Monal Gajjar: ఆ రాత్రి అదే చివరి మాట.. హార్ట్ ఎటాక్‌తో ఈ లోకాన్ని వీడి.. భోరుమన్న మోనాల్!
తన తండ్రి గురించి మోనాల్ చెప్పిన మాటలను గుర్తు పెట్టుకొన్న హోస్ట్, డైరెక్టర్ ఓంకార్.. ఆమెను మరోసారి భావోద్వేగానికి గురి చేశారు. డ్యాన్సీ ప్లస్ షో ఫినాలే సందర్భంగా మోనాల్‌కు చిన్న గిఫ్ట్ అంటూ పిలిచారు. ఆ ఫోటోను విప్పగానే మోనాల్ కన్నీటి పర్యంతం అయ్యారు. మోనాల్ కంటతడి పెట్టడానికి కారణం ఏమిటంటే..

బిగ్‌బాస్ తెలుగు 4లో కూడా
బిగ్‌బాస్ తెలుగు 4లో కూడా తన ఫ్యామిలీ ఫోటో గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. అదే విషయాన్ని మోనాల్ డ్యాన్సీ ప్లస్ షోలో వెల్లడిస్తూ.. తన తండ్రి మరణానికి ముందు తీసుకొన్న చివరి ఫోటో తనకు ఎమోషనల్ అని చెప్పింది. ఆ ఫోటోకు ధీటుగా ఓంకార్ మరో ఫోటోను ఓ ఆర్టిస్టు చేత గీయించి బహుమతిగా ఇచ్చారు.

పంచెకట్టులో మోనాల్ తండ్రి ఫోటో
మంచి పంచెకట్టులో సంప్రదాయంగా ఉన్న మోనాల్ తండ్రి ఆమె భుజంపై చేయి వేయడం.. ఆ ఫోటోలో మోనల్ గజ్జర్ కట్టుబొట్టుతో అందంగా తయారై ఉన్నారు. ఆ ఫోటోను చూడగానే మోనాల్ ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. వెంటనే ఆమె కంటి నుంచి పటపటా నీళ్లు కారాయి. కాసేపు ఓ రకమైన ఎమోషనల్ లోనయ్యారు.

జడ్జీలందరూ భావోద్వేగానికి గురై
మోనల్ బాధను చూసి ఆ షోలోని జడ్జీలు అని మాస్టర్, మమైత్ ఖాన్, శేఖర్ మాస్టర్, బాబా భాస్కర్ తదితరులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. మమైత్ ఖాన్ కంటతడి పెడుతూ కనిపించింది. అని మాస్టర్ పొంగుకొస్తున్న బాధను అణిచివేసుకొంటూ కనిపించింది. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, జోష్‌గా సాగుతున్న షో ఒక్కసారిగా ఎమోషనల్ వాతావరణంతో నిండిపోయింది. డాన్సీ ప్లస్ షోలో మోనాల్ మాట్లాడిన మాటలను వీడియో రూపంలో ప్రదర్శించారు

నా తండ్రితో అదే చివరి ఫోటో
డాన్సీ ప్లస్ షోలోని ఓ ఎపిసోడ్‌లో తన ఫ్యామిలీ ఫోటో గురించి చెబుతూ మోనాల్ గజ్జర్ ఎమోషనల్ అవుతూ నా వద్ద ఒకే ఒక ఫ్యామిలీ ఫోటో. మేమంత కలిసి దిగిన చివరి ఫోటో అది. నా తండ్రితో దిగిన చివరి ఫోటో అది. నాకు నాన్న అంటే చాలా ఇష్టం అంటూ డాన్సీ షో సందర్భంగా తన తండ్రిపై ఉన్న గౌరవాన్ని చెప్పి ఎమోషనల్ అయ్యారు.

15 ఏళ్ల వయసులో నాన్నను కోల్పోయా
ఆ ఎపిసోడ్‌లోనే మోనాల్ మాట్లాడుతూ.. నా 15 ఏటా మా నాన్నను కోల్పోయాను. తండ్రిలేని బాధ ఏంటో నాకు తెలుసు. ఫాదర్ అంటే సర్వస్వం. ముఖ్యంగా అమ్మాయిలకు తండ్రి అంటే చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. నేను ఎప్పుడూ నా తండ్రిని మిస్ అవుతూనే ఉంటాను అని మోనాల్ గజ్జర్ అన్నారు.

రాత్రి ఓ గ్లాస్ వాటర్ ఇచ్చా..
మా నాన్న హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. చనిపోవడానికి ముందు రోజు రాత్రి ఓ గ్లాస్ వాటర్ కావాలని అడిగారు. దాంతో నేను ఓ గ్లాస్ వాటర్ ఇచ్చాను. తాగి ఆయన పడుకొన్నాడు. ఉదయం లేచే సరికి ఆయన తుదిశ్వాస విడిచారు. తల్లిదండ్రులను ముఖ్యంగా ఫాదర్‌ను ప్రతీ ఒక్కరు రెస్పెక్ చేయాలి అని మోనాల్ చెప్పారు.
Recommended Video

పెయింటర్ దీపక్‌కు థ్యాంక్స్
మోనాల్ తండ్రి ఫోటోను అద్బుతంగా పెయింట్ చేసిన దీపక్‌కు థ్యాంక్స్ చెప్పాలి అంటూ హెస్ట్ ఓంకార్ అన్నారు. అద్బుతమైన బహుమతిని అందించిన ఆయన దీపక్ చెప్పిన మాటలను వెల్లడిస్తూ.. మోనాల్ చెప్పిన మాటలు నా హార్ట్ టచ్ చేశాయి. అందుకే ఈ పెయింటింగ్ వేశాను అని అన్నాడు. అందుకే ఎంకరేజ్ చేసి ఫోటో వేయించాను అని ఓంకార్ అన్నాడు. మోనాల్ కూడా దీపక్‌కు థ్యాంక్స్ చెప్పారు.


Click it and Unblock the Notifications











