Don't Miss!
- News
హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Sports
టీ20ల్లో టాప్ ప్లేయర్లు.. వన్డేల్లో మాత్రం వేస్ట్.. టీమిండియా స్టార్ కూడా!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Bigg Boss OTT: RRR సింగర్‌కు అదిరిపోయే ఆఫర్.. రెండు సీజన్లలో మిస్సైనా ఇప్పుడు ఫిక్స్
బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ షో దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా తెలుగులో వచ్చే షో మాత్రం అన్నింటి కంటే ఎక్కువగా ఆదరణను దక్కించుకోవడంతో పాటు దేశంలోనే నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదింటిని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌తో సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. ఇక, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ సింగర్‌కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారని తెలిసింది. ఇంతకీ ఎవరా సింగర్? పూర్తి వివరాలు మీకోసం!

ఐదు సీజన్లు పూర్తి... అన్నీ సక్సెస్
ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చినా.. ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్‌ను అందుకుని చాలా తక్కువ సమయంలోనే సక్సెస్‌ఫుల్ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. అంతేకాదు, ఏకంగా ఐదు సీజన్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. అదే సమయంలో భారీ టీఆర్పీ రేటింగ్‌తో దేశంలోనే నెంబర్ వన్ షోగా మన బిగ్ బాస్ రికార్డులు క్రియేట్ చేసింది.
టాప్ విప్పేసి మరీ రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: తొలిసారి ఇంత ఘాటుగా కనిపించిన వకీల్ సాబ్ భామ

ఓటీటీ వెర్షన్‌ను తీసుకొస్తున్నారు
తెలుగు బిగ్ బాస్ ఐదో సీజన్ కొద్ది రోజుల క్రితమే ముగిసిన విషయం తెలిసిందే. ఫినాలే వేదికపైనే షో నిర్వహకులు అదిరిపోయే ప్రకటన చేశారు. అందులో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ వన్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఇది త్వరలోనే మొదలు కానుందని కూడా వెల్లడించారు. ఆ తర్వాత కూడా నాగార్జున దీని గురించి మాట్లాడి ఓటీటీ వెర్షన్‌పై అంచనాలు పెంచేశాడు.

24 గంటలు ఆ ఓటీటీలో ప్రసారం
2021లోనే హిందీలో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను కూడా మొదలైంది. అక్కడ ప్రయోగాత్మకంగా వచ్చిన దీనికి నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఇది కూడా విజయవంతం అయింది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా దీన్ని ప్రారంభించబోతున్నారు. దీనికి కూడా నాగార్జునే హోస్ట్ చేయనున్నారు. ఈ షోను హాట్‌స్టార్‌లో 24 గంటలూ ప్రసారం చేయబోతున్నారు.
Bigg Boss OTT: బిగ్ బాస్ ప్రేమజంటకు అదిరిపోయే ఆఫర్.. మరోసారి హౌస్‌లో రొమాన్స్ చేసేందుకు రెడీ

చివరి దశకు కంటెస్టెంట్ల ఎంపిక
బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కాబోతుంది అంటేనే అందులో ఎవరు పాల్గొంటారు అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. ఇప్పుడు ఓటీటీ వెర్షన్ గురించి కూడా ప్రేక్షకులు అలాగే ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల ఎంపిక ఎప్పుడో మొదలైంది. అంతేకాదు, చాలా మందిని ఇంటర్వ్యూలు చేసిన తర్వాత షార్ట్ లిస్టును కూడా రెడీ చేసి పెట్టారని తాజాగా తెలిసింది.

ఈ సీజన్‌లోకి వాళ్లు కూడా ఎంట్రీ
మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్‌కు సంబంధించి ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ సీజన్ కోసం గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లను కూడా తీసుకు రాబోతున్నారట. అందులోనూ మొదటి నాలుగు సీజన్ల కంటెస్టెంట్లు ముగ్గురు నలుగురు ఇందులో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
దీప్తి సునైనాకు షణ్ముఖ్ ముద్దులు: బెడ్‌పై ఒకరి మీద ఒకరు పడుకుని.. బ్రేకప్ తర్వాత బయటకొచ్చిన వీడియో

బిగ్ బాస్ ఓటీటీలోకి RRR సింగర్
ఓటీటీ మొదటి సీజన్‌కు సంబంధించి మొత్తం 14 లేదా 15 మంది వరకూ కంటెస్టెంట్లు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో సినిమా, సీరియల్ ఇండస్ట్రీలకు చెందిన వాళ్లతో పాటు సోషల్ మీడియా స్టార్లను దింపబోతున్నారట. దీని కోసం ఇప్పటికే నిర్వహకులు చాలా మందితో చర్చలు జరిపారట. ఇందులో భాగంగానే తాజాగా RRR సింగర్‌కు ఆఫర్ ఇచ్చారట.

రెండు సీజన్లలో మిస్సైనా ఇప్పుడు
ప్రముఖ గాయకుడు హేమచంద్రతో బిగ్ బాస్ నిర్వహకులు తాజాగా చర్చలు జరిపారని ఓ న్యూస్ లీకైంది. ఇందులో పాల్గొనేందుకు అతడు వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. వాస్తవానికి నాలుగు, ఐదు సీజన్లలోనే అతడు రావాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో షోకు దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హేమచంద్రకు అదిరిపోయే ఆఫర్ ఇవ్వడంతో ఓకే చెప్పేశాడట.