‘నాగార్జున తప్పుగా మాట్లాడుతారు.. బిగ్ బాస్ హౌజ్‌లో అస్సలు ఛాన్స్ ఇవ్వరు’

టాలీవుడ్ యంగ్ హీరోయిన్, బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పుట్టి పెరిగిన ఆమె తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత నటిగా అవకాశాలను అందుకోవడం ప్రయత్నించింది. బీటెక్, ఎల్ఎల్బీ డిగ్రీలను పూర్తి చేసుకున్న సోనియా ఆకుల 2019 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా కనిపిస్తోంది. తనకు వచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకుంటూ నటిగా మరింత గుర్తింపు తెచ్చుకుంటోంది.

సినిమాలో వెండితెరపై అలరించడమే కాకుండా రియాలిటీ షోల్లోనూ పాల్గొంటూ వస్తోంది. తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ద్వారా ఆకుల సోనియా కంటెస్టెంట్ గా బుల్లితెర ప్రేక్షకులకు మరింతగా దగ్గరైంది. అయితే ఈ సీజన్ లో ఆకుల సోనియా ఎలిమినేషన్ ను అందరినీ షాక్ కు గురి చేసింది. కాగా రీసెంట్ ఇంటర్వ్యూలో తన ఎలిమినేషన్ అన్యాయమని చెప్పుకొచ్చింది. అందుకు కారణం హోస్ట్ అక్కినేని నాగార్జుననే కారణమని షాకింగ్ కామెంట్స్ చేసింది.

Bigg Boss Telugu fame Soniya Akula Shocking Comments about Akkineni Nagarjuna

రీసెంట్ ఇంటర్వ్యూలో ఆకుల సోనియా మాట్లాడుతూ.. నేను బిగ్ బాస్ సీజన్ 8లో హౌజ్ నుంచి ఎలిమినేషన్ అవ్వడానికి ముందు శనివారం వరకు అసలు విషయం అర్థం కాలేదు. ఆ శినవారంతో నాకు అర్థమైంది ఒక విధానమైతే. అప్పటికి మరో విషయం తెలిసిందే. అసలు బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లడానికి ముందుకు కూడా నాకు కొన్ని విషయాలు చెప్పారు. ప్రతి శనివారం జడ్జిమెంట్ లాగా ఉంటుంది. ప్రతి వీకెండ్ లో ఆ వారం మీరు చేసిన తప్పులన్నీ తెలియచేస్తాడు. వాటిని వచ్చే వారంలో పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పారు.

హోస్ట్ నాగార్జున చెప్పేవి స్పష్టంగా వినండి అని హౌజ్ లోకి వెళ్లడాని కంటే ముందే చెప్పారు. ఇక నేను ఎలిమినేషన్ అయ్యే వారం కూడా అదే జడ్జిమెంట్ అయ్యి ఉంటుందని అనుకున్నాను. ఆ సీజన్ లో 3వ వారం నాగార్జున సార్ నా విషయంలో తప్పుగానే మాట్లాడారు. అప్పటికే సైలెంట్ గా ఉన్నారు. ఇక మన వెర్షన్ చెబుదామంటే అస్సలు ఛాన్స్ ఇవ్వరు. నేను మాట్లాడాలని అనుకుంటున్నానని చేయి ఎత్తి చాలా సేపు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. నేను ఎంత సేపు మాట్లాడాలని కోరినా నన్ను మాట్లాడనివ్వలేదని చెప్పుకొచ్చింది. అలా తన ఎలిమినేషన్ జరిగిందని చెప్పింది.

ఇక సోనియా ఆకుల తొలిసారిగా జార్జిరెడ్డి అనే చిత్రంలో హీరోకు చెల్లెలు పాత్రలో మెరిచింది. ఈ చిత్రం 2019లో విడుదలై మంచి హిట్ ను అందుకుంది. దాంతో సోనియా ఆకులకు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నుంచి బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాల్లో లీడ్ గా అవకాశం దక్కింది. కరోనా వైరస్, ఆశా ఎన్ కౌంటర్ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పెద్దగా సినిమాలేవీ ప్రకటించలేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తర్వాత ఇస్మార్ట్ జోడీ సీజన్ 2లో కంటెస్టెంట్ గా మెరిసింది. ఇక నెక్ట్ తను ఎలాంటి సినిమాలతో అలరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X