»   »  కాంట్రవర్సీ జోన్‌లోకి బిగ్ బాస్: రగులుతున్న విద్వేషాలు, గొడవలు!

కాంట్రవర్సీ జోన్‌లోకి బిగ్ బాస్: రగులుతున్న విద్వేషాలు, గొడవలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో ప్రారంభమైన బిగ్ బాస్ షో క్రమక్రమంగా కాంట్రవర్సీ జోన్లోకి అడుగు పెడుతోంది. తొలి రెండు మూడు రోజులు పరిచయ కార్యక్రమాలు, ఎలిమినేషన్ నామినేషన్లతో సాగింది. బిగ్ ఇంట్లో సభ్యుల మధ్య ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. ఆటపాటలతో సరదాగా సాగింది.

మరి షో ఎప్పుడూ ఇలాగే సరదాగా, రొటీన్‌గా సాగితే ప్రేక్షకులకు కిక్కేముంటుంది? అందుకే షోను డిఫరెంట్ వేలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త కొత్త టాస్కులతో షోను మరింత వేడుక్కిస్తున్నారు.

రగులుతున్న విద్వేషాలు

రగులుతున్న విద్వేషాలు

బిగ్ బాస్ షో కాంట్రవర్సీ జోన్లోకి అడుగు పెడుతున్న క్రమంలో ఇంటి సభ్యులు మధ్య విద్వేషాలు రగులుతున్నాయి. చిన్న చిన్న సిల్లీ గొడవలు పెద్దగా మారి సభ్యుల మధ్య గొడవకు దారి తీస్తున్నాయి.

Bigg Boss Telugu : Mumaith Khan Trolled For Hugging Dhanraj
అంత ఓవరాక్షన్ అవసరమా?

అంత ఓవరాక్షన్ అవసరమా?

బిగ్ బాస్ ఇంట్లో సభ్యుల ప్రవర్తన చూస్తుంటే ఇంత చిన్న విషయాలకే అంత ఓవరాక్షన్ అవసరమా? అనే ఫీలింగ్ ప్రేక్షకుల నుండి వ్యక్తం అవుతోంది. హరితేజ, ప్రిన్స్, ఆదర్శ్ మధ్య జరిగిన ఓ చిన్న గొడవే ఇందుకు నిదర్శనం.

ఏం గొడవ?

ఏం గొడవ?

ఆదర్శ్ ఏదో సరదాగా బిగ్ బాస్ ఇంట్లో వివాహితులు, అవివాహితులు అంటూ ఏదో చిన్న టాపిక్ మొదలు పెట్టాడు. దీనికి ప్రిన్స్ మద్దతు ఇచ్చాడు. అయితే దానికి హరితేజ తెగ ఫీలయిపోయి నానా రభస చేసింది. ఈ క్రమంలోనే ప్రిన్స్,. హరితేజ మధ్య గొడవ నెలకొంది. దీంతో హరితేజ ఏడ్చేసింది. తర్వాత ప్రిన్స్ సారీ చెప్పి కూల్ చేసేశారు.

మధు ప్రియ ఏడ్చేసింది

మధు ప్రియ ఏడ్చేసింది

చలిమంట ఆరకుండా చూసుకునే టాస్క్‌లో హరిప్రియ, అర్చన, మధుప్రియలు మధ్య చిన్న వివాదం రేగింది. అర్చన, మధు ప్రియ మధ్య చిన్న ఇగో ఇష్యూ చోటు చేసుకుంది. చలి ముంట ముందు కూర్చునే ప్లేసు విషయంలో చాలా సిల్లీ రీజన్‌తో ఈ గొడవ జరుగడం గమనార్హం.

నాలుగో రోజు ఆకట్టుకోలేదు

నాలుగో రోజు ఆకట్టుకోలేదు

నాలుగో రోజు బిగ్ బాస్ ఇంట్లో జరిగిన పరిణామాలు పెద్దగా ఆకట్టుకోలేదనే అభిప్రాయాలు ప్రేక్షకుల నుండి వ్యక్తం అవుతున్నాయి. బిగ్ బాస్ ఇంటి సభ్యుల ప్రవర్త ఆర్టిఫిషియల్ గా ఉందనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

English summary
Bigg Boss Telugu entering into controversial zone. Day 4 A Secret Task For Sameer Bigg Boss asks Sameer to secretly prevent some contestants' luggage from reaching them. Bigg Boss Telugu is the Telugu-language version of the reality TV programme Bigg Boss broadcast in India. It follows the Big Brother format, which was first developed by Endemol in the Netherlands.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu