Bigg Boss Telugu OTT ఫస్ట్ ఓటీటీ సీజన్‌లో పాల్గొనే సెలబ్రిటీలు వీరే.. షో ప్రారంభమయ్యే రోజు ఎప్పుడంటే?
తెలుగు వినోద రంగంలో తొలిసారి ఓటీటీ ద్వారా బిగ్‌బాస్ రియాలిటీ షోను ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ షోను వినూత్నంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేశారు. ముందుగా తమిళంలో ఓటీటీ షో ప్రారంభం కానున్నది. ఆ తర్వాతే తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుందని చెబుతున్నారు. అయితే ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నిర్వాహకులు పరిశీలిస్తున్న పేర్ల వివరాల్లోకి వెళితే...

తెలుగులో ప్రయోగాత్మకంగా ఓటీటీ షో
బిగ్‌బాస్ తెలుగు 5 షోను దిగ్విజయంగా ముగించుకొన్న స్టార్ మా ఛానెల్, ఎండెమాల్ షైన్ ఇండియా మరో షోకు వెంటనే ప్లాన్ చేశారు. హిందీలో గతేడాది ఓటీటీలో 24 గంటలపాటు ప్రసారం చేసిన బిగ్‌బాస్ షోను తెలుగు ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేశారు. అయితే ఈ షోను ఫిబ్రవరి మూడో వారంలో ప్రారంభించాలని నిర్ణయించినట్టు ఇటీవల హోస్ట్ నాగార్జున వెల్లడించారు.

త్వరలోనే క్వారంటైన్‌కు సెలబ్రిటీలు
బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు షోలో పాల్గొనే సెలబ్రిటీలను ఎంపిక దశ ముగింపుకు వచ్చినట్టు సమాచారం. త్వరలోనే సభ్యులు ఎంపికను పూర్తి చేసి వారిని క్వారంటైన్‌కు తరలించాలని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం కారణంగా సెలబ్రిటీలను త్వరగా ఎంపిక చేసి వారిని ఐసోలేషన్‌లో ఉంచి.. షోలోకి పంపే ముందు తగిన పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు.

సెలబ్రిటీల జాబితా ఇదే..
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో పాల్గొనే సెలబ్రిటీలు వీరే అంటూ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన జాబితా ప్రకారం.. సినీ హీరో నవదీప్ ఒకరు కాగా, యూట్యూబర్స్, యాంకర్లలో వైష్ణవి చైతన్య, మౌనిక రెడ్డి, యాంకర్ వర్ష్, దిల్‌సే మహబూబ్, సిరి హన్మంతు బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్, మౌనికారెడ్డి, శ్రీ విద్య, శ్వేతా నాయుడు తదితరులు ఉన్నారు.

నవదీప్, మెహబూబ్ దిల్ సే స్పెషల్ ఎట్రాక్షన్
ఇక నవదీప్, మెహబూబ్ దిల్‌సే విషయానికి వస్తే.. ఇద్దరు గతంలో బిగ్‌బాస్ తెలుగు షోలో పాల్గొన్నారు. టాలీవుడ్ యాక్టర్ నవదీప్ గతంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొన్నారు. టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా టైటిల్ కోసం పోటీ పడ్డాడు. ఇక మెహబూబ్ దిల్‌సే విషయానికి వస్తే.. ఆయన బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో ప్రేక్షకులను మెప్పించారు. సోహైల్‌తో ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారిన విషయం తెలిసిందే.
Recommended Video

ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభం?
తొలి బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షో ప్రముఖ ఓటీటీ యాప్ డిస్నీ+హాట్ స్టార్‌లో ప్రసారం కానున్నది. ఈ షో కోసం అన్నపూర్ణ స్టూడియోలో సెట్‌ను డిజైన్ చేయడమే కాకుండా వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి మూడో వారం అంటే.. 20వ తేదీన ఈ షో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. ఈ షోకు హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించనున్నారు.


Click it and Unblock the Notifications











