సన్నజాజిలా మారిన దేత్తడి హారిక.. నడుము అందాలతో హాట్ హాట్‌గా

యూ ట్యూబ్ కంటెంట్ తో క్రేజ్ అందుకొని ఆ తరువాత బిగ్ బాస్ వరకు వెళ్లిన ఆలేఖ్య హారిక మరోసారి తన గ్లామర్ తో నెటిజన్లకు షాక్ ఇస్తోంది. బిగ్ బాస్ ముందు వరకు ఒకలా ఉన్న హారిక ఆ తరువాత మాత్రం నెవర్ బిఫోర్ అనేలా షాక్ ఇస్తోంది. షోలతో అంతగా బిజీ అవ్వకపోయినప్పటికి ఫొటో షూట్స్ తో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింతగా పెంచుకుంటోంది. ఇక లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫొటోల్లో అయితే హారికలో మరింత మార్పు వచ్చింది.

అతి తక్కువ టైమ్ లోనే

అతి తక్కువ టైమ్ లోనే

యూ ట్యూబ్ లో దేత్తడి హారిక క్యారెక్టర్ తో తన క్రేజ్ ను పెంచుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ టైమ్ లోనే
మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది. అలాగే ఇతర షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా నటించింది. కొన్ని చిన్న చిన్న సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి గాని ఆ ఆఫర్స్ కు ఆలేఖ్య ఒప్పుకోలేదు.

గ్లామరస్ బ్యూటీగా

గ్లామరస్ బ్యూటీగా

దేత్తడి హారిక అనే ట్యాగ్ తోనే బిగ్ బాస్ వరకు వెళ్లిన ఈ బ్యూటీ తక్కువ రోజుల్లోనే తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ను అందుకుంది. అప్పటి వరకు కూడా ఒక నార్మల్ అమ్మాయిలా కనిపించిన హారిక ఆ తరువాత బిగ్ బాస్ లో ఇచ్చిన గ్లామర్ డోస్ కు ఒక్కసారిగా గ్లామరస్ బ్యూటీగా మారిపోయింది.

 సేఫ్ జోన్ లో అడుగులు

సేఫ్ జోన్ లో అడుగులు

బిగ్ బాస్ 4 తెలుగులో టాప్ 5 వరకు వచ్చిన హారిక టైటిల్ విన్నర్ అవుతుందేమో అనేంతలా కష్టపడింది. కానీ అప్పటికే వేరే వాళ్ళు ఓట్లతో టాప్ లో ఉండడం వలన హారిక డ్రాప్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఆమెకు టీవీ షోలు అలాగే సినిమాలు అని ఛాన్సులు బాగానే వస్తున్నాయి. కేవలం తనకు నచ్చిన వాటికే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సేఫ్ జోన్ లో అడుగులు వేస్తోంది.

సన్నజాజిలా మారిపోయిన హారిక

సన్నజాజిలా మారిపోయిన హారిక

ఇక లాక్ డౌన్ వలన గ్యాప్ రావడంతో ఎక్కువగా గ్లామరస్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. మొన్నటి వరకు కాస్త బొద్దుగానే ఉన్న హారిక ఇప్పుడు మాత్రం కాస్త నాజూగ్గా మారినట్లు తెలుస్తోంది. ఒక ఫొటోలో నడుము దగ్గర పువ్వు పెట్టుకొని సరికొత్తగా స్టిల్ ఇచ్చింది. దీంతో అమ్మడు సన్నజాజిలా మారిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X