారు. వీరిలో దమ్ము శ్రీజ, భరణి రీ ఎంట్రీ ఇచ్చారు. తొలి వారం శ్రష్టి వర్మ, రెండో వారం మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీష్, ఐదో వారంలో ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజ.. ఆరో వారంలో ఆయేషా జీనత్, రమ్య మోక్ష, ఏడో వారంలో భరణి, ఎనిమిదో వారంలో దమ్ము శ్రీజ, దివ్వెల మాధురి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో రీతూ చౌదరి, భరణి దివ్య నిఖిత, రాము రాథోడ్, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి, పవన్ కళ్యాణ్, పవన్ డిమోన్, నిఖిల్ నాయర్, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తాలు ఉన్నారు.

Bigg Boss Telugu 9th Week Voting Ramu Rathod and Suman Shetty are in Danger Zone

ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు
9వ వారంలో సోమవారం నామినేషన్స్ కార్యక్రమం ముగిసింది. ఈ వారం తను తండ్రిలా భావించే భరణిని తనూజ నామినేట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తం మీద ఈ వారం ఏడుగురు నామినేషన్స్‌లో నిలిచారు. వారు పవన్ కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, సాయి శ్రీనివాస్, భరణి, సుమన్ శెట్టి, రాము రాథోడ్‌. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అనుకుంటే ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్‌ను వీడనున్నారు.

దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్
నామినేషన్స్ పూర్తి కావడంతో సోషల్ మీడియాలో అప్పుడే ఓటింగ్ మొదలైపోయింది. దీని ప్రకారం ఓటింగ్ పరిశీలిస్తే.. గత కొద్దిరోజులుగా టాస్క్‌లలో ఇరగదీస్తున్న పవన్ కళ్యాణ్ పడాల 27.08 శాతం ఓటింగ్‌తో టాప్‌లో నిలిచాడు. ఆ తర్వాత తనూజ పుట్టస్వామి 20.39 శాతం, సంజన గల్రానీ 15.88 శాతం, సాయి శ్రీనివాస్ 12.11 శాతం, భరణి 10.58 శాతం, సుమన్ శెట్టి 9.1 శాతం, రాము రాథోడ్ 4.87 శాతం ఓటింగ్‌ సాధించారు. దీనిని బట్టి భరణి, సుమన్, రాము రాథోడ్‌లు డేంజర్‌ జోన్‌లో నిలిచారు.

డేంజర్ జోన్‌లో ఎవరంటే?
అయితే ఇప్పటి వరకు ఎప్పుడు నామినేషన్స్‌లోకి వచ్చినా సుమన్ శెట్టి టాప్ 2లోనే ఉండేవాడు. అలాంటిది ఏకంగా చివరి నుంచి రెండో స్థానంలో నిలవడం ఆశ్చర్యకరంగా మారింది. తొలుత ఉన్నంత ఊపు కనిపించకపోవడంతో పాటు ఎక్కువగా ఎమోషనల్ అవుతుండటం ఆయనకు మైనస్‌గా కనిపిస్తోంది. భరణి మాదిరిగా .. సుమన్ కూడా బంధాల మధ్యలో నలిగిపోతున్నాడా అని వాదనలు వినిపిస్తున్నాయి. ఆట తీరు మార్చుకోకుంటే సుమన్ త్వరలోనే హౌస్‌ను వీడతాడని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అటు భరణి కూడా రీ ఎంట్రీ తర్వాత తన స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ చూపించాల్సి ఉంది. ఇక రాము రాథోడ్ టాస్క్‌ల్లో ఫైర్ చూపిస్తే సేవ్ కావడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఓటింగ్ ముగియడానికి ఇంకా సమయం ఉండటంతో ఈ ర్యాంకింగ్స్ మారే అవకాశం ఉంది. మరి ఈ బిగ్‌బాస్ తెలుగు 9లో 9వ వారంలో ఎవరు హౌస్‌ను వీడతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X